
సాక్షి, ముంబై: ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. మార్జిన్ల బెడదతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకు రుణాలపై వడ్డీరేటును పెంచేందుకు నిర్ణయించింది. రుణాలపై వసూలు చేసే లెండింగ్ రేటుపై 5 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి 18నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది. దీంతో బ్యాంకు అందిస్తున్న వార్షిక ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి చేరింది.
వార్షిక రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచామనీ, జనవరి 18 నుంచి అమల్లోకి వస్తోందని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపింది. అయితే లాకింగ్ పీరియడ్‌లో పాత రుణగ్రహీతలకు పాత వడ్డీరేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం ప్రభావం కొత్తగా రుణాలను తీసుకునేవారిపై పడనుంది. మరోవైపు వడ్డీరేటును పెంచుతున్న మొట్టమొదటి వాణిజ్య బ్యాంకుగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. దీంతో మూడు సంవత్సరాలలో మొదటిసారి వడ్డీ రేటు పెంచడం కొన్ని కీలక సంకేతాలను అందిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment