న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,388 కోట్ల నికర నష్టాలు(స్టాండ్‌అలోన్) వచ్చాయి. మొండి బకాయిలు, ఇతర అనిశ్చిత అంశాలకు కేటాయింపులు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.1,505 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఆదాయం రూ.18,324 కోట్ల నుంచి రూ.20,220 కోట్లకు పెరిగింది.
► అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,711 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.7,730 కోట్లకు పెరిగాయి. కరోనా అనిశ్చితిని తట్టుకోవడానికి రూ.3,000 కోట్ల కేటాయింపులు దీంట్లో ఉన్నాయి.
► కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 1,678 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,250 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.
► స్థూల మొండి బకాయిలు 5.26 శాతం నుంచి 4.86 శాతానికి, నికర మొండి బకాయిలు 2.06 శాతం నుంచి1.56 శాతానికి తగ్గాయి.
► గత క్యూ4లో నిర్వహణ లాభం 17 శాతం వృద్ధితో రూ.5,851 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.6,808 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.55 శాతంగా ఉంది.
► రిటైల్ రుణాలు 24 శాతం, కార్పొరేట్ రుణాలు11 శాతం పెరిగాయి. మొత్తం మీద రుణవృద్ధి 15 శాతంగా ఉంది.
► రిటైల్ రుణాలు 24%, కార్పొరేట్ రుణాలు11% పెరిగాయి. మొత్తం మీద రుణవృద్ధి 15%గా ఉంది.
మార్కెట్ ముగిసిన తర్వాత çఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం బ్యాంక్ షేర్ 6.6 శాతం లాభంతో రూ.455 వద్ద ముగిసింది.
చదవండి: 49 రోజుల తర్వాత లాక్‌డౌన్ పూర్తిగా..
యాక్సిస్ బ్యాంక్ నష్టాలు రూ.1,388 కోట్లు
Published Wed, Apr 29 2020 3:41 AM | Last Updated on Wed, Apr 29 2020 3:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment