
ఎస్.కె. శర్మ
భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) కొత్త సీఎండీగా ఎస్.కె. శర్మ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
బెంగళూరు: భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) కొత్త సీఎండీగా ఎస్.కె. శర్మ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1978లో కంపెనీలో చేరిన ఆయన హైదరాబాద్, బెంగళూరు, ఘజియాబాద్ ప్లాంట్లలో వివిధ హోదాల్లో పనిచేశారని బీఈఎల్ పేర్కొంది. సైనిక దళాల కోసం భారీస్థాయి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్(యుద్ధ) ప్రాజెక్టులను, నావికాదళ సంబంధ ఈఎస్‌ఎం సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని బీఈఎల్ వివరించింది.