Bharat Electronics Limited
-
రైల్వేలో మానవ రహిత సిగ్నలింగ్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాలను నివారించే దిశగా త్వరలోనే ఆధునిక అన్‌మేన్డ్ ఆటోమేషన్ సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే శాఖ ప్రవేశపెట్టబోతోంది. దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ‘ఇండీజినస్ కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ (ఐ–సీబీటీసీ) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. సంప్రదాయ వ్యవస్థకు మంగళం భారతీయ రైల్వే దశాబ్దాలుగా సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థనే కొనసాగిస్తోంది. ట్రాక్ సర్క్యూట్లు, యాక్సెల్ కౌంటర్ల ద్వారా రైళ్ల గమనాన్ని తెలుసుకుంటూ రంగుల లైట్ల ద్వారా రైళ్ల లోకో పైలట్లకు సిగ్నల్స్ తెలిపే విధానాన్ని అనుసరిస్తోంది. రైళ్ల గమనాన్ని తెలుసుకోడానికి, నియంత్రించడానికి ఈ విధానం సరైనదే. కానీ.. మన దేశంలోని 68,103 కి.మీ. పొడవైన రైల్వే ట్రాక్‌లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి ప్రస్తుత వ్యవస్థ సరిపోవడం లేదు. అందుకే ప్రస్తుత సిగ్నలింగ్ స్థానంలో ఐ–సీబీటీసీ పేరుతో పూర్తిగా మానవ రహిత సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించనుంది. చదవండి: (ఉద్యోగులకు సీఎం జగన్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు: సజ్జల) -
అనంతపురం బీఈఎల్‌కు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రక్షణరంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌కు లైన్ క్లియర్ అయింది. శుక్రవారం ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో ఎటువంటి పెనాల్టీలు లేకుండా యూనిట్ ఏర్పాటుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. రాడార్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ, రక్షణరంగ ఉత్పత్తుల (మిస్సైల్ మాన్యుఫాక్చరింగ్) యూనిట్ కోసం ఏపీఐఐసీ 2016లో 914 ఎకరాల భూమిని కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో అనుమతుల జాప్యం వల్ల యూనిట్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడలేదు. సకాలంలో యూనిట్ పనులు ప్రారంభించకపోవడంతో ఏపీఐఐసీ నోటీసులు జారీచేసింది. దీంతో బీఈఎల్ ప్రతినిధులు ఇటీవల ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యాన్ని కలిసి యూనిట్ ఏర్పాటుకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని కోరారు. భూములు కేటాయించినా పనులు మొదలుపెట్టని మరికొన్ని కంపెనీలకు సమయం ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు గోవిందరెడ్డి చెప్పారు. చదవండి: (కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా) రూ.50 కోట్లలోపు పెట్టుబడి ఉన్న చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా తన సొంత జిల్లా అనంతపురం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. బోర్డు సమావేశంలో ఎండీ సుబ్రమణ్యం ఏపీఐఐసీ మూడేళ్ల ప్రగతిని వివరించారు. గత మూడేళ్లలో కరోనా విపత్తు వచ్చినప్పటికీ 93 పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుకోసం రూ.1,708 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. మే 2019 నుంచి నేటివరకు 8,616 ఎకరాల భూమిని సమీకరించినట్లు తెలిపారు. గత మూడేళ్లలో 2,450 ఎంఎస్ఎంఈలకు భూమి కేటాయించినట్లు చెప్పారు. ఆ భూముల్లో 377 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరిగిన భూ కేటాయింపుల ద్వారా రూ.52,161 కోట్ల పెట్టుబడులు, 2,31,309 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. -
బెల్, హైదరాబాద్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), హైదరాబాద్ యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 84 ► పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్లు–33, ప్రాజెక్ట్ ఇంజనీర్లు–51. ► ట్రెయినీ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ప్రాజెక్ట్ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు. వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐ.ఈ.నాచారం, హైదరాబాద్–500076, తెలంగాణ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరితేది: 31.12.2021 ► వెబ్సైట్: bel-india.in -
బెల్, మచిలీపట్నంలో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), మచిలీపట్నం(ఏపీ) యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 15 ► పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్–06, మెకానికల్–06, కంప్యూటర్ సైన్స్–03. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.» వయసు: 01.11.2021 నాటికి 28ఏళ్లు మించకుండా ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, వైవా వాయిస్ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కుల్లో.. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 75 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు కేటాయిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్(హెచ్ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం–521001, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021 ► వెబ్సైట్: bel-india.in -
ఎన్టీపీసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌పై రోడ్‌షోలు
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ప్రభుత్వ వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రక్రియ జోరందుకుంది. ఇందుకోసం ఆయా కంపెనీలు, డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం రోడ్ షోలు చేపట్టాయి. ఎన్టీపీసీ విద్యుత్ శాఖ, డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం ఈ నెల 5-10 దాకా సింగపూర్, హాంకాంగ్, లండన్, అమెరికాల్లో ఏకకాలంలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, న్యూయార్క్‌లో రోడ్‌షోలు ఉంటాయని వివరించాయి. ప్రస్తుత షేర్ల ధరల ప్రకారం ఎన్టీపీసీలో 5 శాతం వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి కనీసం రూ. 5,200 కోట్లు, బీఈఎల్‌లో 5 శాతం డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 1,400 కోట్లు రాగలవని అంచనా. రోడ్‌షోల్లో ఇన్వెస్టర్ల స్పందన, దేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులను బట్టి రెండు సంస్థల్లోనూ డిజిన్వెస్ట్‌మెంట్ చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో నాలుగు సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ఖజానాకు రూ. 12,600 కోట్లు వచ్చాయి. -
బెల్ కంపెనీ.. తరలిపోతోంది
మచిలీపట్నం : మచిలీపట్నానికి మణిహారంగా ఉండి దేశ రక్షణ శాఖకు కీలకమైన పరికరాలను ఉత్పత్తి చేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను పామర్రు మండలం నిమ్మలూరుకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. నిమ్మలూరు రెవెన్యూ పరిధిలోని 50.54 ఎకరాల భూమిని సేకరించేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం బస్టాండ్ పక్కనే ఉన్న బెల్ కంపెనీని నిమ్మలూరుకు తరలించి రూ.110 కోట్ల వ్యయంతో అక్కడ నూతనంగా ఈ కంపెనీని నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెల్ కంపెనీకి ఇచ్చే భూమి నిమ్మలూరు సమీపంలో ఉన్నా నిమ్మకూరుకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ కంపెనీని తరలించేందుకు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, విజయవాడలోని ఓ స్టార్ హోటల్ యజమాని దగ్గరి బంధువు, బందరు బెల్ కంపెనీలో అత్యున్నత పదవిలో ఉన్న ఓ ఉద్యోగి తెరవెనుక మంత్రాంగం నడిపారనే వాదన వినిపిస్తోంది. దేవాదాయశాఖ భూముల్లో బెల్ పామర్రు మండలం నిమ్మకూరు సమీపంలోని నిమ్మలూరు వద్ద బెల్ కోసం సేకరించనున్న 50.54 ఎకరాల భూమి మచిలీపట్నంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధీనంలో ఉంది. గతంలోనే ఇక్కడ బెల్ కంపెనీని నిర్మించేందుకు ప్రతిపాదన చేయగా, దేవస్థానం ట్రస్టీలు అంగీకరించక కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులు తెరవెనుక మంత్రాంగం నడిపి.. ఆలయ ట్రస్టీలు అంగీకరిస్తే ఈ భూమిని బెల్ కంపెనీ కోసం తీసుకోవచ్చని దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి లేఖ రాయించినట్లు కలెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. పాలకుల ఒత్తిడి మేరకు జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ ట్రస్టీలతో సంప్రదింపులు జరిపి ఒప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో భూ సేకరణకు నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేశారు. బెల్ కంపెనీని విస్తరించేందుకు మచిలీపట్నం గోసంఘానికి చెందిన 25 ఎకరాల భూమి కేటాయించేందుకు అప్పట్లో కలెక్టర్‌గా పనిచేసిన రిజ్వీ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకొచ్చాక బెల్ కంపెనీని నిమ్మకూరు సమీపానికి తరలించేందుకు గట్టి ప్రయత్నాలు జరగటం గమనార్హం. ప్రజా ఉద్యమాలతో అడ్డుకుంటాం... బందరులోని ఏకైక పరిశ్రమను నిమ్మలూరుకు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, దీనిని ప్రజాఉద్యమం ద్వారా అడ్డుకుని తీరుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లు రవీంద్ర తన మంత్రి పదవి కోసం బెల్ కంపెనీని తాకట్టు పెట్టి జన్మనిచ్చిన ఊరుకు అన్యాయం చేశారన్నారు. బెల్ కంపెనీని మచిలీపట్నంలోనే విస్తరిస్తామని ఒకటికి పదిసార్లు మాట ఇచ్చిన మంత్రి తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. అన్ని ప్రజాసంఘాలను కలుపుకొని బెల్ కంపెనీ తరలిపోకుండా ఉద్యమం చేస్తామని చెప్పారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కన్వీనరు షేక్ సలార్‌దాదా, నాయకులు లంకే వెంకటేశ్వరరావు, చిటికిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి నివేదికలు రెడీ
నేడు ప్రీ బడ్జెట్ సదస్సు సీఎం ముందుకు కీలక ప్రతిపాదనలు మచిలీపట్నం : నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలను బుధవారం విజయవాడ నగరంలో జరగనున్న ప్రీ బడ్జెట్ రాష్ట్రస్థాయి సదస్సులో ప్రస్తావించేందుకు అధికారులు, మంత్రులు నివేదికలు సిద్ధం చేశారు. ఇన్చార్జ్ కలెక్టర్ జె.మురళి, ట్రైనీ కలెక్టర్ సృజన నేతృత్వంలో ఈ నివేదికలను తయారుచేశారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ అం శాలు ఈ సదస్సులో చర్చించేందుకు మంత్రులు సిద్ధమైనట్లు సమాచారం. మచి లీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రూ.760 కోట్లతో టెండర్లు పిలిచింది. వివిధ కారణాలతో నిలిచిపోయాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ మధుకాన్ పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. భూ సేకరణ 80శాతానికి పైగా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను రూ. 150 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలని మూడేళ్లుగా ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు. బెల్ కంపెనీ విస్తరణపై బుధవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి కొల్లు రవీంద్ర ‘సాక్షి’కి చెప్పారు. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 370 కిలోమీటర్ల మేర కోస్తా జాతీయ రహదారి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. గతంలోనే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పనులు జరగడం లేదు. ఈ రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. కృష్ణా యూనివర్సిటీకి నూతన భవనాలను సమకూర్చేందుకు రూ.77 కోట్ల నిధులు అవసరమవుతాయని నిర్ణయించారు. మొదటి విడతగా రూ. 7కోట్ల నిధులు విడుదలయ్యాయి. యూనివర్సిటీ అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒప్పించేందుకు మంత్రులు సంసిద్ధులవుతున్నట్లు సమాచారం. కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రా జాతీయ కళాశాలను అభివృద్ధి చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. మంగినపూడి బీచ్ అభివృద్ధికి సంబంధించిన వివరాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేదికలను అధికారులు సిద్ధం చేశారు. బందరు పోర్టు పనులను అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ప్రారంభిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోర్టు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభింపజేయాలని మంత్రులు, అధి కారులు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రైతు సాధికార సంస్థకు నిధుల కేటాయింపు, రుణమాఫీ, గన్నవరం ఎయిర్‌పోర్టుపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రి అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకువచ్చేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. తుళ్లూరులో రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించిన అనంతరం విజయవాడలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలను నివరించేందుకు నివేదికలు రూపొందించారు. డెల్టా ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు కాలువల ఆధునికీకరణ పైనా నివేదికలు తయారు చేశారు.అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కూచిపూడి గ్రామాన్ని, నాట్య మండలిని రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసే అంశంపైనా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. కృష్ణానదిలో ఉన్న భవానీ ఐల్యాండ్ అభివృద్ధి చేసే అంశంపైనా ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిసింది. -
ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ విభాగాలు: ఎలక్ట్రానిక్స్(9), మెకానికల్ (11), ఎలక్ట్రికల్(2) అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. - టెక్నీషియన్ ‘సి’ విభాగాలు: ఎలక్ట్రానిక్స్(3), ఫిట్టర్(9), వెల్డర్(2) అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1 వెబ్సైట్: www.bel-india.com/ -
‘బెల్’కు 25 ఎకరాల భూమి
గో సంఘం వద్ద భూమి కేటాయింపునకు రంగం సిద్ధం రూ. 150 కోట్లతో అధునాతన కంపెనీ నిర్మాణం మచిలీపట్నం : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)కు 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మచిలీపట్నంలోని దేశాయిపేట సమీపంలో ఉన్న గో సంఘంలో 25 ఎకరాల భూమిని బెల్ కంపెనీకి ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందం కుదిరింది. భూమిని అప్పగిస్తే రూ.150 కోట్లతో కంపెనీని విస్తరించనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బెల్ కంపెనీని ఇక్కడ నిర్మించనున్నారు. మూడేళ్ల క్రితం ఈ కంపెనీని మచిలీపట్నం నుంచి గన్నవరం తదితర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో దీన్ని మచిలీపట్నంలోనే ఉంచాలనే డిమాండ్ వచ్చింది. దీంతో అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), కలెక్టర్ ఎస్ఏఎం రిజ్వీ కంపెనీకి మచిలీపట్నంలోనే భూమి కేటాయించేందుకు కసరత్తు చేశారు. గో సంఘంలోని 25 ఎకరాల భూమిని అప్పట్లో రాజీవ్ గృహకల్ప పథకానికి కేటాయించారు. ఇప్పుడు బెల్‌ను విస్తరించేందుకు భూమి అవసరం అవడంతో బెల్ కంపెనీ అధికారులను తీసుకొచ్చి భూమిని చూపించారు. కంపెనీ నిర్మించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే గోసంఘం భూమిని బెల్ కంపెనీకి ఇవ్వకూడదంటూ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ కేసుకు సంబంధించి క్లియరెన్స్ రావడంతో రెవెన్యూ అధికారులు బెల్ కంపెనీకి గో సంఘంలోని 25 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. -
ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) కాంట్రాక్టు పద్ధతిన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ఇంజనీర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అర్హతలు: ప్రథమ శ్రేణిలో ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం. వయసు: 25 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: ఆగస్టు 30 వెబ్సైట్:www.bel-india.com -
సిగ్నల్ కష్టాలకు చెక్
అల్ఫాన్యూమరికల్ టైమర్ల ఏర్పాటు దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో అమలు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ట్రైల్ రన్ సక్సెస్ 221 జంక్షన్లలో ఏర్పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కష్టాలకు చెక్ పడనుంది. అల్ఫాన్యూమరికల్ టైమర్లు ఏర్పాటు ద్వారా వాహనదారుల అవస్థలు తప్పనున్నాయి. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అది సక్సెస్ కావడంతో నెలరోజుల్లో నగరంలోని 221 జంక్షన్ల వద్ద వీటిని అమర్చనున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కసరత్తు ప్రారంభించారు. హెచ్‌ట్రీమ్స్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. సిగ్నల్ పాయింట్ల వద్ద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కంపెనీ తయారు చేసిన ఆల్ఫాన్యూమరికల్ లైట్లను ఏర్పాచేయనున్నారు. వీటి ద్వారా సిగ్నల్స్ దగ్గర నిరీక్షణ తప్పనుంది. వాహనాలు లేని వైపు రెడ్ సిగ్నల్.. రద్దీ ఉన్న వైపు గ్రీన్‌సిగ్నల్ పడనుంది. నగరంలో అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేడెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్-ట్రిమ్స్)ను గతేడాది ఫిబ్రవరిలో అప్పటి ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నగరంలో సుమారు 221 జంక్షన్లలో దీనిని ఏర్పాటు చేశారు. పాదచారుల కోసం ప్రత్యేకంగా సదుపాయం కల్పించారు. నాలుగు రూట్లలో ఉన్న ట్రాఫిక్‌ను ఒకేసారి ఆపేసి నాలుగు వైపుల ఉన్న పాదచారులు ఒకేసారి రోడ్డు దాటేందుకు అనువుగా సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించారు. సోలార్ పవర్‌తో ఇవి పనిచేస్తాయి. తాజాగా సిగ్నల్స్ వద్ద అల్ఫాన్యూమరికల్ టైమర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్ఫాన్యూమెరికల్ టైమర్లు.... రెడ్..గ్రీన్..ఎల్లో లైట్ల మాదిరిగానే అల్ఫాన్యూమరికల్ టైమర్‌కు కూడా ప్రత్యేక లైట్‌ను కేటాయించారు. ఈ లైట్లో ఇంగ్లిష్ పదాలతో పాటు అంకెలను కూడా చూపడం ప్రత్యేకం. ఉదాహరణకు పాదచారులు దాటేటప్పుడు ‘జీవో’ అనే ఇంగ్లిష్ అక్షరాన్ని చూసిస్తుంది. వాహనాలు ఆగాల్సి వస్తే ‘స్టాప్’ అనే పదం కనిపిస్తుంది. దీంతో పాటు వాహనాలు ఎప్పుడు వెళ్లాలి..ఎప్పుడు ఆపాలి అనేవి సెకన్లలో చూపిస్తుంది. ఇలా పనిచేస్తుంది... హెచ్-ట్రీమ్స్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఉన్న చోట అల్ఫా న్యూమరికల్ టైమర్లను అమర్చుతారు. టైమర్ల పక్కనే చిన్నపాటి కెమెరాను అమరుస్తారు. ఇది చౌరస్తాలోని నాలుగు వైపుల రహదారులను కనిపెడుతుంది. మూడు సెకన్లకు మించి వాహనం చౌరస్తా లైన్ (వర్చువల్) దాటక పోతే వెంటనే రెడ్ సిగ్నల్ పడుతుంది. అలాగే రద్దీ ఉన్న వైపు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇదంతా కెమెరా సహాయంతో జరుగుతుంది. ట్రైల్న్ సక్సెస్ అల్ఫాన్యూమరికల్ టైమర్లను పదిరోజుల కిందట తెలుగుతల్లి జంక్షన్లో ఏర్పాటు చేశారు. పనితీరును నిశితంగా పరిశీలించారు. ఈ చౌరస్తాలో వాహనాల రద్దీ..టైమర్ పనిచేస్తున్న విధానంపై అధికారులు ఆరా తీశారు. మంచి ఫలితాలు వచ్చాయి. ఇది విజయవంతం కావడంతో నగరంలోని 221 చౌరస్తాల్లో వీటిని అమర్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ టైమర్లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కంపెనీ తయారు చేసింది. దేశంలోనే తొలిసారిగా నగరంలో వీటిని ఏర్పాటు చేయడం, దాని పనితీరు విజయవంతం కావడంపై బీఈఎల్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఉద్యోగాలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌లలో వివిధ పోస్టుల భర్తీకి (ఏడాది కాంట్రాక్టు ప్రాతిపదికన) గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్-10, సివిల్ ఇంజనీరింగ్-6, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-2, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-4, మెకానికల్ ఇంజనీరింగ్-1, కెమిస్ట్రీ-1, బీఫార్మసీ/ ఎమ్‌ఫార్మసీ-6. అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాటు నెట్/ స్లెట్ అర్హత ఉండాలి. అకడమిక్ అసోసియేట్లు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్-2. అర్హత: బీఆర్క్ ఉత్తీర్ణత ఉండాలి. ల్యాబ్ టెక్నీసియన్లు -3. అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో పాలిటెక్నిక్ డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్లో లభిస్తాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 28 వెబ్సైట్: www.anu.ac.in రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ మేనేజర్: డేటాబేస్-2, సెక్యూరిటీ-2, లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హార్డ్‌వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ -2, ఎంపీఎల్ఎస్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, మార్కెటింగ్-10. మేనేజర్: లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హార్డ్‌వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ -2, సెక్యూరిటీ-2, ఎంపీఎల్ఎస్-4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-8. డిప్యూటీ జనరల్ మేనేజర్-1 (ఎంపీఎల్ఎస్). డిప్యూటీ మేనేజర్: టెక్నికల్-40, ఎంపీఎల్ఎస్-8. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-2 (ఫైనాన్స్) జాయింట్ జనరల్ మేనేజర్ -1 (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కంపెనీ సెక్రటరీ (లా)-1 (జనరల్ అడ్మిన్.) అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు సీఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూన్ 28 వెబ్సైట్: www.railtelindia.com భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ (మిస్సైల్ సిస్టమ్స్ ఎస్‌బీయూ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల సంఖ్య: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-4, మెకానికల్ ఇంజనీరింగ్-4, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-4. అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. ఆర్మీ/ నేవి/ ఎయిర్ ఫోర్స్‌లో కనీసం 15 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 30 వెబ్సైట్: http://bel-india.com -
బాంద్రా-వర్లీ సీలింక్‌కు భద్రతేదీ?
సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీలింక్ భద్రత గాల్లోని దీపం మాదిరిగానే ఉంది. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఈ ప్రాజెక్ట్ ఉన్నా అధికారులు భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సీలింక్ వంతెన మీద పేలుడు పదార్థాల డిటెక్టర్లను అమర్చే కాం ట్రాక్ట్‌ను రెండేళ్ల క్రితం దక్కించుకున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ పనిని పూర్తి చెయ్యలేకపోయింది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోనే డిటెక్టర్లను అమర్చే పనులు ముగించాల్సి ఉండగా, ఏళ్లు గడుస్తున్నా ముందుకు కదలడం లేదు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) రూ.24 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. ఈ విషయమై ఎమ్మెస్సార్డీసీ చీఫ్ ఇంజినీర్ అరుణ్ డియోధర్ మాట్లాడుతూ.. ఈ కాంట్రాక్ట్‌ను నెల క్రితమే రద్దు చేశామన్నారు. అయితే 2012 సెప్టెంబర్‌లో కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు డిటెక్టర్లను ఆరు నెలల్లోపు అమర్చాలని గడువు విధించామన్నారు. అప్పటివరకు పూర్తి కాకపోవడంతో మరో రెండుసార్లు కాంట్రాక్ట్‌ను పొడిగించామని తెలిపా రు. అయితే ఒప్పందం కుదుర్చుకొని 18 నెలలు పూర్తయినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో కాంట్రాక్ట్‌ను రద్దు చేశామన్నారు. ఈ ప్రదేశంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసేందుకు పోలీ సులతో పాటు ఇతర భద్రతా ఏజెన్సీల సలహాలను కూడా తీసుకొని ఓ పట్టికను రూపొందిస్తున్నామని తెలిపారు. పేలుడు పదార్థాలను కనిపెట్టే డిటెక్టర్లు, సీసీటీవీ కెమెరాలను కూడా ఇరు వైపులా అమరుస్తామన్నారు. 5.6 కి.మీ.మేర ఉన్న ఈ బాంద్రా-వర్లీ సీలింక్ వద్ద పైన, కింది భాగాల వద్ద ఆరు సీసీటీవీ కెమెరాలను అమర్చామని తెలిపారు. అయితే భద్రతను మరింత పెంచేందుకు కొత్త టెం డర్లను ఆహ్వానిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటుం దని వివరించారు. భద్రత అవసరం... సీలింక్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 2008లో నగరంలో ఉగ్రవాదుల దాడి తర్వాత అప్పటి నగర పోలీస్ కమిషనర్ డి.శివానందన్ అత్యాధునిక పరికరాలతో భద్రతను కట్టుదిట్టం చేయమని ఎమ్మెస్సార్డీసీకి ఓ లేఖ కూడా రాశారని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రదేశం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో కూడా ఉందని అంటున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
బీఈఎల్ కొత్త సీఎండీగా ఎస్.కె. శర్మ
బెంగళూరు: భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) కొత్త సీఎండీగా ఎస్.కె. శర్మ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1978లో కంపెనీలో చేరిన ఆయన హైదరాబాద్, బెంగళూరు, ఘజియాబాద్ ప్లాంట్లలో వివిధ హోదాల్లో పనిచేశారని బీఈఎల్ పేర్కొంది. సైనిక దళాల కోసం భారీస్థాయి ఎలక్ట్రానిక్ వార్ఫేర్(యుద్ధ) ప్రాజెక్టులను, నావికాదళ సంబంధ ఈఎస్ఎం సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని బీఈఎల్ వివరించింది.