బెల్, మచిలీపట్నంలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు | BEL Machilipatnam Recruitment 2021: Vacancies, Eligibility, Salary Details Here | Sakshi
Sakshi News home page

బెల్, మచిలీపట్నంలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

Published Mon, Dec 13 2021 12:59 PM | Last Updated on Mon, Dec 13 2021 3:39 PM

BEL Machilipatnam Recruitment 2021: Vacancies, Eligibility, Salary Details Here - Sakshi

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), మచిలీపట్నం(ఏపీ) యూనిట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 15

► పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్‌–06, మెకానికల్‌–06, కంప్యూటర్‌ సైన్స్‌–03.

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.» వయసు: 01.11.2021 నాటికి 28ఏళ్లు మించకుండా ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, వైవా వాయిస్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కుల్లో.. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 75 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు కేటాయిస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌(హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రోడ్, మచిలీపట్నం–521001, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021

► వెబ్‌సైట్‌: bel-india.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement