భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), హైదరాబాద్ యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 84
► పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్లు–33, ప్రాజెక్ట్ ఇంజనీర్లు–51.
► ట్రెయినీ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► ప్రాజెక్ట్ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు. వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐ.ఈ.నాచారం, హైదరాబాద్–500076, తెలంగాణ చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరితేది: 31.12.2021
► వెబ్‌సైట్: bel-india.in
Comments
Please login to add a commentAdd a comment