ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌లలో వివిధ పోస్టుల భర్తీకి (ఏడాది కాంట్రాక్టు ప్రాతిపదికన) గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్-10, సివిల్ ఇంజనీరింగ్-6, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-2, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-4, మెకానికల్ ఇంజనీరింగ్-1, కెమిస్ట్రీ-1, బీఫార్మసీ/ ఎమ్‌ఫార్మసీ-6.
అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాటు నెట్/ స్లెట్ అర్హత ఉండాలి.
అకడమిక్ అసోసియేట్లు
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్-2.
అర్హత: బీఆర్క్ ఉత్తీర్ణత ఉండాలి.
ల్యాబ్ టెక్నీసియన్లు -3.
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో పాలిటెక్నిక్ డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 28
వెబ్‌సైట్: www.anu.ac.in
రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
న్యూ ఢిల్లీలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ మేనేజర్: డేటాబేస్-2, సెక్యూరిటీ-2, లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హార్డ్‌వేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ -2, ఎంపీఎల్‌ఎస్-2, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-2, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ-2, మార్కెటింగ్-10.
మేనేజర్: లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హార్డ్‌వేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ -2, సెక్యూరిటీ-2, ఎంపీఎల్‌ఎస్-4, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-2, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ-8.
డిప్యూటీ జనరల్ మేనేజర్-1 (ఎంపీఎల్‌ఎస్).
డిప్యూటీ మేనేజర్: టెక్నికల్-40, ఎంపీఎల్‌ఎస్-8.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్-2 (ఫైనాన్స్)
జాయింట్ జనరల్ మేనేజర్ -1 (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ)
కంపెనీ సెక్రటరీ (లా)-1 (జనరల్ అడ్మిన్.)
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు సీఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూన్ 28
వెబ్‌సైట్: www.railtelindia.com
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ (మిస్సైల్ సిస్టమ్స్ ఎస్‌బీయూ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల సంఖ్య: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-4, మెకానికల్ ఇంజనీరింగ్-4, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-4.
అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. ఆర్మీ/ నేవి/ ఎయిర్ ఫోర్స్‌లో కనీసం 15 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 30
వెబ్‌సైట్: http://bel-india.com