న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ, ప్రభుత్వరంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) చైర్మన్, ఎండీగా (సీఎండీ) పర్మిందర్ చోప్రా బాధ్యతలు స్వీకరించారు. సంస్థకు తొలి పూర్తి స్థాయి మహిళా చైర్మన్ అని పీఎఫ్‌సీ తెలిపింది.
జూన్ 1 నుంచి పీఎఫ్‌సీ సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వహిస్తుండగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతల్లోకి వచ్చారు. అంతక్రితం వరకు పీఎఫ్‌సీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పనిచేశారు. డైరెక్టర్ (ఫైనాన్స్)గా పర్మిందర్ చోప్రా ఎన్‌పీఏలను కనిష్టానికి తగ్గించి, సంస్థ లాభదాయకతను పెంచడంలో, మహారత్న హోదా పొందడంలో కీలకంగా పనిచేశారు. విద్యుత్, ఫైనాన్షియల్ రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment