Women chairperson
-
ఆప్ తరఫున రాజ్యసభకు మలివాల్ సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మళ్లీ అవకాశం
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. అదేవిధంగా, పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మరో విడత ఎగువసభ సభ్యులుగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మేరకు ప్రకటించింది. హరియాణా రాజకీయాల్లో కీలకంగా ఉండాలన్న రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా అభిప్రాయం మేరకు ఆయన స్థానంలో స్వాతి మలివాల్‌కు మొదటిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఆమె 2015లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. పార్టీ నిర్ణయం మేరకు శుక్రవారం సాయంత్రం డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన వినతి మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టు..ఈ నెల 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సంజయ్ సింగ్‌కు వెసులుబాటు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది. -
పీఎఫ్సీ సీఎండీగా పర్మిందర్ చోప్రా బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఎన్బీఎఫ్సీ, ప్రభుత్వరంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) చైర్మన్, ఎండీగా (సీఎండీ) పర్మిందర్ చోప్రా బాధ్యతలు స్వీకరించారు. సంస్థకు తొలి పూర్తి స్థాయి మహిళా చైర్మన్ అని పీఎఫ్సీ తెలిపింది. జూన్ 1 నుంచి పీఎఫ్సీ సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వహిస్తుండగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతల్లోకి వచ్చారు. అంతక్రితం వరకు పీఎఫ్సీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పనిచేశారు. డైరెక్టర్ (ఫైనాన్స్)గా పర్మిందర్ చోప్రా ఎన్పీఏలను కనిష్టానికి తగ్గించి, సంస్థ లాభదాయకతను పెంచడంలో, మహారత్న హోదా పొందడంలో కీలకంగా పనిచేశారు. విద్యుత్, ఫైనాన్షియల్ రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉంది. -
ఓఎన్జీసీకి తొలి మహిళా సీఎండీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) అల్కా మిట్టల్ నియమితులయ్యారు. డిసెంబర్ 31తో పదవీ విరమణ చేసిన తాత్కాలిక హెడ్ సుభాష్ కుమార్ స్థానంలో ఆమె నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి ఆరు నెలల పాటు అల్కా మిట్టల్ (59)కు ఓఎన్జీసీ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించాలన్న కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) వెల్లడించింది. ఆమె బాధ్యతలు చేపట్టినట్లు ఓఎన్జీసీ తెలిపింది. ఆగస్టు ఆఖరుతో మిట్టల్ పదవీకాలం పూర్తవుతుంది. అల్కా మిట్టల్ .. ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, కామర్స్‌లో డాక్టరేట్ చేశారు. 2018 నవంబర్ 27న ఓఎన్జీసీ బోర్డులో తొలి మహిళా మెంబర్‌గా నియమితులయ్యారు. ఒక చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీకి .. మహిళ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. అప్పట్లో (2014లో) ప్రభుత్వ రంగ రిఫైనర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)కు తొలి మహిళా హెడ్‌గా నిశి వాసుదేవ సేవలు అందించారు. ఓఎన్జీసీలో ప్రస్తుతం ఇద్దరు పూర్తి స్థాయి మహిళా డైరెక్టర్లు ఉన్నట్లవుతుంది. ఫైనాన్స్ విభాగం డైరెక్టరుగా పమిలా జస్పాల్‌ను పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) ఇటీవలే ఎంపిక చేసింది. ఆమె ప్రస్తుతం ఓఎన్జీసీ అనుబంధ సంస్థ మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్నారు. -
విద్య, వైద్యానికి పెద్దపీట
కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తుల ఉమ అభివృద్ధి ఎజెండాను వెల్లడించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం, మహిళారంగ అభ్యున్నతిపై తనకున్న విజన్‌ను ప్రజల ముందుంచారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ఎలా అనిపిస్తోంది? ఉమ : మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపుడు మహిళలకు అవకాశం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలిసారి జిల్లా పరిషత్ పీఠాన్ని అధిష్టించే అవకాశం మహిళలకు దక్కింది. పదవి మీకే దక్కుతుందనుకున్నారా? ఉమ : నాకైతే ముందునుంచి ఎలాంటి అనుమానం లేదు. మా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ చేయాలని అనుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల అది వీలు పడలేదు. జెడ్పీచైర్‌పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతోనే కేసీఆర్ నన్ను చైర్పర్సన్ చేయాలని నిర్ణయించారు. అందుకే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మహిళలకు అవకాశం కల్పించడాన్ని ఎలా భావిస్తున్నారు? ఉమ : రాజకీయంగా ఉన్నత పదవులు మహిళలకు రావడం తక్కువే. మహిళలకు అవకాశం వస్తే నీతి, నిజాయతీగా పరిపాలిస్తారని ఎన్నోసార్లు రుజువైంది. ప్రస్తుతం జిల్లాలో 50 శాతం కన్నా ఎక్కువ మహిళా ప్రజాప్రతినిధులం ఉన్నాం. చైర్‌పర్సన్‌గా మీ ప్రాధాన్యతాంశాలేమిటి? ఉమ : విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తా. గ్రామాల్లో పర్యటించినపుడు డ్రెయినేజీ సమస్య అధికంగా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ సమస్యను పరిష్కరిస్తా. ప్రధానంగా జిల్లా పరిషత్ పాఠశాలల్లో టాయ్‌లెట్స్ లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ఏడాదిలోగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో టాయ్‌లెట్స్ నిర్మించి, విద్యార్థినుల ఇబ్బందులు తొలగిస్తా. మీ పరిపాలన ఎలా ఉండబోతోంది? ఉమ : చైర్‌పర్సన్‌గా నేను చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా. అవినీతికి తావులేని నీతి, నిజాయితీతో కూడిన పాలన అందిస్తా.