
ఓఎన్‌జీసీ కొత్త చీఫ్ శశి శంకర్
దేశీ దిగ్గజ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ‘ఓఎన్‌జీసీ’ కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా (సీఎండీ) శశి శంకర్ ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ‘ఓఎన్‌జీసీ’ కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా (సీఎండీ) శశి శంకర్ ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) తాజాగా శంకర్‌ను ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) హెడ్‌గా ఎంపికచేసిం ది. ఈయన అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రసుతం శంకర్.. ఓఎన్‌జీసీ డైరెక్టర్‌గా (టెక్నికల్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్) వ్యవహరిస్తున్నారు. ఈయన దినేశ్ కె సరఫ్ నుంచి ఓఎన్‌జీసీ సీఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా దినేశ్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు.