సాక్షి, ముంబై: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎండి, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
కెనిచి నియామకం 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2013 మార్చిలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా అవకాశంతో మూడోసారి కూడా మరోవమూడుళ్లపాటు కెనిచి సీఎండీగా కొనసాగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment