Kenichi Ayukawa
-
లోకలైజేషన్ పెరగాలి
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల పరిశ్రమ స్థానికీకరణ (లోకలైజేషన్) పెంచడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కెనిచి అయుకావా అభిప్రాయపడ్డారు. నిలకడైన వృద్ధి సాధించేందుకు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచడాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 62వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘ముడి వస్తువులు మొదలుకుని అత్యంత చిన్న విడిభాగాలను కూడా వీలైనంత వరకూ స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు మార్గాలు వెతకాలి. భారతీయ ఆటో పరిశ్రమ దేశీయంగాను, అటు ఎగుమతులపరంగానూ భారీ స్థాయికి పెరిగింది. ఇలాంటప్పుడు నాణ్యత అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉంటుంది. కాబట్టి నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ప్రధాని లక్ష్యం సాకారం చేసే దిశగా భవిష్యత్ తరం టెక్నాలజీలపై పరిశ్రమ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమను తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు ఏసీఎంఏ, వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కలిసి పనిచేయాలని అయుకావా తెలిపా రు. కాగా, ప్యాసింజర్, వాణిజ్య వాహనాల అమ్మకాలు కరోనా పూర్వ స్థాయికి చేరగా.. ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా ఈ పండుగ సీజన్లో ఆ స్థాయిని అందుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ చెప్పారు. వాహనాల పరీక్షకు కఠిన ప్రమాణాలు ఉండాలి: పవన్ గోయెంకా ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు ఆదరాబాదరాగా మార్కెట్లోకి తెచ్చేయకుండా తయారీకి సంబంధించి కఠిన ప్రమాణాలు, పరీక్షలు ఉండాలని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. తద్వారా విద్యుత్ వాహనాలు అగ్ని ప్రమాదాల బారిన పడే ఉదంతాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కఠిన చర్యలు.. సరఫరాదారులు విడిభాగాలను స్థానికంగా తయారు చేయకుండా అడ్డుపడే ఆటోమొబైల్ కంపెనీల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశీయంగానే విడిభాగాలను తయారు చేసుకోవడానికి పరిశ్రమ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి -
వాహనాల తయారీకి ఊతం
న్యూఢిల్లీ: దేశీయంగా వాహనాల తయారీకి మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పాదకత మరింతగా పెరగడం, నిలకడగా వృద్ధి సాధించడంపై మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. స్వచ్ఛమైన ఇంధనాల వినియోగం, ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 61వ వార్షిక సదస్సు సందర్భంగా పంపిన సందేశంలో ప్రధాని ఈ విషయాలు తెలిపారు. సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ సందేశాన్ని చదివి వినిపించారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ, దేశ పురోగతిలోనూ వాహన పరిశ్రమ ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది. ఎగుమతులకు ఊతమిచ్చేలా తయారీ కార్యకలాపాలు మొదలుకుని అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తోంది. దేశ అభివృద్ధి సాధనలో భాగస్వామిగా ఉంటోంది’’ అని ప్రధాని ప్రశంసించారు. ‘‘స్వచ్ఛమైన, ఆధునిక రవాణా వ్యవస్థ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడానికి భారత్ కట్టుబడి ఉంది. ఆటో రంగం ఉత్పాదకత పెరిగేందుకు, పరిశ్రమ నిలకడగా ఎదిగేందుకు.. వాహనాల తయారీకి సంబంధించిన వివిధ విభాగాలకు తోడ్పాటునిచ్చేందుకు సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని మోదీ వివరించారు. భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో ఆటో పరిశ్రమ పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతికత, జీవన విధానాలు, ఆర్థిక వ్యవస్థలో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పాత పద్ధతులను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త తరం మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ స్థాయి తయారీ, ఆధునిక టెక్నాలజీ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జీడీపీలో 12 శాతానికి ఆటో వాటా: గడ్కరీ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఆటోమొబైల్ పరిశ్రమ వాటాను 12 శాతానికి పెంచాలని, కొత్తగా 5 కోట్ల కొలువులు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో ఆటో పరిశ్రమ వాటా 7.1 శాతంగా ఉంది. మరోవైపు, కాలుష్యకారకమైన డీజిల్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను తగ్గించుకోవడంపై ఆటోమొబైల్ కంపెనీలు కసరత్తు చేయాలని, ప్రత్యామ్నాయ టెక్నాలజీల వైపు మొగ్గు చూపాలని గడ్కరీ సూచించారు. 100% పెట్రోల్ లేదా 100% బయో–ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఇంజిన్ల ఆధారిత వాహనాలను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాలతో పాటు భారత్‌లోనూ ఇలాంటి బ్రాండ్లు కొన్ని కార్యకలాపాలు సాగిస్తున్నాయని గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై పరిశోధన, అభివృద్ధి కోసం పరిశ్రమ నిధులు వెచ్చించాలని తెలిపారు. ఈవీ చార్జింగ్ సదుపాయాలపై కసరత్తు: కేంద్ర మంత్రి పాండే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో దేశవ్యాప్తంగా చార్జింగ్ సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే చెప్పారు. జాతీయ రహదారులు, నగరాల్లో వీటిని ఏర్పాటు చేయడంపై వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటు పన్నుల చెల్లింపుల్లోనూ, అటు మూడు కోట్ల మందికి పైగా జనాభాకు ఉపాధి కల్పించడంలో వాహన రంగం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. ఆటో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వాహన రంగానికి అవసరమైన తోడ్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పాండే తెలిపారు. మరోవైపు, ఆటోమొబైల్ పరిశ్రమ తోడ్పాటు లేకుండా భారత్ సుదీర్ఘకాలం అధిక వృద్ధి రేటుతో పురోగమించడం సాధ్యపడేది కాదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. విద్యుత్ వాహనాల వైపు మళ్లడం ఎప్పటికైనా తప్పదని, ఈ రంగంలో భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఆటో పరిశ్రమ కృషి చేయాలని సూచించారు. మాటలు కాదు.. చేతలు కావాలి: పరిశ్రమ దిగ్గజాలు ఆటో పరిశ్రమ వృద్ధికి చర్యల విషయంలో ప్రభుత్వ అధికారుల ధోరణులను సియామ్ సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఆక్షేపించారు. నానాటికీ క్షీణిస్తున్న ఆటోమొబైల్ రంగం పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు అవసరమని, కేవలం మాటల వల్ల ఉపయోగం లేదని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, టీవీఎస్ మోటార్ చీఫ్ వేణు శ్రీనివాసన్ తదితరులు వ్యాఖ్యానించారు. అసలు దేశాభివృద్ధిలో ఆటోపరిశ్రమ పోషిస్తున్న పాత్రకు కనీసం గుర్తింపైనా ఉంటోందా అన్న సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఆటో పరిశ్రమ చాలాకాలంగా క్షీణ బాటలో కొనసాగుతోంది. పరిశ్రమ ప్రాధాన్యతపై ఎన్నో ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. కానీ, క్షీణతను అడ్డుకునే నిర్మాణాత్మక చర్యల విషయానికొస్తే మాత్రం క్షేత్రస్థాయిలో ఏమీ కనిపించడం లేదు. కొత్త కాలుష్య ప్రమాణాలను, భద్రతా ప్రమాణాలను పాటించేందుకు కంపెనీలు గణనీయంగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం, భారీ పన్నుల భారం వల్ల వాహనాల ఖరీదు పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించకుండా బయో ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అంటూ ఏది చేసినా కార్ల పరిశ్రమ కోలుకుంటుందని అనుకోవడం లేదు’’ అని భార్గవ పేర్కొన్నారు. మరోవైపు, దేశంలో ప్రాథమిక రవాణా సాధనంగా ఉంటున్న ద్విచక్ర వాహనాలపై సైతం విలాస ఉత్పత్తులకు సరిసమానంగా ఏకంగా 28 శాతం వస్తు, సేవల పన్ను విధించడం సరికాదని వేణు శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని దేశీయంగానే తయారీ, డిజైనింగ్ కార్యకలాపాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోందని ఆయన చెప్పారు. ఇంత చేస్తున్నా తమకు గుర్తింపనేది లభిస్తోందా అన్న సందేహం కలుగుతోందన్నారు. -
మారుతి బాస్‌గా మళ్లీ ఆయనే
సాక్షి, ముంబై: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎండి, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కెనిచి నియామకం 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2013 మార్చిలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా అవకాశంతో మూడోసారి కూడా మరోవమూడుళ్లపాటు కెనిచి సీఎండీగా కొనసాగనున్నారు. -
మారుతీ కొత్త బాలెనో వస్తోంది..
ఫ్రాంక్ఫర్ట్ : మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ కేటగిరీలో కొత్త కారు మోడల్‌ను ఈ పండుగల సీజన్లో మార్కెట్లోకి తెస్తోంది. బాలెనో పేరుతో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కారును మారుతీ కంపెనీ అందించనున్నది. మారుతీ మాతృకంపెనీ సుజుకీ మోటార్ కార్ప్ ఈ కొత్త బాలెనో మోడల్‌ను ఇక్కడ జరుగుతున్న ఆటో షోలో ప్రదర్శించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెక్సా అవుట్లెట్ల ద్వారా ఈ బాలెనో కార్లను విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. పెట్రోల్ వేరియంట్‌ను 1.2 లీటర్ ఇంజిన్‌తోనూ, డీజిల్ వేరియంట్‌ను 1.3 లీటర్ ఇంజిన్‌తోనూ అందిస్తామని తెలిపారు. ఫ్రాంక్ఫర్ట్ ఆటోషో గురువారం లాంఛనంగా ప్రారంభమై ఈ నెల 27వరకూ కొనసాగుతుంది. మంగళ, బుధవారాల్లో కేవలం మీడియాను మాత్రమే అనుమతిస్తారు. ఇతర వివరాలు.. రోల్స్ రాయిస్ నుంచి కొత్త డాన్.. ఇంగ్లాండ్‌కు చెందిన సూపర్ లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ కొత్త ఓపెన్-టాప్ మోడల్ కారును ఈ ఆటో షోలో ప్రదర్శించింది. డాన్ పేరుతో అందిస్తున్న ఈ కారును వచ్చే ఏడాది జూలైకల్లా భారత మార్కెట్లోకి తెస్తామని రోల్స్-రాయిస్ మోటార్ కార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టొరస్టన్ ముల్లర్ ఒట్వోస్ చెప్పారు. త్వరలో కొత్త కన్వర్టిబుల్‌ను. ఒక ఎస్‌యూవీని కూడా భారత మార్కెట్లోకి తేనున్నామని వివరించారు. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కంపెనీ సొంతమైన రోల్స్-రాయిస్ భారత్‌లో రూ.4.6 కోట్ల నుంచి రూ.9 కోట్ల విలువైన లగ్జరీ కార్లను విక్రయిస్తోంది. ఎస్యూవీ మార్కెట్లోకి టాటా జేఎల్ఆర్ టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంస్థ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ) మార్కెట్లోకి ప్రవేశించింది. ఫ్రాంక్ఫర్ట్ ఆటో షోలో ఎఫ్-పేస్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. ఈ ఎస్‌యూవీని వచ్చే ఏడాది మొదట్లో అమెరికా, యూరప్‌ల్లో, వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో భారత మార్కెట్లోకి తెస్తామని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి చెప్పారు. వచ్చే ఏడాది ఫోక్స్‌వ్యాగన్ కొత్త టైగువాన్ ఎస్యూవీ జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ఎస్యూవీ టైగువాన్లో కొత్త జనరేషన్ కారును వచ్చే ఏడాది భారత్‌లోకి అందుబాటులోకి తేనున్నది. గోల్ఫ్, పోలో కార్ల తర్వాత అంత్యంత పాపులర్ అయిన కారు ఇదేనని కంపెనీ సీఈఓ హెర్బర్ట్ డిఈస్ పేర్కొన్నారు. -
మార్కెట్లోకి మారుతి 'స్టింగ్రే'!
భారీగా క్షీణించిన వాహనాల అమ్మకాలను తట్టుకునేందుకు భారత దేశపు అతిపెద్ద కార్ల ఉత్పత్తి కంపెనీ మారుతి సుజుకి ఇండియా మార్కెట్లోకి కొత్తగా 'స్టింగ్రే'ను విడుదల చేసింది. మార్కెట్లో దీని బేసిక్ మోడల్ ధర 4.10 లక్షలు (ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర). స్ట్రింగ్రే మార్కెట్ లోకి విడుదల చేయడం ద్వారా అమ్మకాలలో గణనీయమైన ప్రగతి సాధించాలని మారుతీ లక్ష్యంగా పెట్టుకుందని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచీ అయుకవా వెల్లడించారు. 998 సీసీ కెపాసిటీ పెట్రోల్ ఇంజన్ తో మూడు రకాల కార్లు మార్కెట్లో లభ్యమవుతాయని తెలిపారు. వీటి ధర 4.10 లక్షల నుంచి 4.67 లక్షల మధ్య ఉంటుందన్నారు. మారుతి సుజుకీ వెల్లడించిన గణాంకాల ప్రకారం అమ్మకాలు 7.4 శాతం క్షీణించాయి. మారుతి కార్ల అమ్మకాలు తొమ్మిది నెలల కనిష్టస్థాయికి చేరుకున్నాయి. జూలై 2012 కార్ల అమ్మకాలు 1,41,646 ఉండగా, ఈ సంవత్సరం అమ్మకాలు 1,31,163గా నమోదయ్యాయి.