మార్కెట్లోకి మారుతి 'స్టింగ్రే'!
Published Wed, Aug 21 2013 4:47 PM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
భారీగా క్షీణించిన వాహనాల అమ్మకాలను తట్టుకునేందుకు భారత దేశపు అతిపెద్ద కార్ల ఉత్పత్తి కంపెనీ మారుతి సుజుకి ఇండియా మార్కెట్లోకి కొత్తగా 'స్టింగ్రే'ను విడుదల చేసింది. మార్కెట్లో దీని బేసిక్ మోడల్ ధర 4.10 లక్షలు (ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర). స్ట్రింగ్రే మార్కెట్ లోకి విడుదల చేయడం ద్వారా అమ్మకాలలో గణనీయమైన ప్రగతి సాధించాలని మారుతీ లక్ష్యంగా పెట్టుకుందని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచీ అయుకవా వెల్లడించారు.
998 సీసీ కెపాసిటీ పెట్రోల్ ఇంజన్ తో మూడు రకాల కార్లు మార్కెట్లో లభ్యమవుతాయని తెలిపారు. వీటి ధర 4.10 లక్షల నుంచి 4.67 లక్షల మధ్య ఉంటుందన్నారు. మారుతి సుజుకీ వెల్లడించిన గణాంకాల ప్రకారం అమ్మకాలు 7.4 శాతం క్షీణించాయి. మారుతి కార్ల అమ్మకాలు తొమ్మిది నెలల కనిష్టస్థాయికి చేరుకున్నాయి. జూలై 2012 కార్ల అమ్మకాలు 1,41,646 ఉండగా, ఈ సంవత్సరం అమ్మకాలు 1,31,163గా నమోదయ్యాయి.
Advertisement
Advertisement