![SpiceJet gets nod to hive off SpiceXpress: CMD Ajay Singh - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/11/spicejet.jpg.webp?itok=ISg-H97J)
న్యూఢిల్లీ: కార్గో, లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బ్యాంకులు, వాటాదారులు అనుమతించినట్లు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ తాజాగా వెల్లడించింది. వచ్చే నెల(ఆగస్ట్) తొలి వారంలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను విడదీయనున్నట్లు స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కార్గో, లాజిస్టిక్స్ సర్వీసులను స్లంప్ సేల్ ప్రాతిపదికన అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేస్తున్నట్లు గతేడాది ఆగస్ట్ 17న స్పైస్‌జెట్ తెలియజేసింది.
తద్వారా సంస్థకు స్వతంత్రంగా నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలు చిక్కనున్నట్లు వెల్లడించింది. కాగా.. జూన్ 19 మొదలు కంపెనీ విమానాలలో ఎనిమిదిసార్లు సాంకేతిక సమస్యలు నమోదుకావడంతో గత వారం డీజీసీఏ నుంచి స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసు జారీ అయిన సంగతి తెలిసిందే. భద్రత, సమర్థత, విశ్వసనీయ విమానయాన సర్వీసులు అందించడంలో స్పైస్‌జెట్ వైఫల్యం చెందిందంటూ డీజీసీఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment