గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Nov 7 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

గతవారం బిజినెస్

గతవారం బిజినెస్

 నియామకాలు
 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1980వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి సుశీల్ చంద్ర తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
 
 హాప్రభుత్వ రంగ దిగ్గజ మైనింగ్ కంపెనీ ‘ఎన్‌ఎండీసీ’ చైర్‌పర్సన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (సీఎండీ) వ్యవహరిస్తున్న భారతీ ఎస్ సిహగ్ పదవీ కాలాన్ని కేంద్రం ఒక నెలపాటు పొడిగించింది. ప్రభుత్వపు తాజా నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
 
 హా రిషి జైట్లీ తాజాగా ట్వీటర్ ఇండియా హెడ్ పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీటర్ వేదికగా వెల్లడించారు. ఒక యూజర్‌గా, ఉద్యోగిగా రిషికి ట్వీటర్‌తో నాలుగేళ్ల అనుబంధం ఉంది.  

 హావరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ (డబ్ల్యూఎఫ్‌ఈ) కొత్త చైర్‌పర్సన్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు. !
 
 కాల్ డ్రాప్స్‌పై ఫీడ్‌బ్యాక్‌కు ప్లాట్‌ఫామ్!
 కాల్ డ్రాప్స్ విషయంలో అవసరమైతే టెలికం ఆపరేటర్లపై చర్యలు తీసకుంటామని, జరిమానా సైతం విధిస్తామని ఆ శా ఖ మంత్రి మనోజ్‌సిన్హా హెచ్చరించారు. కాల్స్ ఫెయిల్ అవడంపై వినియోగదారులు నేరుగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు నెలరోజుల్లోపు ఓ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

 ఇన్‌ఫ్రా పరిశ్రమల స్పీడ్
 ఎనిమిది పారిశ్రామిక విభాగాలతో కూడిన మౌలిక రంగం సెప్టెంబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ నెలలో ఐదు శాతం వృద్ధి నమోదయియంది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో వృద్ధి 3.7 శాతంగా నమోదయింది. 2016 ఆగస్టులో రేటు 3.2 శాతం. సిమెంట్, స్టీల్, రిఫైనరీ పరిశ్రమల ఉత్పత్తుల జోరు గ్రూపుకు సానుకూలమైంది. ఇక ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు నెలల్లో ఎనిమిది రంగాలనూ చూస్తే.. వృద్ధి 2.6 శాతం నుంచి 4.6 శాతానికి ఎగసింది.
 
 మిశ్రమంగా వాహన విక్రయాలు
 పండుగ సీజన్ నేపథ్యంలో దేశీ వాహన విక్రయాలు అక్టోబర్ నెలలో మిశ్రమంగా ఉన్నారుు. ఒకవైపు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు వాటి వాహన అమ్మకాల్లో మంచి వృద్ధినే ప్రకటిస్తే.. ఇక నిస్సాన్ మోటార్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్, రెనో కంపెనీల వాహన విక్రయాలు జోరు మీద ఉన్నాయి. అయితే టయోటా, హోండా, మహీంద్రా, ఫోర్డ్ వాహన విక్రయాలు మాత్రం తగ్గాయి.
 
 ప్రీమియం వసూళ్లు పెరిగాయ్
 నాన్-లైఫ్ ఇన్సూరెన్‌‌స కంపెనీల స్థూల ప్రీమియం వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సెప్టెంబర్ నెలలో 86.2 శాతం పెరుగుదలతో రూ.14,950 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ.8,030 కోట్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్‌‌స రెగ్యులేటర్ ఐఆర్‌డీఏ గణాంకాల ప్రకారం.. మొత్తం ప్రీమియం వసూళ్లలో ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్‌‌స కంపెనీల వాటా రూ.9,164 కోట్లుగా, ప్రై వేట్ కంపెనీల వాటా రూ.5,786 కోట్లుగా ఉంది.
 
   రూపీ బాండ్లకు ఆర్‌బీఐ అనుమతి
 మసాలా బాండ్ల (రూపీ డినామినేటెడ్ బాండ్లు) జారీ ద్వారా విదేశీ మార్కెట్లో బ్యాంకులు నిధుల సమీకరించుకోడానికి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. ‘‘రూపీ బాండ్ల విదేశీ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నాం. పరిమితులకు లోబడి ఈ బాండ్ల జారీ జరుగుతుంది’’ అని ఆర్‌బీఐ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇన్‌ఫ్రా, చౌక ఇళ్లకు తగిన నిధుల సమీకరణకు తాజా నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.  
 
   టాటా బ్రాండ్ ర్యాంక్ తగ్గింది
 ఇటీవల వివాదంలో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్‌నకు మరో షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మక టాటా ఉత్పత్తుల బ్రాండ్ స్థారుు తగ్గుతున్నట్లు ఒక సర్వే తేల్చింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ తాజాగా నిర్వహించిన భారత్‌లోని అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్ల సర్వేలో టాటా బ్రాండ్ ర్యాంక్ క్షీణించింది. ఎల్‌జీ టాప్‌లో నిలవగా... టాటా బ్రాండ్ ఏకంగా 7వ స్థానానికి పడిపోయింది. టాటా బ్రాండ్‌కు 2014లో 5వ ర్యాంక్ ఉండగా, 2015లో అది 4వ స్థానానికి చేరింది. ఇపుడు ఒకేసారి మూడు స్థానాలు వెనక్కి పడింది. దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ’ఎల్‌జీ’ దేశంలో టాప్ స్థానాన్ని దక్కించుకోగా తర్వాతి స్థానాల్లో సోనీ, శాంసంగ్ మొబైల్స్, హోండా, శాంసంగ్ నిలిచాయి.
 
  వడ్డీ చెల్లింపుల్లో జేఎస్పీఎల్ విఫలం
 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్‌సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) మరోసారి విఫలం అరుు్యంది. ఎన్‌సీడీలకు గడువు ప్రకా రం అక్టోబర్ 31 లోపు రూ.15.43 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అందులో విఫలమైనట్టు స్వయంగా కంపెనీయే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సమాచారం ఇచ్చింది. నవీన్ జిందాల్‌కు చెందిన జేఎస్పీఎల్ రూ.46,000 కోట్ల రుణభారంతో సతమతమవుతోంది.
 
  రిలయన్‌‌సకు కేంద్రం షాక్
 ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్‌‌స ఇండస్ట్రీస్‌కు (ఆర్‌ఐఎల్) కేంద్రం షాకిచ్చింది. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ గ్యాస్ బ్లాక్ నుంచి అక్రమంగా సహజవాయువును లాగేసుకున్నట్టు రేగిన వివాదంలో 1.55 బిలియన్ డాలర్ల (ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు రూ.10,380 కోట్లు) భారీ జరిమానాను విధించింది. ఈ మేరకు రిలయన్‌‌సతో పాటు దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌కు కేంద్ర పెట్రోలియం శాఖ శుక్రవారం డిమాండ్ నోటీసులను జారీ చేసింది. అయితే, దీనిపై రిలయన్‌‌స న్యాయపోరాటం (ఆర్బిట్రేషన్) చేసే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
 
 చక్కెర ఉత్పత్తి 44 శాతం డౌన్
 దేశంలో చక్కెర ఉత్పత్తి 2016-17 సీజన్ తొలి నెల అక్టోబర్‌లో 44 శాతం క్షీణతతో 1.04 లక్షల టన్నులకు పరిమితమరుుంది. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు క్రషింగ్ ఆలస్యం కావడం ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్‌ఎంఏ) పేర్కొంది. 2015-16 సీజన్ ఇదే నెలలో చక్కెర ఉత్పత్తి 1.87 లక్షల టన్నులుగా ఉందని తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో 65 మిల్లులు చెరకు క్రషింగ్‌ను ప్రారంభిస్తే.. ప్రస్తుత ఏడాది అదే నెలలో కేవలం 28 మిల్లులే చెరకు క్రషింగ్ కార్యకలాపాలను ప్రారంభించాయని వివరించింది.
 
 డీల్స్..
 ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో ప్రముఖ మొబైల్ పేమెంట్స్ నెట్‌వర్క్ సంస్థ మోబిక్విక్ జతకట్టింది. ఇరు సంస్థలు వాటి ఒప్పందంలో భాగంగా ప్రయాణికుల కోసం తత్కాల్ బుకింగ్‌‌సకు సంబంధించి ఈక్యాష్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి.
 
 ఇండోనేసియా ప్రభుత్వరంగ సంస్థ పీటీ పిండాడ్‌తో టాటా మోటార్స్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండోనేసియాతోపాటు ఆసియాలోని ఇతర దేశాలలో టాటా మోటార్స్ సాయుధ వాహనాలకు (ఆయుధాలు అమర్చిన వాహనాలు) మార్కెట్ అవకాశాలను పెంచుకునేందుకు ఈ ఒప్పందం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement