indian revenue service
-
ఈడీ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తికాలపు డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయనను బుధవారం పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమించారు. నవీన్ ఇండియన్ రెవెన్యూ సరీ్వసు (ఐఆర్ఎస్) 1993 బ్యాచ్.. ఇన్‌కంట్యాక్స్ కేడర్‌కు చెందిన అధికారి. రాహుల్ నవీన్‌ను రెండేళ్ల కాలానికి, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు (ఇందులో ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాలు జారీచేసింది. 57 ఏళ్ల నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్‌గా ఈడీలో చేరారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెపె్టంబరు 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పన్ను వ్యవహారాల్లో నవీన్ నిపుణులు. తాత్కాలిక డైరెక్టర్‌గా నవీన్ వ్యవహరించిన కాలంలోనే మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ల సంచలన అరెస్టులు జరిగాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఎంటెక్ రాహుల్ నవీన్ బిహార్‌కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశారు. మెల్బోర్న్ (ఆ్రస్టేలియా)లోని స్విన్బుర్నే యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో 30 ఏళ్లు పనిచేశారు. అంతర్జాతీయ ట్యాకేషన్స్పై నవీన్ రాసిన పలు వ్యాసాలను నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో ట్రైనీ ఐఆర్ఎస్ విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ‘‘ఇన్ఫ్మర్మేషన్ ఎక్చేంజ్ అండ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ: టాక్లింగ్ గ్లోబల్ ట్యాక్స్ ఎవాషన్ అండ్ అవాయిడెన్స్’’ శీర్షినక నవీన్ రాసిన పుస్తకం 2017లో ప్రచురితమైంది. -
సివిల్ సర్వీస్ హిస్టరీలో ఇదే తొలిసారి.. ఆమె పేరు మారింది..జెండర్ మారింది
సాక్షి,హైదరాబాద్ : ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ సివిల్ సర్వీస్ (సీనియర్ ఐఆర్ఎస్)ఉద్యోగి తన పేరుతో పాటు జెండర్‌ను మార్చుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతివ్వడం ఆసక్తికరంగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నీ రికార్డ్స్‌లలో సదరు ఉద్యోగి పేరు,జెండర్ ఇతర వివరాలు మారిపోనున్నాయి.హైదరాబాద్ కేంద్రంగా కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ (సీఈఎస్‌టీఏటీ) విభాగంలో 35ఏళ్ల అనసూయ సీనియర్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.అయితే తన పేరును అనుసూయకు బదులు తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా, జెండర్‌ను సైతం మార్చాలని కేంద్రానికి అభ్యర్ధించారు.అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అనుసూర్య పేరును ఎం.అనుకతిర్ సూర్యగా మార్చడంతో పాటు జెండర్ సైతం మార్చేందుకు అంగీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్గాఅనుకతిర్ సూర్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. సూర్య 2013 డిసెంబర్లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్‌గా పదోన్నతి పొందారు. గతేడాది హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. అనుకతిర్ సూర్య చదువుఅతను చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీని,2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. -
గతవారం బిజినెస్
నియామకాలు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1980వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి సుశీల్ చంద్ర తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. హాప్రభుత్వ రంగ దిగ్గజ మైనింగ్ కంపెనీ ‘ఎన్ఎండీసీ’ చైర్పర్సన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (సీఎండీ) వ్యవహరిస్తున్న భారతీ ఎస్ సిహగ్ పదవీ కాలాన్ని కేంద్రం ఒక నెలపాటు పొడిగించింది. ప్రభుత్వపు తాజా నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. హా రిషి జైట్లీ తాజాగా ట్వీటర్ ఇండియా హెడ్ పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీటర్ వేదికగా వెల్లడించారు. ఒక యూజర్‌గా, ఉద్యోగిగా రిషికి ట్వీటర్‌తో నాలుగేళ్ల అనుబంధం ఉంది. హావరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ (డబ్ల్యూఎఫ్ఈ) కొత్త చైర్‌పర్సన్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు. ! కాల్ డ్రాప్స్‌పై ఫీడ్‌బ్యాక్‌కు ప్లాట్‌ఫామ్! కాల్ డ్రాప్స్ విషయంలో అవసరమైతే టెలికం ఆపరేటర్లపై చర్యలు తీసకుంటామని, జరిమానా సైతం విధిస్తామని ఆ శా ఖ మంత్రి మనోజ్‌సిన్హా హెచ్చరించారు. కాల్స్ ఫెయిల్ అవడంపై వినియోగదారులు నేరుగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు నెలరోజుల్లోపు ఓ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇన్ఫ్రా పరిశ్రమల స్పీడ్ ఎనిమిది పారిశ్రామిక విభాగాలతో కూడిన మౌలిక రంగం సెప్టెంబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ నెలలో ఐదు శాతం వృద్ధి నమోదయియంది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో వృద్ధి 3.7 శాతంగా నమోదయింది. 2016 ఆగస్టులో రేటు 3.2 శాతం. సిమెంట్, స్టీల్, రిఫైనరీ పరిశ్రమల ఉత్పత్తుల జోరు గ్రూపుకు సానుకూలమైంది. ఇక ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు నెలల్లో ఎనిమిది రంగాలనూ చూస్తే.. వృద్ధి 2.6 శాతం నుంచి 4.6 శాతానికి ఎగసింది. మిశ్రమంగా వాహన విక్రయాలు పండుగ సీజన్ నేపథ్యంలో దేశీ వాహన విక్రయాలు అక్టోబర్ నెలలో మిశ్రమంగా ఉన్నారుు. ఒకవైపు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు వాటి వాహన అమ్మకాల్లో మంచి వృద్ధినే ప్రకటిస్తే.. ఇక నిస్సాన్ మోటార్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్, రెనో కంపెనీల వాహన విక్రయాలు జోరు మీద ఉన్నాయి. అయితే టయోటా, హోండా, మహీంద్రా, ఫోర్డ్ వాహన విక్రయాలు మాత్రం తగ్గాయి. ప్రీమియం వసూళ్లు పెరిగాయ్ నాన్-లైఫ్ ఇన్సూరెన్స కంపెనీల స్థూల ప్రీమియం వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సెప్టెంబర్ నెలలో 86.2 శాతం పెరుగుదలతో రూ.14,950 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ.8,030 కోట్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స రెగ్యులేటర్ ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం.. మొత్తం ప్రీమియం వసూళ్లలో ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స కంపెనీల వాటా రూ.9,164 కోట్లుగా, ప్రై వేట్ కంపెనీల వాటా రూ.5,786 కోట్లుగా ఉంది. రూపీ బాండ్లకు ఆర్బీఐ అనుమతి మసాలా బాండ్ల (రూపీ డినామినేటెడ్ బాండ్లు) జారీ ద్వారా విదేశీ మార్కెట్లో బ్యాంకులు నిధుల సమీకరించుకోడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ‘‘రూపీ బాండ్ల విదేశీ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నాం. పరిమితులకు లోబడి ఈ బాండ్ల జారీ జరుగుతుంది’’ అని ఆర్బీఐ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇన్ఫ్రా, చౌక ఇళ్లకు తగిన నిధుల సమీకరణకు తాజా నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. టాటా బ్రాండ్ ర్యాంక్ తగ్గింది ఇటీవల వివాదంలో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్‌నకు మరో షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మక టాటా ఉత్పత్తుల బ్రాండ్ స్థారుు తగ్గుతున్నట్లు ఒక సర్వే తేల్చింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ తాజాగా నిర్వహించిన భారత్‌లోని అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్ల సర్వేలో టాటా బ్రాండ్ ర్యాంక్ క్షీణించింది. ఎల్జీ టాప్‌లో నిలవగా... టాటా బ్రాండ్ ఏకంగా 7వ స్థానానికి పడిపోయింది. టాటా బ్రాండ్‌కు 2014లో 5వ ర్యాంక్ ఉండగా, 2015లో అది 4వ స్థానానికి చేరింది. ఇపుడు ఒకేసారి మూడు స్థానాలు వెనక్కి పడింది. దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ’ఎల్జీ’ దేశంలో టాప్ స్థానాన్ని దక్కించుకోగా తర్వాతి స్థానాల్లో సోనీ, శాంసంగ్ మొబైల్స్, హోండా, శాంసంగ్ నిలిచాయి. వడ్డీ చెల్లింపుల్లో జేఎస్పీఎల్ విఫలం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) మరోసారి విఫలం అరుు్యంది. ఎన్‌సీడీలకు గడువు ప్రకా రం అక్టోబర్ 31 లోపు రూ.15.43 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అందులో విఫలమైనట్టు స్వయంగా కంపెనీయే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సమాచారం ఇచ్చింది. నవీన్ జిందాల్‌కు చెందిన జేఎస్పీఎల్ రూ.46,000 కోట్ల రుణభారంతో సతమతమవుతోంది. రిలయన్‌సకు కేంద్రం షాక్ ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స ఇండస్ట్రీస్‌కు (ఆర్ఐఎల్) కేంద్రం షాకిచ్చింది. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ గ్యాస్ బ్లాక్ నుంచి అక్రమంగా సహజవాయువును లాగేసుకున్నట్టు రేగిన వివాదంలో 1.55 బిలియన్ డాలర్ల (ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు రూ.10,380 కోట్లు) భారీ జరిమానాను విధించింది. ఈ మేరకు రిలయన్సతో పాటు దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌కు కేంద్ర పెట్రోలియం శాఖ శుక్రవారం డిమాండ్ నోటీసులను జారీ చేసింది. అయితే, దీనిపై రిలయన్స న్యాయపోరాటం (ఆర్బిట్రేషన్) చేసే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చక్కెర ఉత్పత్తి 44 శాతం డౌన్ దేశంలో చక్కెర ఉత్పత్తి 2016-17 సీజన్ తొలి నెల అక్టోబర్‌లో 44 శాతం క్షీణతతో 1.04 లక్షల టన్నులకు పరిమితమరుుంది. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు క్రషింగ్ ఆలస్యం కావడం ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) పేర్కొంది. 2015-16 సీజన్ ఇదే నెలలో చక్కెర ఉత్పత్తి 1.87 లక్షల టన్నులుగా ఉందని తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో 65 మిల్లులు చెరకు క్రషింగ్‌ను ప్రారంభిస్తే.. ప్రస్తుత ఏడాది అదే నెలలో కేవలం 28 మిల్లులే చెరకు క్రషింగ్ కార్యకలాపాలను ప్రారంభించాయని వివరించింది. డీల్స్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో ప్రముఖ మొబైల్ పేమెంట్స్ నెట్వర్క్ సంస్థ మోబిక్విక్ జతకట్టింది. ఇరు సంస్థలు వాటి ఒప్పందంలో భాగంగా ప్రయాణికుల కోసం తత్కాల్ బుకింగ్సకు సంబంధించి ఈక్యాష్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఇండోనేసియా ప్రభుత్వరంగ సంస్థ పీటీ పిండాడ్తో టాటా మోటార్స్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండోనేసియాతోపాటు ఆసియాలోని ఇతర దేశాలలో టాటా మోటార్స్ సాయుధ వాహనాలకు (ఆయుధాలు అమర్చిన వాహనాలు) మార్కెట్ అవకాశాలను పెంచుకునేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. -
సీఎం భార్య రిటైర్మెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య, భారత రెవెన్యూ సర్వీస్ అధికారిణి సునీత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారు. వీఆర్ఎస్ కోరుతూ ఈ ఏడాది మొదట్లో సునీత దరఖాస్తు చేయగా, సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఇందుకు అనుమతిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపన్ను శాఖలో సునీత దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు. సునీత చివరిసారిగా ఢిల్లీలోని ఐటీఏటీలో ఐటీ కమిషనర్ హోదాలో విధులు నిర్వహించారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. కేజ్రీవాల్ ఉద్యోగానికి రాజీనామా చేసి తొలుత ప్రజాఉద్యమకర్త అన్నా హజారే బృందంతో కలసి ఉద్యమించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. -
ఐఆర్ఎస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాక్ వర్గాలు
న్యూఢిల్లీ: ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిక వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన వర్గాలు హ్యక్ చేశాయి. ఆదాయపన్ను శాఖకు చెందిన http://www.irsofficersonline.gov.in వైబ్‌సైట్ శనివారం నుంచీ పనిచేయడం లేదని, అందులో పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
సివిల్స్‌లో మెరిసిన ఆణిముత్యాలు
ప్రొద్దుటూరు/కడప కార్పొరేషన్ : సివిల్స్ ఫలితాలలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మెరిశారు. కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా అక్క కుమారుడు ముషఫ్ ్ర80వ ర్యాంకు సాధించాడు. అలాగే ప్రొద్దుటూరు పట్టణంలోని గురువయ్యతోటకు చెందిన కొమ్మిశెట్టి మురళీధర్ సివిల్స్‌లో 406వ ర్యాంక్ సాధించారు. ర్యాంక్ ఆధారంగా ఇండియన్ పోలీస్సర్వీస్ లేదా ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపిక కావచ్చని తెలుస్తోంది. స్థానిక మున్సిపాలిటీలో శానిటరీ సూపర్వైజర్గా పనిచేస్తున్న రాంప్రసాద్, జమాల్ ఎయిడెడ్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న గోపాలమ్మ కుమారుడు మురళీధర్ చాలా రోజులుగా సివిల్స్‌లో రాణిం చేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్షలో 12వ ర్యాంక్ సాధించాడు. అదే సమయంలో సివిల్స్ పరీక్ష రాయగా ప్రస్తుత ఫలితాలలో 406వ ర్యాంక్ సాధించాడు. మురళీధర్ 1-5వ తరగతి వరకు స్థానిక మహర్షి స్కూల్, 6-8వ తరగతి వరకు కోరుకొండ సైనిక స్కూల్లో చదివాడు. 9-10 తరగతులు స్థానిక ఆదిత్య హైస్కూల్లో చదివాడు. టెన్త్ ఫలితాలలో 540 మార్కులు సాధించి స్కూల్ సెకండ్‌గా నిలిచాడు. ఇంటర్మీడియ ట్ ఎంపీసీ గ్రూప్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. ఇం దులో 970 మార్కులు సాధించాడు. చెన్నై ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసి డిస్టిన్షన్లో ఉత్తీర్ణులయ్యారు. ఎంటెక్ అనంతరం పూణెలోని సైమన్టెక్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ సివిల్స్‌పై దృష్టి సారించారు. లక్ష్యాన్ని సాధించేందుకు మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2010 డిసెంబర్లో ఐఏఎస్ అధికారి, ప్రస్తుత లేబర్ కమిషనర్ రామాంజనేయులు కూతురు హరిప్రియను వివాహం చేసుకున్నారు. మురళీధర్ సోదరుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది మా కొడుకు కొమ్మిశెట్టి మురళీధర్ సివిల్స్‌లో 406వ ర్యాంక్ సాధించినందుకు తమకెంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు రాంప్రసాద్, గోపాలమ్మ తెలిపారు. ర్యాంకు కోసం తమ కుమారుడు ఎంతో శ్రమించాడన్నారు. వాస్తవానికి ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని భావించామన్నారు.