
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తికాలపు డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయనను బుధవారం పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమించారు. నవీన్ ఇండియన్ రెవెన్యూ సరీ్వసు (ఐఆర్‌ఎస్) 1993 బ్యాచ్.. ఇన్‌కంట్యాక్స్ కేడర్‌కు చెందిన అధికారి.
రాహుల్ నవీన్‌ను రెండేళ్ల కాలానికి, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు (ఇందులో ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాలు జారీచేసింది.
57 ఏళ్ల నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్‌గా ఈడీలో చేరారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెపె్టంబరు 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పన్ను వ్యవహారాల్లో నవీన్ నిపుణులు. తాత్కాలిక డైరెక్టర్‌గా నవీన్ వ్యవహరించిన కాలంలోనే మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ల సంచలన అరెస్టులు జరిగాయి.
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఎంటెక్
రాహుల్ నవీన్ బిహార్‌కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశారు. మెల్‌బోర్న్ (ఆ్రస్టేలియా)లోని స్విన్‌బుర్నే యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో 30 ఏళ్లు పనిచేశారు. అంతర్జాతీయ ట్యాకేషన్స్‌పై నవీన్ రాసిన పలు వ్యాసాలను నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో ట్రైనీ ఐఆర్‌ఎస్ విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ‘‘ఇన్ఫ్మర్మేషన్ ఎక్చేంజ్ అండ్ ట్యాక్స్ ట్రాన్స్‌పరెన్సీ: టాక్లింగ్ గ్లోబల్ ట్యాక్స్ ఎవాషన్ అండ్ అవాయిడెన్స్’’ శీర్షినక నవీన్ రాసిన పుస్తకం 2017లో ప్రచురితమైంది.
Comments
Please login to add a commentAdd a comment