ఈడీ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్‌ | Rahul Navin Appointed As In-Charge Director Of Enforcement Directorate | Sakshi
Sakshi News home page

ఈడీ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్‌

Published Sat, Sep 16 2023 10:05 AM | Last Updated on Sat, Sep 16 2023 10:24 AM

Rahul Navin Appointed As Incharge Director Of Enforcement Directorate - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్‌ నియామకమయ్యారు. కాగా, ప్రస్తుతం రాహుల్‌ నవీన్‌.. ఈడీ స్పెషల్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే, పూరిస్థాయి డైరెక్టర్‌ నియామకం వరకు ఇన్‌ఛార్జ్‌గా రాహుల్‌ కొనసాగనున్నారు. రాహుల్‌ 1993 ఐఆర్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన‌ ఆఫీసర్.

ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఈడీ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా.. ఈడీ, సీబీఐ ఉమ్మడి కొత్తగా బాస్‌గా సంజీవ్‌ను నియమించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా చీఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ పదవి సృష్టించే దిశగా కేంద్రం ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

ఇది కూడా చదవండి: కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement