IRS
-
పురుషుడిగా మారిన లేడీ IRS
-
సివిల్ సర్వీస్ హిస్టరీలో ఇదే తొలిసారి.. ఆమె పేరు మారింది..జెండర్ మారింది
సాక్షి,హైదరాబాద్ : ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ సివిల్ సర్వీస్ (సీనియర్ ఐఆర్ఎస్)ఉద్యోగి తన పేరుతో పాటు జెండర్‌ను మార్చుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతివ్వడం ఆసక్తికరంగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నీ రికార్డ్స్‌లలో సదరు ఉద్యోగి పేరు,జెండర్ ఇతర వివరాలు మారిపోనున్నాయి.హైదరాబాద్ కేంద్రంగా కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ (సీఈఎస్‌టీఏటీ) విభాగంలో 35ఏళ్ల అనసూయ సీనియర్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.అయితే తన పేరును అనుసూయకు బదులు తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా, జెండర్‌ను సైతం మార్చాలని కేంద్రానికి అభ్యర్ధించారు.అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అనుసూర్య పేరును ఎం.అనుకతిర్ సూర్యగా మార్చడంతో పాటు జెండర్ సైతం మార్చేందుకు అంగీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్గాఅనుకతిర్ సూర్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. సూర్య 2013 డిసెంబర్లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్‌గా పదోన్నతి పొందారు. గతేడాది హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. అనుకతిర్ సూర్య చదువుఅతను చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీని,2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. -
ఈడీ ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
సాక్షి, ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియామకమయ్యారు. కాగా, ప్రస్తుతం రాహుల్ నవీన్.. ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే, పూరిస్థాయి డైరెక్టర్ నియామకం వరకు ఇన్‌ఛార్జ్‌గా రాహుల్ కొనసాగనున్నారు. రాహుల్ 1993 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఈడీ డైరెక్టర్ సంజీవ్ కుమార్ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా.. ఈడీ, సీబీఐ ఉమ్మడి కొత్తగా బాస్‌గా సంజీవ్‌ను నియమించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పదవి సృష్టించే దిశగా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. President Droupadi Murmu appointed an Indian Revenue Service (IRS) officer of the 1993 batch, #RahulNavin, as the incharge Director of #EnforcementDirectorate. #ED #cliQIndia pic.twitter.com/pVf7RM6TS9 — cliQ India (@cliQIndiaMedia) September 16, 2023 ఇది కూడా చదవండి: కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు.. -
సమీర్ వాంఖడే కులంపై అనుమానాలు.. క్లీన్చిట్ ఇచ్చిన కాస్ట్ ప్యానెల్
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మాజీ ముంబై జోనల్ డైరెక్టర్, ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే జన్మతః ఎస్సీ వర్గానికి చెందిన మహర్ కులస్తుడని మహారాష్ట్ర సామాజిక న్యాయ విభాగం శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం అయిన సమీర్ వాంఖడే నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందారంటూ వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఈ మేరకు క్లీన్చిట్ ఇచ్చింది. సమీర్ వాంఖడే కులంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై ముంబై జిల్లా కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ విచారణ జరిపింది. సమీర్, ఆయన తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడేలు హిందూ మతం వీడి ఇస్లాం స్వీకరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. 2021 అక్టోబర్‌లో ముంబై క్రూయిజ్ షిప్‌పై వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం సోదాలు జరపడం, డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ సహా పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిన విషయమే. -
ఇదీ సాక్షి పాఠకుల సంఖ్య
పాఠకుల సంఖ్య.....93,41,000 సాక్షి, హైదరాబాద్ : సాక్షి దినపత్రికను ప్రతిరోజూ 93.41 లక్షల మంది పాఠకులు చదువుతున్నారని ఇండియన్ రీడర్షిప్ సర్వే (ఐఆర్ఎస్)–2017 తేల్చింది. ఈ సర్వేలో ప్రాంతీయ, హిందీ పత్రికలే అగ్రస్థానంలో నిలిచాయి. ఇంగ్లిష్ పత్రికలను వెనక్కి నెట్టి టాప్–10 స్థానాలను ఇవే కైవసం చేసుకున్నాయి. హిందీ పత్రికల పాఠకుల సంఖ్యలో ఏకంగా 45 శాతం వృద్ధి నమోదైంది. 7 కోట్ల పైచిలుకు పాఠకులతో దైనిక్ జాగరణ్ మొదటి స్థానంలో, 5.23 కోట్లతో హిందుస్థాన్, 4.6 కోట్లతో అమర్ ఉజాలా పత్రికలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రీడర్షిప్ స్టడీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్ఎస్సీఐ), మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్(ఎంఆర్‌యూసీ)లు తాజాగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా పత్రికలు కొత్తగా 11 కోట్ల మంది పాఠకులను సంపాదించుకున్నాయి. 2014 ఐఆర్ఎస్ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం పాఠకుల సంఖ్య 29.5 కోట్లు కాగా ప్రస్తుతం అది 40.7 కోట్లకు చేరింది. కొత్తగా చేరిన ఈ పాఠకులు పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 7 కోట్లు ఉండటం గమనార్హం. అలాగే 12 ఏళ్లు పైబడిన వారిలో పాఠకుల సంఖ్య 9 శాతం పెరిగినట్టు తేలింది. ‘‘ఈ అంకెలు ప్రింట్ రంగానికి మున్ముందు ఉజ్వల భవిష్యత్ ఉందనడానికి అద్దం పడుతున్నాయి’’ అని ఎంఆర్‌యూసీ చైర్మన్ ఆశిష్ భాసిన్ పేర్కొన్నారు. -
ఐఆర్ఎస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాక్ వర్గాలు
న్యూఢిల్లీ: ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిక వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన వర్గాలు హ్యక్ చేశాయి. ఆదాయపన్ను శాఖకు చెందిన http://www.irsofficersonline.gov.in వైబ్‌సైట్ శనివారం నుంచీ పనిచేయడం లేదని, అందులో పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
ఐఏఎస్ వర్సెస్ నాన్-ఐఏఎస్
న్యూఢిల్లీ: ‘ఇద్దరం అఖిల భారత సర్వీసు అధికారులమే.. కానీ వేతనాల్లో, పదోన్నతుల్లో వివక్ష ఎందుకు?’ అంటూ ఐఏఎస్యేతర అధికారులు గళమెత్తుతున్నారు. తమకూ ఐఏఎస్‌లతో సమానంగా వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ఐఏఎస్‌లూ వెనక్కి తగ్గడం లేదు. తమ ప్రతిభ, పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఉండాల్సిందేనంటున్నారు. ఇప్పుడున్న విధానాన్నే కొనసాగించాలని, తమను మిగతా సర్వీసు అధికారులతో సమానంగా పరిగణించ రాదంటూ 200 మంది ఐఏఎస్ అధికారుల బృందం సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. జాయింట్ సెక్రటరీ పోస్టును ఐఏఎస్ అధికారులు కేవలం 11 ఏళ్ల అనుభవంతో పొందుతారు. కానీ ఓ ఐఆర్ఎస్ అధికారికి ఆ పోస్టు దక్కాలంటే 13 ఏళ్లు ఎదురుచూడాల్సిందే. -
మాట వినకుంటే..
- ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌నంటూ మోసగాడి హెచ్చరికలు - తెలంగాణ, ఏపీలోనూ బెదిరింపు కాల్స్ - ఐఆర్ఎస్నంటూ టెండర్లు పొందిన వైనం - కైకలూరులో పోలీసులకు చిక్కిన కేటుగాడు కైకలూరు: ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమిషనర్, ఐఆర్ఎస్ అంటూ ప్రజలను భయపెట్టి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులకు గురువారం చిక్కాడు. తెలంగాణ, ఏపీలో ఇతగాడి మాయమాట లకు పలు శాఖలు ప్రొటోకాల్ సైతం కల్పించాయి. కైకలూరు మండలం ఆలపాడులో ఓ చేపల చెరువు వివాదంలో దంపతులను బెదిరించిన ఘటనలో పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. కైకలూరులో సీఐ మురళీకృష్ణ, రూరల్ ఎస్సై రంజిత్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో నిందుతుడి వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడ గ్రామానికి చెందిన పిడకల సురేష్ కుమార్ ఎంబీఏ చదివి 2008 వరకు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తర్వాత కేలాబ్ అనే పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను సరఫరా చేసే సంస్థను నెలకొల్పాడు. హైదరాబాదులోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వీడియో కాన్ఫరెన్సు మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు తాను ఐఆర్ఎస్, ఇన్‌కంట్యాక్స్ ఆఫీసరునంటూ టెండర్లు దక్కించుకున్నాడు. నకిలీ ఐడెంటిటీ కార్డుపై ఆఫీస్ అడ్రస్ రేస్‌కోర్టు రోడ్డు, కొయంబత్తూరు అని... ఇంటి అడ్రస్ ఎలిగేషన్ రోడ్డు, భరత్‌నగర్ కాలనీ, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద, కొయంబత్తూరు అంటూ ముద్రిం చుకున్నాడు. మధ్య మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇన్‌కంట్యాక్స్ కార్యాలయానికి వచ్చి... తాను ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌నంటూ హుందాగా మాట్లాడడంతో అతను వచ్చినప్పుడల్లా పోలీసులు, రె వెన్యూ అధికారులు ప్రొటోకాల్ పాటించారు. తెలంగాణలో ఎక్కువగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా చిక్కాడు... కైకలూరు మండలం ఆలపాడు వద్ద నంగెడ్డ శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి 2 ఎకరాల 70 సెంట్లను ఇదే గ్రామానికి చెందిన పెనుమూడి నాగ వెంకట లక్ష్మీనారాయణ దంపతులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో చేపల చె రువు ఉంది. శ్రీకాంత్ తిరిగి తన భూమి తనకు అమ్మాలని కోరుతున్నాడు. దీనికి ఆ దంపతులు ఒప్పుకోలేదు. చివరకు శ్రీకాంత్ ఘరానా మోసగాడు సురేష్‌కుమార్‌ను ఆశ్రయించాడు. ఇతను లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి తాను ఇన్‌కంట్యాక్స్ ఆఫీసరునని, మీ ఆస్తులను సీజ్ చేస్తామని బెదిరించాడు. ఈ విషయాన్ని దం పతులు గుడివాడ డీఎస్పీ వై.అంకినీడు ప్రసాద్‌కు తెలుపగా ఆయన ఆదేశాలతో రూరల్ ఎస్సై రంజిత్‌కుమార్ వలపన్ని నకిలీ ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 420, 170 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా..
తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్కు ఎంపికైనా.. అంగవైకల్యం కారణంగా అందని నియామకం... వైకల్యం శరీరానికేగానీ, ప్రతిభకు, ఉన్నత లక్ష్యానికి కాదని రుజువు చేయాలనే సంకల్పం... ప్రజలకు సేవ చేసేందుకు వైకల్యం అడ్డుకాదని నిరూపించాలనే తపన.. రోజూ క్రమం తప్ప కుండా పటిష్ట ప్రణాళికతో సుదీర్ఘ ప్రిపరేషన్ ఫలితం.. సివిల్ సర్వీసెస్- 2014లో ఆలిండియా టాపర్...! ఇదీ ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్ సక్సెస్ స్టోరీ! ఇరా విజయగాథ ఆమె మాటల్లోనే... మా స్వస్థలం మీరట్. అమ్మానాన్న రాజేంద్ర సింఘాల్, అనితా సింఘాల్ ఢిల్లీలో స్థిరపడ్డారు. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగులే. దాంతో నా విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే కొనసాగింది. పదో తరగతి వరకు లొరెంటో కాన్వెంట్లో, 12వ తరగతి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ (సీఎస్ఈ), ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) పూర్తి చేశాను. అఖిల భారత సర్వీసుల్లో కొలువు సంపాదించడం అనేది చిన్ననాటి కల. నేను పెరిగిన వాతావరణం, పరిసర పరిస్థితులే ఇందుకు కారణం. దీనికితోడు అకడమిక్‌గా మంచి ప్రతిభ చూపడంతో అందరూ ప్రోత్సహించారు. కార్పొరేట్ కొలువు నుంచి సివిల్స్ దిశగా అకడమిక్ అర్హతల ఆధారంగా 2008లో క్యాడ్బరీ ఇండియాలో మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. అంతకుముందు కోకాకోలా ఇండియాలో మార్కెటింగ్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేశాను. 2010 జనవరిలో క్యాడ్బరీ ఇండియాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, సివిల్స్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నం (2010)లోనే 813వ ర్యాంకుతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. కానీ, అంగవైకల్యం(వెన్నెముక లోపం) పరిమిత స్థాయికంటే ఎక్కువ ఉందని విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించారు. వైకల్యం శరీరానికే.. ప్రతిభకు కాదు అంగవైకల్యం కారణంతో ఐఆర్ఎస్ నియామకం అందకపోవడంతో తొలుత కొంత నిరుత్సాహానికి గురయ్యాను. కానీ, వెంటనే తేరుకుని వైకల్యం శరీరానికేగానీ, ప్రతిభకు, సంకల్పానికీ కాదని రుజువు చేయాలనుకున్నా. ఐఆర్ఎస్లో పోస్టింగ్ కోసం క్యాట్‌ను ఆశ్రయించి ఒకవైపు పోరాడుతూనే మరోవైపు సివిల్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించా. ఐఆర్ఎస్ కంటే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశమున్న ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ క్రమంలో 2011లో 888వ ర్యాంకు, 2013లో 839వ ర్యాంకు వచ్చాయి. మరోవైపు కార్పొరేట్ కంపెనీల్లో విధులు నిర్వర్తించిన తీరు, అక్కడ నేను చూపిన ఫలితాలు నిదర్శనాలుగా క్యాట్‌లో పోరాడాను. ఎట్టకేలకు విజయం సాధించి గతేడాది సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో పోస్టింగ్ సాధించా. ఇప్పుడు సివిల్స్ 2014 పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సొంతమైంది. ఈ ర్యాంకు ఊహించనిది. ఈ విషయం తొలుత మా పైఅధికారి ఒకరు ఫోన్ చేసి చెప్పినప్పుడు నమ్మలేదు. తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు చెప్పడంతో నా ఆనందానికి అవధుల్లేవు. క్రమబద్ధమైన ప్రిపరేషన్ సివిల్స్ కోసం క్రమబద్ధమైన ప్రిపరేషన్ సాగించాను. సిలబస్ ప్రకారం ప్రతి అంశానికి సంబంధించి అన్ని రకాల సమాచార మార్గాలను వినియోగించుకున్నాను. ప్రామాణిక పుస్తకాలు మొదలు.. ఇంటర్నెట్ ఆధారంగా తాజా పరిణామాలపై విశ్లేషణాత్మకంగా పట్టు సాధించాను. తొలి ప్రయత్నం నుంచి ఇదే విధంగా వ్యవహరించాను. ప్రతి అంశానికి సంబంధించి సొంతగా నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకున్నాను. అంతేకాకుండా రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాను. ఇది పరీక్షలో ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నిర్దిష్ట సమయంలో సమాధానాలు ఇచ్చే నైపుణ్యం లభించింది. ఈ విధంగా రోజూ క్రమం తప్పకుండా పది గంటలపాటు ప్రిపరేషన్ సాగించాను. ఆహ్లాదకరంగా ఇంటర్వ్యూ సివిల్స్ - 2014 ఇంటర్వ్యూ ఛత్తర్సింగ్ బోర్డ్ నేతృత్వంలో 25 నిమిషాలపాటు సాగింది. చైర్మన్ సహా మొత్తం అయిదుగురు సభ్యుల బోర్డ్‌లో ఇంటర్వ్యూ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. మహిళల సాధికారత, వికలాంగుల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, వారి అభివృద్ధికి మీరేం చేస్తారు? వంటి ప్రశ్నలతోపాటు అకడమిక్ నేపథ్యం, పని అనుభవానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూ... ప్రశ్న, సమాధానం తరహాలో కాకుండా చర్చ తీరులో సాగడం అనుకూలించింది. ఇంటర్వ్యూలో నేను చెప్పిన సమాధానాలు, బోర్డ్ సభ్యుల స్పందనబట్టి ర్యాంకు వస్తుందని భావించాను. కానీ ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందనుకోలేదు. అందులోనూ ఓపెన్ కేటగిరీలో ఈ ర్యాంకు రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. నిరుత్సాహం వద్దు ప్రస్తుతం దేశంలో ఎందరో వికలాంగులున్నారు. వారిలో ప్రతిభావంతులు మరెందరో! కానీ తమ శారీరక వైకల్యంతో మానసికంగా కుంగిపోయి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. వైకల్యం వేదనను పారదోలి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి. కనీసం ఏడాది ముందు నుంచి సివిల్స్ ఔత్సాహికులు కనీసం ఏడాది ముందు నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ మినహా దాదాపు అన్ని పేపర్లకు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకునే విధంగా పరీక్ష స్వరూపం ఉండటం కలిసొచ్చే అంశం. వచ్చే నెలలో జరిగే ప్రిలిమ్స్ పరీక్ష ఔత్సాహికులు జూలై నెలాఖరుకు ప్రిపరేషన్‌ను పూర్తిచేసుకుని, ఆగస్టు మొత్తం రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్‌లకు కేటాయించడం మంచిది. చాలా మంది అభ్యర్థులు సివిల్స్ అంటే లైఫ్ అండ్ డెత్ పరీక్షగా భావిస్తారు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం తప్ప ఫలితం ఉండదు. కాబట్టి విజయావకాశాల గురించి ఆలోచించకుండా.. పరీక్షలో మంచి పనితీరు కనబర్చాలనే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే విజయం దానంతటదే వరిస్తుంది. ఆల్ ది బెస్ట్!! ప్రొఫైల్ సివిల్స్-2014లో 1082 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు. 2011 నవంబర్ నుంచి 2012 డిసెంబర్ వరకు స్పానిష్ లెక్చరర్‌గా విధులు. 2008 జూన్ నుంచి 2010 జనవరి వరకు క్యాడ్బరీ ఇండియాలో మేనేజర్. ఎంబీఏ (2008)- ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ 2007లో కోకోకోలా ఇండియాలో ఇంటర్న్.బీఈ (సీఎస్ఈ) (2006)- నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 12వ తరగతి (2001)-ఆర్మీ పబ్లిక్ స్కూల్(జీపీఏ 9.3) పదో తరగతి (1999)- లొరెటో కాన్వెంట్ స్కూల్ (జీపీఏ 9.1) -
సివిల్స్ రాయడానికి మరో రెండు ఛాన్సులు
సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షల విషయంలో యూపీఎస్సీ భారీ సంస్కరణలకు తెరతీసింది. ఇప్పటివరకు నాలుగుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసే అవకాశం ఉండగా దాన్నిప్పుడు ఆరుకు పెంచారు. దాంతోపాటు వయసు మినహాయంపు కూడా లభించనుంది. ఈ మేరకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకుముందులాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం ఎన్నిసార్లయినా ఈ పరీక్ష రాసుకోవచ్చు. అలాగే 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ ప్రతిష్ఠాత్మ పరీక్షకు హాజరు కావచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్.. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సర్వీసుల కోసం యూపీఎస్సీ ఈ సివిల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2014 సంవత్సరానికి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు 24న జరగనుంది. ఈసారి సుమారు 1291 పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తున్నారు. -
క్రేజీ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి వచ్చీరాగానే మహామహా పార్టీలను మట్టికరిపించి ఢిల్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న 45 ఏళ్ల అరవింద్ కేజ్రీవాల్ అంతేవేగంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన ఐఆర్ఎస్ పదవి వదులుకుని సమాచారహక్కు చట్టం అమలు కోసం పోరాటం చేశారు. 2011లో అన్నాహజారే చేపట్టిన జన్‌లోక్‌పాల్ ఉద్యమంలో చేరి కీలకపాత్ర పోషించారు. దీంతో కేజ్రీవాల్ పేరు దేశంలో మార్మోగింది. కేజ్రీవాల్ హజారేతో విభేదాలు తలెత్తాక, అవినీతి నిర్మూలిస్తానంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆప్ సంచలన విజయంతో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. జన్‌లోక్‌పాల్ బిల్లు వ్యవహారంలో మాట నెగ్గించుకోలేక పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన జీవిత విశేషాలివీ.. జననం: 1968, ఆగస్టు 16న హర్యానాలోని హిస్సార్‌లో; భార్య: సునీతా కేజ్రీవాల్ (ఐఆర్ఎస్ అధికారి); విద్య: హిస్సార్ క్యాంపస్ స్కూల్, ఐఐటీ ఖరగ్‌పూర్ (మెకానికల్ ఇంజనీరింగ్); 1989-92: టాటా స్టీల్‌లో ఉద్యోగం; 1995: ఐఆర్ఎస్లో చేరిక; 2000: ఉన్నత విద్య కోసం రెండేళ్ల పాటు ఆర్జిత సెలవు.. మూడేళ్ల తర్వాత తిరిగి ఉద్యోగంలోకి; 2006: ఢిల్లీలోని ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ పదవికి రాజీనామా. ఆర్టీఐ ఉద్యమానికి గుర్తింపుగా రామన్ మెగసెసె అవార్డు; 2012: నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రారంభం; 2013 డిసెంబర్ 8: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భా వం. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం షీలా దీక్షిత్‌పై 26 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు; డిసెంబర్ 28: కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు. సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం; 2014 ఫిబ్రవరి 14: సీఎం పదవికి రాజీనామా. -
ఐఆర్ఎస్ గణాంకాలు తప్పులతడక
ప్రముఖ మీడియా సంస్థల ఖండన సర్వేను వెనక్కి తీసుకోవాలని డిమాండ్.. ఈ సర్వేను నమ్మొద్దని ప్రకటనకర్తలకు, మీడియా ఏజెన్సీలకు విన్నపం సాక్షి, హైదరాబాద్: వివిధ పత్రికల పాఠకుల సంఖ్యపై ఇండియన్ రీడర్షిప్ సర్వే (ఐఆర్ఎస్) తాజాగా వెలువరించిన గణాంకాలను దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు తీవ్రంగా ఖండిం చాయి. ఈ గణాంకాలన్నీ తప్పులతడకగా, అసంబద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాయి. ఐఆర్ఎస్ 2013 సర్వేను కొత్త ఏజెన్సీ (ఈ సంస్థ రీడర్షిప్ సర్వేను చేపట్టడం ఇదే తొలిసారి) ద్వారా నిర్వహించారని, ఇందులో అనేక త ప్పులు, పొరపాట్లు దొర్లాయని సోదాహరణంగా వివరించాయి. సర్వే గణాంకాలను ఖండిస్తూ సాక్షి తెలుగు దినపత్రికతోపాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, దైనిక్ జాగరణ్ గ్రూప్, ఆనంద్ బజార్ గ్రూప్, లోక్మత్ గ్రూప్, దినకరణ్ గ్రూప్, దైనిక్ భాస్కర్ గ్రూప్, అమర్ ఉజాలా గ్రూప్, ద హిందూ గ్రూప్, డీఎన్ఏ గ్రూప్, ఇండియా టుడే గ్రూప్, ఔట్లుక్ గ్రూప్, మిడ్ డే, నయి దునియా, బర్తమాన్, ఆజ్ సమాజ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. సర్వే ఫలితాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సర్వేను నిర్వహించిన ఆర్ఎస్సీఐ, ఎంఆర్‌యూసీ సంస్థలను డిమాండ్ చేశాయి. ఇలా తప్పుదోవ పట్టించే సర్వేలను భవిష్యత్తులో ప్రచురించవద్దని కోరాయి. ఏబీసీ వెలువరించే సర్క్యులేషన్ గణాంకాలకు కూడా పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ సర్వేను నమ్మొద్దని ప్రకటనకర్తలను, మీడియా ఏజెన్సీలను కోరారు. సర్వే తప్పులతడక అని చెప్పడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు... - ఒక్క ఏడాదిలోనే పంజాబ్‌లో పాఠకుల సంఖ్య ఏకంగా మూడోవంతు తగ్గింది. అదే పొరుగున ఉన్న హర్యానాలో మాత్రం పాఠకుల సంఖ్య 17 శాతం పెరిగింది. - ఆంధ్రప్రదేశ్‌లో భాషలకు అతీతంగా వివిధ ప్రధాన పత్రికల పాఠకుల సంఖ్యలో 10 నుంచి ఏకంగా 65 శాతం తగ్గుదల నమోదైంది. - ముంబైలో పాఠకుల సంఖ్య 20.3% పెరిగింది. అదే సమయంలో అన్ని రంగాల్లో ముంబై కంటే వేగంగా దూసుకుపోతున్న ఢిల్లీలో పాఠకుల సంఖ్య 19.5% తగ్గింది. - నాగ్‌పూర్‌కు చెందిన ఇంగ్లిష్ పత్రిక ‘హితవాద’కు 60 వేలకుపైగా సర్క్యులేషన్ ఉన్నా ఒక్క పాఠకుడు కూడా లేడు! - ‘హిందూ బిజినెస్ లైన్’ పత్రికకు చెన్నైలో కంటే మణిపూర్‌లో మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో పాఠకులు ఉన్నారు. -
బీమా పాలసీలకూ డీ-మ్యాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమాతో పాటు ఆరోగ్య, వాహన బీమాలనూ ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయాలని, దీనికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని ఐఆర్‌డీఏను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కోరారు. ప్రస్తుతం జీవిత బీమా పథకాలను మాత్రమే... అది కూడా కోరిన వారికి మాత్రమే ఎలక్ట్రానిక్ రూపంలో అందించే ఏర్పాట్లు చేశారని, దీన్ని సాధారణ బీమా పథకాలకూ వర్తింపజేయాలని, అంతేకాకుండా అందరికీ తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాచేస్తే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఇన్సూరెన్స్ రిపాజిటరీ సిస్టమ్‌ను (ఐఆర్ఎస్) చిదంబరం సోమవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రూపంలో బీమా పథకాలు అందించడం వల్ల ఇటు పాలసీదారులతో పాటు, అటు బీమా కంపెనీలకూ నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. గత పదేళ్ళ నుంచీ షేర్లను డీమ్యాట్ రూపంలోనే అందించాలనే నిబంధన విధించామని, దీనివల్ల ఇన్వెస్టర్లు వాటిని సులభంగా భద్రపరచుకునే అవకాశం కలిగిందని, అనేక మోసాలకు అడ్డుకట్ట పడిందని తెలియజేశారు. అలాగే బీమా పథకాలు కూడా డీ-మ్యాట్ రూపంలో అందిస్తే పాలసీదారులు ఒక ఊరి నుంచి మరో ఊరికి వలస వెళ్ళినా, లేదా ప్రకృతి వైపరీత్యాల్లో ఆస్తులను పోగొట్టుకున్నా... పాలసీ డాక్యుమెంట్లు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా ఉండటమే కాకుండా వేగంగా క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రస్తు తం ఎలక్ట్రానిక్ రూపంలో అకౌంట్ ప్రారంభించడానికి రూ.150 వరకు ఖర్చవుతోందని, అదే గనక సేవలు విస్తరిస్తే ఈ వ్యయం రూ.20 తగ్గుతుందనే ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. రిపాజిటరీ సేవలకు ఐదు సంస్థలు: బీమా పథకాలను కాగిత రహితంగా ఎలక్ట్రానిక్ రూపంలో అందించడానికి రాష్ట్రానికి చెందిన కార్వీ రిపాజిటరీ లిమిటెడ్‌తో పాటు ఎన్ఎస్డీఎస్ఎల్, సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, కామ్స్, ఎస్‌హెచ్‌ఐఎల్ వంటి ఐదు సంస్థలను ఐఆర్డీఏ ఎంపిక చేసింది. రిపాజిటరీ సేవలు ప్రారంభం సందర్భంగా ప్రారంభ కిట్లను ఈ ఐదు కంపెనీలకు చెందిన ప్రతినిధులకు చిందంబరం చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ మాట్లాడుతూ అన్ని బీమా పథకాలనూ ఒకే అకౌంట్లో భద్రపర్చుకునేలా దీన్ని రూపొందించామని, ఒకసారి ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ ప్రారంభిస్తే తదుపరి పాలసీలకు ఎటువంటి కేవైసీ నిబంధనల అవసరం ఉండదని తెలియజేశారు. బీమా పథకాలను డీ-మ్యాట్ రూపంలో అందించడానికి విశేష కృషి చేసిన ఐఆర్డీఏ మాజీ చైర్మన్ జంధ్యాల హరినారాయణకి ఈ సందర్భంగా విజయన్ అభినందనలు తెలిపారు. ప్రపంచ సగటు బీమా సాంద్రత 6.5 శాతంగా ఉంటే అది ఇండియాలో 3.96 శాతంగా ఉందని, బీమా రంగంలో ఇంకా వ్యాపార విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. అందుబాటు ధరలో వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా బీమా పథకాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బీమా కంపెనీల ప్రతినిధులతో పాటు, రిపాజిటరీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.