ఐఆర్‌ఎస్ గణాంకాలు తప్పులతడక | IRS Statistics are not genuine | Sakshi
Sakshi News home page

ఐఆర్‌ఎస్ గణాంకాలు తప్పులతడక

Published Sat, Feb 1 2014 1:31 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

IRS Statistics are not genuine

 ప్రముఖ మీడియా సంస్థల ఖండన
 సర్వేను వెనక్కి తీసుకోవాలని డిమాండ్.. ఈ సర్వేను నమ్మొద్దని
 ప్రకటనకర్తలకు, మీడియా ఏజెన్సీలకు విన్నపం
 
 సాక్షి, హైదరాబాద్: వివిధ పత్రికల పాఠకుల సంఖ్యపై ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్) తాజాగా వెలువరించిన గణాంకాలను దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు తీవ్రంగా ఖండిం చాయి. ఈ గణాంకాలన్నీ తప్పులతడకగా, అసంబద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాయి. ఐఆర్‌ఎస్ 2013 సర్వేను కొత్త ఏజెన్సీ (ఈ సంస్థ రీడర్‌షిప్ సర్వేను చేపట్టడం ఇదే తొలిసారి) ద్వారా నిర్వహించారని, ఇందులో అనేక త ప్పులు, పొరపాట్లు దొర్లాయని సోదాహరణంగా వివరించాయి. సర్వే గణాంకాలను ఖండిస్తూ సాక్షి తెలుగు దినపత్రికతోపాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, దైనిక్ జాగరణ్ గ్రూప్, ఆనంద్ బజార్ గ్రూప్, లోక్‌మత్ గ్రూప్, దినకరణ్ గ్రూప్, దైనిక్ భాస్కర్ గ్రూప్, అమర్ ఉజాలా గ్రూప్, ద హిందూ గ్రూప్, డీఎన్‌ఏ గ్రూప్, ఇండియా టుడే గ్రూప్, ఔట్‌లుక్ గ్రూప్, మిడ్ డే, నయి దునియా, బర్తమాన్, ఆజ్ సమాజ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. సర్వే ఫలితాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సర్వేను నిర్వహించిన ఆర్‌ఎస్‌సీఐ, ఎంఆర్‌యూసీ సంస్థలను డిమాండ్ చేశాయి. ఇలా తప్పుదోవ పట్టించే సర్వేలను భవిష్యత్తులో ప్రచురించవద్దని కోరాయి. ఏబీసీ వెలువరించే సర్క్యులేషన్ గణాంకాలకు కూడా పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ సర్వేను నమ్మొద్దని ప్రకటనకర్తలను, మీడియా ఏజెన్సీలను కోరారు. 
 సర్వే తప్పులతడక అని చెప్పడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు...
 
 - ఒక్క ఏడాదిలోనే పంజాబ్‌లో పాఠకుల సంఖ్య ఏకంగా మూడోవంతు తగ్గింది. అదే పొరుగున ఉన్న హర్యానాలో మాత్రం పాఠకుల సంఖ్య 17 శాతం పెరిగింది.
 - ఆంధ్రప్రదేశ్‌లో భాషలకు అతీతంగా వివిధ ప్రధాన పత్రికల పాఠకుల సంఖ్యలో 10 నుంచి ఏకంగా 65 శాతం తగ్గుదల నమోదైంది.
 - ముంబైలో పాఠకుల సంఖ్య 20.3% పెరిగింది. అదే సమయంలో అన్ని రంగాల్లో ముంబై కంటే వేగంగా దూసుకుపోతున్న ఢిల్లీలో పాఠకుల సంఖ్య 19.5% తగ్గింది.
 - నాగ్‌పూర్‌కు చెందిన ఇంగ్లిష్ పత్రిక ‘హితవాద’కు 60 వేలకుపైగా సర్క్యులేషన్ ఉన్నా ఒక్క పాఠకుడు కూడా లేడు!
 - ‘హిందూ బిజినెస్ లైన్’ పత్రికకు చెన్నైలో కంటే మణిపూర్‌లో మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో పాఠకులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement