- ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌నంటూ మోసగాడి హెచ్చరికలు
- తెలంగాణ, ఏపీలోనూ బెదిరింపు కాల్స్
- ఐఆర్‌ఎస్‌నంటూ టెండర్లు పొందిన వైనం
- కైకలూరులో పోలీసులకు చిక్కిన కేటుగాడు
కైకలూరు: ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమిషనర్, ఐఆర్‌ఎస్ అంటూ ప్రజలను భయపెట్టి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులకు గురువారం చిక్కాడు. తెలంగాణ, ఏపీలో ఇతగాడి మాయమాట లకు పలు శాఖలు ప్రొటోకాల్ సైతం కల్పించాయి. కైకలూరు మండలం ఆలపాడులో ఓ చేపల చెరువు వివాదంలో దంపతులను బెదిరించిన ఘటనలో పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. కైకలూరులో సీఐ మురళీకృష్ణ, రూరల్ ఎస్సై రంజిత్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో నిందుతుడి వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడ గ్రామానికి చెందిన పిడకల సురేష్ కుమార్ ఎంబీఏ చదివి 2008 వరకు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తర్వాత కేలాబ్ అనే పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను సరఫరా చేసే సంస్థను నెలకొల్పాడు.
హైదరాబాదులోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వీడియో కాన్ఫరెన్సు మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు తాను ఐఆర్‌ఎస్, ఇన్‌కంట్యాక్స్ ఆఫీసరునంటూ టెండర్లు దక్కించుకున్నాడు. నకిలీ ఐడెంటిటీ కార్డుపై ఆఫీస్ అడ్రస్ రేస్‌కోర్టు రోడ్డు, కొయంబత్తూరు అని... ఇంటి అడ్రస్ ఎలిగేషన్ రోడ్డు, భరత్‌నగర్ కాలనీ, బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ వద్ద, కొయంబత్తూరు అంటూ ముద్రిం చుకున్నాడు. మధ్య మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇన్‌కంట్యాక్స్ కార్యాలయానికి వచ్చి... తాను ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌నంటూ హుందాగా మాట్లాడడంతో అతను వచ్చినప్పుడల్లా పోలీసులు, రె వెన్యూ అధికారులు ప్రొటోకాల్ పాటించారు. తెలంగాణలో ఎక్కువగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇలా చిక్కాడు...
కైకలూరు మండలం ఆలపాడు వద్ద నంగెడ్డ శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి 2 ఎకరాల 70 సెంట్లను ఇదే గ్రామానికి చెందిన పెనుమూడి నాగ వెంకట లక్ష్మీనారాయణ దంపతులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో చేపల చె రువు ఉంది. శ్రీకాంత్ తిరిగి తన భూమి తనకు అమ్మాలని కోరుతున్నాడు. దీనికి ఆ దంపతులు ఒప్పుకోలేదు. చివరకు శ్రీకాంత్ ఘరానా మోసగాడు సురేష్‌కుమార్‌ను ఆశ్రయించాడు. ఇతను లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి తాను ఇన్‌కంట్యాక్స్ ఆఫీసరునని, మీ ఆస్తులను సీజ్ చేస్తామని బెదిరించాడు. ఈ విషయాన్ని దం పతులు గుడివాడ డీఎస్పీ వై.అంకినీడు ప్రసాద్‌కు తెలుపగా ఆయన ఆదేశాలతో రూరల్ ఎస్సై రంజిత్‌కుమార్ వలపన్ని నకిలీ ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 420, 170 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
మాట వినకుంటే..
Published Fri, Sep 25 2015 8:42 AM | Last Updated on Thu, Sep 27 2018 4:34 PM
Advertisement
Advertisement