స్థానికులతో మాట్లాడుతున్న జైపూర్ ఏసీపీ సీతారాములు
భీమారం : పోలీసులు పనిచేసేది ప్రజల కోసమేనని జైపూర్ ఏసీపీ సీతారాములు అన్నారు. మండల కేంద్రంలోని బోయగూడెంలో పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలంలో స్థానిక కుటుంబాలతో బుధవారం ఆయన మాట్లాడారు. 411 సర్వే నెంబర్‌లో 19 గుంటల భూమిని ప్రభుత్వం పీఎస్‌కు కేటాయించిందన్నారు. దీనిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సుపారిపాలన కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందులో కొత్తగా ఏర్పాటైన భీమారాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఉంటేనే ఆ కార్యాలయాలకు కళ వస్తుందన్నారు. దసరా పండుగ సందర్భంగా జంబి పూజలు, మరోవైపు బతుకమ్మ ఆడుకుంటారని, ఇందుకోసమే అడ్డుకుంటున్నామని స్థానికులు తెలిపారు. వాటి కోసం మరోచోట స్థలం చూపించి ఇక్కడ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఉన్న స్థలంలో కొంత భాగాన్ని బతుకమ్మ, జంబి చెట్టు కు కేటాయిస్తామని ఏసీపీ హామీఇచ్చారు. చెన్నూరు సీఐ కిశోర్, ఎస్సై మంగీలాల్ æరాజ్‌కుమార్‌నాయక్, ఎంపీపీ మెండె హేమలత, సర్పంచ్ ఎల్కటూరి శంకరమ్మ తదితరులు ఉన్నారు.
ఆరెపల్లిలో కార్డెన్‌సెర్చ్
మండలంలోని ఆరెపల్లి గ్రామంలో బుధవారం ఉదయం జైపూర్ ఏసీపీ సీతారాములు ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వాహనపత్రాలు లేని 10 ద్విక్ర వాహనాలతోపాటు టాటా ఏసీ, 9 ఆటోరిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి నిర్భంద తనిఖీ చేశారు. చెన్నూరు సీఐ కిశోర్, భీమారం ఎస్సై మంగీలాల్, శ్రీరాంపూర్ ఎస్సై రవిప్రసాద్, ఏఎస్సైలు గంగన్న, నజీర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment