ప్రజాసమస్యలపై పోరుబాట | fight on public problems | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై పోరుబాట

Published Sat, Mar 18 2017 9:20 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

ప్రజాసమస్యలపై పోరుబాట - Sakshi

ప్రజాసమస్యలపై పోరుబాట

- 25న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
  మున్సిపల్‌ కార్యాలయ ముట్టడి
- పార్టీ కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ):  ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టినట్లు పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌ తెలిపారు. ఇందులో భాగంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న దోమల సమస్య నివారణ డిమాండ్‌తో ఈ నెల 25న నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు హఫీజ్‌ఖాన్‌ నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
 
కార్యక్రమంలో భాగంగా హఫీజ్‌ఖాన్‌ తన పర్యటనలో అనేక సమస్యలను గుర్తించారు. వాటిని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా దోమల సమస్య అధికంగా ఉన్నట్లు ప్రజలు చెబుతుండడంతో ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25వతేదీన నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు హఫీజ్‌ఖాన్‌ వెల్లడించారు. స్థానిక రాయల్‌ ఫంక‌్షన్‌హాలు పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటాక కుళాయిలకు నీరు సరఫరా చేస్తుండడంతో ప్రజలు జాగరణ చేయాల్సిన పరిస్తితి నెలకొందన్నారు. దీనికితోడు కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందన్నారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలన్నారు. కొన్ని వీధుల్లో విద్యుత​ తీగలు కిందుగా వేలాడు ప్రమాద హేతువులుగా ఉన్నాయన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవలని కోరారు.
 
ఉదయం 10.30 గంటలకు ప్రారంభించే నగరపాలక సంస్థ ముట్టడిలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, మైనారిటీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎ.రహ్మాన్, మాజీ కార్పొరేటర్‌ దాదామియ్య, నాయకులు పేలాల రాఘవేంద్ర, గణపచెన్నప్ప, జాన్, నవీద్, హరికృష్ణ, షోయాబుద్దీన్‌ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement