ప్రొద్దుటూరు/కడప కార్పొరేషన్ : సివిల్స్ ఫలితాలలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మెరిశారు. కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా అక్క కుమారుడు ముషఫ్ ్ర80వ ర్యాంకు సాధించాడు. అలాగే ప్రొద్దుటూరు పట్టణంలోని గురువయ్యతోటకు చెందిన కొమ్మిశెట్టి మురళీధర్ సివిల్స్‌లో 406వ ర్యాంక్ సాధించారు. ర్యాంక్ ఆధారంగా ఇండియన్ పోలీస్‌సర్వీస్ లేదా ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపిక కావచ్చని తెలుస్తోంది. స్థానిక మున్సిపాలిటీలో శానిటరీ
సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాంప్రసాద్, జమాల్ ఎయిడెడ్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న గోపాలమ్మ కుమారుడు మురళీధర్ చాలా రోజులుగా సివిల్స్‌లో రాణిం చేందుకు కృషి చేస్తున్నారు.
గత ఏడాది దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్షలో 12వ ర్యాంక్ సాధించాడు. అదే సమయంలో సివిల్స్ పరీక్ష రాయగా ప్రస్తుత ఫలితాలలో 406వ ర్యాంక్ సాధించాడు. మురళీధర్ 1-5వ తరగతి వరకు స్థానిక మహర్షి స్కూల్, 6-8వ తరగతి వరకు కోరుకొండ సైనిక స్కూల్‌లో చదివాడు. 9-10 తరగతులు స్థానిక ఆదిత్య హైస్కూల్‌లో చదివాడు. టెన్త్ ఫలితాలలో 540 మార్కులు సాధించి స్కూల్ సెకండ్‌గా నిలిచాడు. ఇంటర్మీడియ ట్ ఎంపీసీ గ్రూప్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. ఇం దులో 970 మార్కులు సాధించాడు. చెన్నై ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసి డిస్టిన్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఎంటెక్ అనంతరం పూణెలోని సైమన్‌టెక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ సివిల్స్‌పై దృష్టి సారించారు. లక్ష్యాన్ని సాధించేందుకు మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2010 డిసెంబర్‌లో ఐఏఎస్ అధికారి, ప్రస్తుత లేబర్ కమిషనర్ రామాంజనేయులు కూతురు హరిప్రియను వివాహం చేసుకున్నారు. మురళీధర్ సోదరుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
చాలా ఆనందంగా ఉంది
మా కొడుకు కొమ్మిశెట్టి మురళీధర్ సివిల్స్‌లో 406వ ర్యాంక్ సాధించినందుకు తమకెంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు రాంప్రసాద్, గోపాలమ్మ తెలిపారు. ర్యాంకు కోసం తమ కుమారుడు ఎంతో శ్రమించాడన్నారు. వాస్తవానికి ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని భావించామన్నారు.
సివిల్స్‌లో మెరిసిన ఆణిముత్యాలు
Published Fri, Jun 13 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement
Advertisement