సీఎం భార్య రిటైర్మెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య, భారత రెవెన్యూ సర్వీస్ అధికారిణి సునీత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారు. వీఆర్ఎస్ కోరుతూ ఈ ఏడాది మొదట్లో సునీత దరఖాస్తు చేయగా, సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఇందుకు అనుమతిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదాయపన్ను శాఖలో సునీత దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు. సునీత చివరిసారిగా ఢిల్లీలోని ఐటీఏటీలో ఐటీ కమిషనర్ హోదాలో విధులు నిర్వహించారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. కేజ్రీవాల్ ఉద్యోగానికి రాజీనామా చేసి తొలుత ప్రజాఉద్యమకర్త అన్నా హజారే బృందంతో కలసి ఉద్యమించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.