సాగర్‌లో పర్యాటకుల సందడి | Sagar tourists thronging | Sakshi

సాగర్‌లో పర్యాటకుల సందడి

Oct 1 2014 3:06 AM | Updated on Oct 19 2018 7:22 PM

విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో సాగర్‌లో పర్యాటకుల సందడి నెలకొంది. మంగళవారం పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడి

నాగార్జునసాగర్ : విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో సాగర్‌లో పర్యాటకుల సందడి నెలకొంది. మంగళవారం పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడి మ్యూజియంలోని విశేషాలు, బుద్ధుడి విగ్రహాలు, తదితర ప్రాంతాలను సందర్శించారు. అక్కడినుంచి సాయంత్రం వేళలో ఎత్తిపోతల, అంతకుముందే అనుపు, బుద్ధవనం తదితర ప్రాంతాలను సందర్శించారు.
 
 మ్యూజియాన్ని సందర్శించిన తమిళనాడు పర్యాటక సీఎండీ
 తమిళనాడు పర్యాటక సంస్థ సీఎండీ అండ్ కార్యదర్శి ఆర్.కన్నన్ సతీసమేతంగా మంగళవారం నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. ఆశ్వమేథయజ్ఞం, స్వస్తిక్ గర్తు, బుద్ధుడి విగ్రహం తదితర విగ్రహాలను సందర్శించారు. వీరివెంట ఏఎస్‌ఎం నర్సింహన్ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement