సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా బి.శ్రీరామ్ ఎంపికయ్యారు. నేడు (శనివారం) బ్యాంకు సీఎండీ బాధ్యతలు స్వీకరించారని ఐడీబీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుత ఎండీ మహేష్ కుమార్ జైన్ ఆర్‌బీఐ (రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా) డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికైన నేపథ్యంలో, ఆయన స్థానంలో శ్రీరామ్‌ను ఎంపిక చేసింది. జూన్ 29 న శ్రీరామ్ వాలంటరీ రిటైర్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఎస్‌బీఐ ప్రకటించింది. 2014 జూలై నుంచి ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐలో ఎండీ (కార్పొరేట్ మరియు గ్లోబల్ బ్యాంకింగ్) గా శ్రీరామ్ పనిచేస్తున్నారు. మరోవైపు అప్పుల ఊబిలో చిక్కుకున్న ఐడీబీఐలో 51 శాతం వాటా కొనుగోలుకు ప్రభుత్వ రంగ బీమాసంస్థ ఎల్‌ఐసీ అన్నిమార్గాలను సుగమం చేసుకుంటోంది. ఈ డీల్‌కు తాజాగా భారతీయ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డిఎఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment