appoints
-
పాత ఫార్ములానే..!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష నియామకంలో కాంగ్రెస్ హైకమాండ్ పాత ఫార్ములానే అనుసరించింది. ముఖ్యమంత్రిగా ఓసీ వర్గాలకు చెందిన వారిని నియమిస్తే... బీసీ వర్గానికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే సాంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోపాటు ఆయన మూడేళ్ల పదవీకాలం కూడా ముగిసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని ఏఐసీసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. నాలుగు నెలలుగా దీనిపై కసరత్తు చేసిన అధిష్టానం పలుమార్లు రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపి, అనేక కోణాల్లో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల పేర్లను ఈ పదవి కోసం పరిశీలించి చివరకు మహేశ్‌గౌడ్ వైపు మొగ్గు చూపింది. చర్చోపచర్చలు.. భిన్న వాదనలుకర్ణాటక ఫార్ములా ప్రకారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని తొలుత ప్రచారం జరిగింది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా అధ్యక్షుడిగా నియమించే అవకాశముందనే చర్చ కూడా జరిగింది. ఆ చర్చల అనంతరం సామాజికవర్గాల లెక్కలు తెరపైకి వచ్చాయి. ఓసీ వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తారని, ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పోరిక బలరాంనాయక్, మధుయాష్కీగౌడ్, మహేశ్కుమార్గౌడ్లలో ఒకరిని ఈ పదవిలో నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది.దీంతో పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీలను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినప్పటికీ అధ్యక్షుడి వ్యవహారాన్ని తేల్చలేదు. కేబినెట్ ఖాళీలు భర్తీ చేసే క్రమంలో సామాజిక సమతుల్యత సరిపోలడం లేదంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఇక, ఎస్సీల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాదిగ సామాజికవర్గానికి అవకాశం వస్తుందని, ఈ మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరు ఖరారైందని ప్రచారం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పేరు వినిపించింది. సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఈ పదవిలో నియమిస్తారని మరికొన్నాళ్లు చర్చ జరిగింది. ఇక, ఎట్టకేలకు ఆగస్టు చివరి వారంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చల్లో బీసీ వర్గానికి అధ్యక్ష పదవిని ప్రతిపాదించిన ఏఐసీసీ మధుయాష్కీ, మహేశ్‌గౌడ్‌ల పేర్లపై కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఎట్టకేలకు మహేశ్‌గౌడ్ వైపు మొగ్గుచూపింది. రెండు ప్రాంతాలకు చెరో పదవిమహేశ్గౌడ్ను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో విధేయతకు ఏఐసీసీ పెద్దపీట వేసింది. దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం, సామాజిక సమతుల్యత, రేవంత్ సిఫారసుకు ప్రాధాన్యం, సంస్థాగత వ్యవహారాలపై పట్టు నేపథ్యంలో మధుయాష్కీ, మహేశ్‌గౌడ్‌ల మధ్య దోబూచులాటతో చివరి నిమిషంలో ఉత్కంఠ రేపింది. మహేశ్‌గౌడ్ నియామకం పూర్తయిందని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే సంతకం చేశారని, కేసీ.వేణుగోపాల్ కూడా మహేశ్‌గౌడ్‌తో మాట్లాడి దిశానిర్దేశం చేశారనే వార్తలొచ్చిన తర్వాత కూడా మరోవారం రోజుల పాటు జాప్యం జరిగింది. ఈనేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ మార్కు ఊహాగానాలకు తెరలేచినా ఎట్టకేలకు మహేశ్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. -
ఫిక్కీ మీడియా కమిటీ చైర్మన్‌గా కెవిన్
న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్‌గా కెవిన్ వాజ్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వయాకామ్18లో బ్రాడ్కాస్ట్ ఎంటర్టైన్మెంట్ విభాగం సీఈవోగా ఉన్నారు. వాజ్‌కు మీడియా, వినోద రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ కమిటీలో టీవీ, రేడియో, ప్రింట్, ఫిలిం ప్రొడక్షన్ తదితర విభాగాలకు సంబంధించిన ప్రమోటర్లు, సీఈవోలు.. సభ్యులుగా ఉన్నారు. -
ఆమె సక్సెస్ మంత్రా... వ్యూహ చతురత వృత్తి నిబద్ధత
అనుభవం నేర్పిన పాఠాలు అద్భుత విజయాలను సొంతం చేస్తాయి. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలలో పని చేసిన ఇప్సితా దాస్‌గుప్తా ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకుంది. అమెరికాలో యాపిల్ సర్వీసెస్‌లో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్‌గా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా... అమెరికన్ మల్టీ నేషనల్ ఐటీ కార్పోరేషన్ ‘హెచ్‌పీ ఇండియా’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్వీపీ), మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం అయింది... పనిలోని కష్టమే ఇష్టమైతే అంతకంటే సుఖం ఏమున్నది? కొలంబియా యూనివర్శిటీలో మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ఈప్సితా ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేసింది. ముంబై రోడ్లపై ఉరుకులు, పరుగులు, పని భారంతో నిద్రలేని రాత్రులు ఆమెకు కొత్తేమీ కాదు. కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోడంలో సమస్యలు తలెత్తాయి. ‘నాకు కష్టంగా ఉంది’ అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎన్నో కంపెనీలలో మార్కెటింగ్, స్ట్రాటజీ విభాగాలకు నేతృత్వం వహించి మన దేశంతో సహా బంగ్లాదేశ్, శ్రీలంకలలో పనిచేసింది ఈప్సితా. ఆఫీస్ గదికే పరిమితం కాకుండా జనాల్లోకి వెళ్లి క్లయింట్స్ అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేది. వాటికి అనుగుణంగా వ్యూహాలను రూ΄÷ందించుకునేది. యాపిల్‌కు ముందు స్టార్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రాటజీ, జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ దక్షిణ ఆసియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పని చేసిన ఈప్సితా వృత్తికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరితో చర్చిస్తుంది. ‘తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవచ్చునేమోగానీ, ఆ నిర్ణయం ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను వెనక్కి తీసుకోలేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు వంద కోణాల్లో ఆలోచిస్తాను’ అంటుంది ఈప్సితా. ఉద్యోగంలోకి అప్పుడే వచ్చిన రోజుల్లో ఈప్సితాలాంటి కొత్త ఉద్యోగులకు సీనియర్ల నుంచి వినిపించిన మాట ‘ఇలా ఎవరైనా ఆలోచిస్తారా?’ అందరిలాగే ఈప్సితా ఆలోచించినట్లయితే ఆమెకు ఇంత పేరు వచ్చేది కాదేమో. ‘ఇలా కూడా చేయవచ్చు... అంటూ సంప్రదాయ విధానాలకు భిన్నంగా ఆలోచించేదాన్ని. ఇది సీనియర్లకు రుచించేది కాదు. అయితే నా ఆలోచనల్లో సత్తా ఉందని ఆ తరువాత నిరూపణ అయింది’ అంటుంది ఈప్సితా. వృత్తిరీత్యా ఈప్సితా దాస్గు΄్తా ఒక సమస్యకు పరిష్కారం వెదకగానే పని అక్కడితో ఆగి΄ోదు. ‘మేమున్నాం’ అంటూ కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి. గత సమస్యలతో వీటికి ΄ోలిక ఉండక΄ోవచ్చు. కొన్నిసార్లు పరిష్కారం దుర్భేద్యంగా అనిపించవచ్చు. ఇలాంటి సమయంలోనే వ్యూహకర్తలు చురుగ్గా ఆలోచించాలి. వ్యూహకర్తగా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన ఈప్సితా దాస్గుప్తాఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచింది. ‘మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు ఈప్సితా చెప్పే జవాబు... ‘వీరు వారు అని కాదు. నేను మాట్లాడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతుంటాను. సా«ధారణ ప్రజల నుంచి ఇన్వెస్టర్లు, లీడర్లు, ఆర్టిస్టుల వరకు నాకు ఎంతోమంది రోల్ మోడల్స్ కనిపిస్తారు’ -
ఏపీ మండలిలో ప్రభుత్వ విప్ ల నియామకం
-
ఎల్ఐసీ నూతన చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి
సాక్షి, ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం 2024 జూన్ వరకు మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఇప్పటివరకు ఆయన తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) సిద్ధార్థ మొహంతి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కి సీఎండీగా ఉన్నారు. అయితే 2021 ఫిబ్రవరిలో ఎల్ఐసీ ఎండీగా నియమితులయ్యారు. ఇక్కడ చేరడానికి ముందు, ఎల్ఐసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-లీగల్‌గా ఉన్నారు. 1985లో ఎల్ఐసీ డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన మొహంతి ఆ తరువాత ఉన్నత స్థాయికి ఎదిగారు. మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో, మార్కెటింగ్, హెచ్ఆర్, ఇన్వెస్ట్మెంట్స్, లీగల్ రంగాలలో మొహంతి తనదైన ముద్ర వేశారు. (ఇదీ చదవండి: Amazon layoffs: నంబర్ గేమ్ అంతే..రేపటితో తొమ్మిదేళ్లు..ఇంతలోనే!) మొహంతి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్. అలాగే న్యాయశాస్త్రంలో పట్టాతోపాటు, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి లైసెన్షియేట్ కూడా. మార్చి 11న కేంద్రం మొహంతిని మూడు నెలల పాటు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా నియమించింది. మినీ ఐపే ,బి సి పట్నాయక్ సహా ఎల్ఐసీ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన మొహంతీని చైర్మన్ పదవికి షార్ట్‌లిస్ట్ చేసింది. కంపెనీకి చెందిన నలుగురు మేనేజింగ్ డైరెక్టర్ల నుండి ఛైర్మన్‌ను ఎంపిక చేస్తారు.ఇందులో తుది నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది. సాధారణంగా ఎల్ఐసీలో ఒక చైర్పర్సన్ , నలుగురు ఎండీలు ముఖ్య నిర్వాహక సిబ్బందిగా ఉంటారు. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ ) -
11 మంది పార్టీ సీనియర్లకు సీఎం జగన్ కీలక బాధ్యతలు
-
ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. న్యాయమూర్తులుగా కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత నియామకాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. చదవండి: ఉగాది నాటికి కొత్త జిల్లాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. -
పలు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 5 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేశ్, తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరిశంకర్, ‘తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ నియమితులయ్యారు. కీలకంగా పనిచేసిన వాళ్లకు.. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఆకుల లలిత గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. తాజాగా నామినేటెడ్ పదవి లభించింది. బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా నామినేట్ అయిన గజ్జెల నగేశ్.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తండటాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌గా పనిచేస్తున్న పాటిమీది జగన్మోహన్రావు యువజన విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ యువజన విభా గం ఇన్చార్జిగా పనిచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జూలూరు గౌరి శంకర్ పాత్రికేయుడు. రచయితగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా చేసిన శంకర్‌కు ప్రస్తుతం నామినేటెడ్ పదవి లభించింది. విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో పనిచేసిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో 150కి పైగా కేసు లు ఎదుర్కొని 50 రోజులు జైలు జీవితం గడిపారు. కాగా యువ గాయకుడు సాయిచంద్‌ను రెండ్రోజుల క్రితం తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, విద్యార్థి నాయకులుగా ఉద్యమంలో పాల్గొన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
హెచ్ఎస్బీసీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీష్ కుమార్
ముంబై: భారత దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ది హంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్ఎస్బీసీ) తమ సంస్థకు స్వతంత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీష్ కుమార్‌ను నియమించింది. ఆయన గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చైర్మన్‌గా పనిచేశారు. కాగా, రజనీష్ 40 సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. ఆయన గతేడాది అక్టోబరులో రిటైర్ అయ్యారు. ఆయన గ్లోబల్ బిజినెస్, బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఎస్బీఐలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చారు. బ్యాంకింగ్‌ను డిజిటలైజేషన్లో వైపు తీసుకురావడంతో తీవ్రంగా కృషిచేశారు. ఎస్బీఐ నుంచి రిటైర్ అవ్వకముందు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కు చైర్మన్‌గా పనిచేశారు. అదేవిధంగా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ ఆసియా ప్రైవేటు లిమిటెడ్ సీనియర్ సలహదారుగా, సింగపూర్ లిమిటెడ్, ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్‌కు సలహదారుగా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఎస్బీసీతో పాటు లార్సెన్ అండ్ టూబ్రో ఇన్షోటెక్ లిమిటెడ్ స్వతంత్ర డైరెక్టర్, బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ, ఆసియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీనియర్ సలహదారుగా పని చేస్తున్నారు. సింగపూర్ లిమిటెడ్, ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ సలహాదారుగా కూడా సేవలందిస్తున్నారు. చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
ట్విటర్ గూటికి గూగుల్ మాజీ సీఎఫ్ఓ
సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్ చైర్మన్ గా గూగుల్ మాజీ సీఎఫ్ఓ పాట్రిక్ పిచెట్ నియమితులయ్యారు. ప్యాట్రిక్ పిచెట్ను బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు ట్విటర్ నిన్న ( జూన్ 2, మంగళవారం) ప్రకటించింది. ప్రస్తుత డైరెక్టర్ ఓమిడ్ కోర్డెస్టా స్థానంలో తాజా నియామకం జరిగినట్టు తెలిపింది. ఓమిడ్ స్వతంత్ర డైరెక్టరుగా కొనసాగుతారని ట్విటర్ వెల్లడించింది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సీని కొనసాగించడానికి అనుమతించే ఒప్పందంలో భాగంగానే ఈ నియామకమని భావిస్తున్నారు. ట్విటర్ అతిపెద్ద పెట్టుబడిదారు ఇలియట్ మేనేజ్మెంట్ సంస్థ డోర్సీని తొలగించేందుకు యత్నించిన మూడు నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఛైర్మన్‌గా, పిచెట్ సంస్థ నిర్వహణ స్థిరత్వానికి, ఆర్థిక సాధికారితపై దృష్టి కేంద్రీకరించనున్నారని అంచనా. మరోవైపు తన నియామకంపై స్పందించిన పిచెట్ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దే క్రమంలో తన నియామకమనీ, ట్విటర్ మంచి పాలన పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ వివాదంలో ట్విటర్ వైఖరిని పిచెట్ బహిరంగంగా సమర్థించారు. 2008-15 వరకు గూగుల్ సీఎఫ్ఓగా పనిచేసిన పిచెట్, కెనడియన్ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఇనోవియా క్యాపిటల్‌లో సాధారణ భాగస్వామిగా ఉన్నారు. 2015 వరకు ట్విటర్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న ఓమిడ్ కూడా గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ కావడం విశేషం. -
ఐడీబీఐ బ్యాంకు కొత్త బాస్ ఈయనే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా బి.శ్రీరామ్ ఎంపికయ్యారు. నేడు (శనివారం) బ్యాంకు సీఎండీ బాధ్యతలు స్వీకరించారని ఐడీబీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుత ఎండీ మహేష్ కుమార్ జైన్ ఆర్బీఐ (రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా) డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికైన నేపథ్యంలో, ఆయన స్థానంలో శ్రీరామ్‌ను ఎంపిక చేసింది. జూన్ 29 న శ్రీరామ్ వాలంటరీ రిటైర్మెంట్కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఎస్బీఐ ప్రకటించింది. 2014 జూలై నుంచి ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐలో ఎండీ (కార్పొరేట్ మరియు గ్లోబల్ బ్యాంకింగ్) గా శ్రీరామ్ పనిచేస్తున్నారు. మరోవైపు అప్పుల ఊబిలో చిక్కుకున్న ఐడీబీఐలో 51 శాతం వాటా కొనుగోలుకు ప్రభుత్వ రంగ బీమాసంస్థ ఎల్ఐసీ అన్నిమార్గాలను సుగమం చేసుకుంటోంది. ఈ డీల్‌కు తాజాగా భారతీయ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డిఎఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చతుర్వేది
-
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చతుర్వేది
సాక్షి,ముంబై: దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చంద్ర చతుర్వేదిని నియమిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేదిని పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు బోర్డు అంగీకరించిందని ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చతుర్వేది నియామకానికి వాటాదారులు సమ్మతిస్తే ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న ఎం.కే శర్మ పదవీకాలం రేపటితో (జూన్,30) ముగియనుంది. ఛైర్మన్‌గా శర్మను మరోసారి కొనసాగించాలని బోర్డు సభ్యులు భావించినప్పటికీ ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు ఈ నియమకాన్ని చేపట్టింది. తొలుత ఐసీఐసీఐ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఎండీ మాల్యా పేరు వినిపించినప్పటికీ చతుర్వేది నియామకానికి బోర్డు సమ్మతించింది.1977 బ్యాంచ్ ఐఏఎస్ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. -
ఆర్బీఐ తొలి సీఎఫ్ఓగా సుధా బాలకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నియామకాన్ని చేపట్టింది. తన మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) సుధ బాలకృష్ణన్‌ను నియమించింది. మే 15 న సెంట్రల్ బ్యాంకులో చేరగా, ఆమె పదవీ మూడు సంవత్సరాలు ఉండనుందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. కేంద్ర బ్యాంకులో అత్యంత కీలకమైన పదవికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) మాజీ అధికారి సుధా బాలకృష్ణన్ ఆర్బీఐ తొలి సీఎఫ్‌వోగా ఎంపిక కావడం విశేషం. అకౌంటింగ్ విధానాలు, నిబంధనలకు లోబడి కేంద్ర బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ఇన్ ఛార్జ్ గా సుధా బాలకృష్ణన్ వ్యవహరిస్తారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంటింగ్ విధానాన్ని రూపొందించడం, అంతర్గత ఖాతాలను నిర్వహించడం, ఆర్ధిక ఫలితాల గురించి నివేదించటం, వివిధ ఖాతాల ఖాతాల ద్వారా, బ్యాలెన్స్ షీట్ , లాభ, నష్టాల ఖాతాల పరిశీలన లాంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తారు. రాబడి వసూళ్లు లాంటి ప్రభుత్వ లావాదేవీలతోపాటు విదేశాలలోనూ అత్యున్నత బ్యాంకు పెట్టుబడులను కూడా పర్యవేక్షించే బాధ్యత కూడా నిర్వహించనున్నారు. కాగా 2016, సెప్టెంబరులో ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇది అతిపెద్ద సంస్థాగత మార్పుగా చెప్పవచ్చు. గతంలో ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పీవోవో) పదవిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు, కానీ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదని ఎకనామిక్స్ టైమ్స్ తన నివేదిక పేర్కొంది. మరోవైపు గత ఏడాది జులై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముద్రా పదవీవిరమణతో ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి డిప్యూటీ గవర్నర్ పదవికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
గూగుల్ సీఈవో మరో ఘనత
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(45) మరో ఘనతను సాధించారు. చెన్నైకు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు తన ఖాతాలో మరో విశిఫ్టతను చేర్చుకున్నారు. గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న సుందర్ పిచాయ్ తాజాగా గూగుల్ పేరెంటల్ కంపెనీ, గ్లోబల్ టెక్ దిగ్గజం అల్పాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎంపికయ్యారు. యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్పాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగస్వామ్యాలు, అద్భుతమైన నూతన ఆవిష్కరణలతో బలమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నారని ఆల్ఫాబెట్ ఒక ప్రకటనలో తెలిపింది. 26 బిలియన్ డాలర్ల అమ్మకాలపై 3.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయం సాధించినట్టు తెలిపింది. అలాగే యూరోపియన్ యూనియన్ విధించిన యాంటీ ట్రస్ట్ ఫైన్ (2.7 బిలియన్ డాలర్లు)లేకపోతే రికార్డ్ స్థాయి భారీ లాభాలను సాధించేవారమని పేర్కొంది. ఆల్ఫాబెట్ ఇంక్. సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయంలో 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గూగుల్ ప్రకటన ఆదాయం 18.4 శాతం పెరిగి 22.67 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంస్థ డిజిటల్ యాడ్ రెవెన్యూ 73.75 బిలియన్ డాలర్లుగా నమోదుకానుందని అంచనా. ఫేస్బుక్ 36.29 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని పరిశోధనా సంస్థ ఇమార్కెటర్ తెలిపింది. మొత్తం మార్కెట్లో ఇరు కంపెనీలు 49 శాతం వాటా ఉంటుందని తెలిపింది. కాగా సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు -
ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సుందరం
బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన బోర్డులోకి మరో ఎగ్జిక్యూటివ్‌ను తీసుకుంది. డి. సుందరంను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించింది. జూలై 14నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఇన్ఫీ ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ నామినేషన్ అండ్ రెమినరేషన్ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నియమకాన్ని చేపట్టింది. ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ రంగంలో విస్తృతమైన అనుభవం ఉన్న సుందరాన్ని తమ బోర్డులోకకి తీసుకోవడం సంతోషంగా ఉందని ఇన్ఫోసిస్ బోర్డ్ ఛైర్మన్ శేష శాయి తెలిపారు. 1975 లో యునిలివర్ గ్రూప్‌లో చేరిన సుందరం వివిధ నాయకత్వ స్థానాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు. 34 సం.రాల కెరీర్లో హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ ఐటి డైరెక్టర్ వైస్ చైర్మన్ పదవులను ఆయన చేపట్టారు. కాగా ప్రస్తుతం సుందరం టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. -
ఇన్ఫోసిస్‌లో కీలకమార్పులు
బెంగళూరు: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్ శుక్రవారం కీలక నియామకాలను చేపట్టింది. మరో ఐటీ దిగ్గజం విప్రో మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రప్రీత్ సావ్నీని జనరల్ కౌన్సిల్ కు ఎంపిక చేసింది. ఈ నియామకం జూలై 3, 2017 నుండి అమల్లోకి వస్తుందనీ ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రీటైల్ గ్లోబల్ హెడ్‌కు పదవికి రాజీనామా చేసిన సందీప్‌డాడ్లాని స్థానాన్ని కూడా భర్తీ చేసింది. ఈ నియామకాలపై ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా మాట్లాడుతూ, 24 ఏళ్లలో కరీర్లో ఇంద్ర ప్రీత్‌కు విభిన్నమైన ప్రపంచ అనుభవం ఉందని, తన నైపుణ్యం ఇన్ఫోసిస్ ప్రారంభించిన "ట్రాన్స్ఫర్మేషన్ జర్నీకి" బాగా ఉపయోగపడనుందని చెప్పారు. అలాగే గత మూడు సంవత్సరాలుగా వాస్వానీ , బాంగాతో తాను కలిసి పనిచేశాననీ, వారిపై తమకు అపారమైన విశ్వాసముందన్నారు. ఖాతాదారుల డిజిటల్ ఆకాంక్షలను సాధించడంలో వీరిరువురికి గొప్ప సామర్థ్యం ఉందన్నారు. విప్రోకు ముందు ఇంద్ర ప్రీత్ సిలికాన్ వ్యాలీలో మిడ్-సైజ్డ్ న్యాయ సంస్థకు మేనేజింగ్ భాగస్వామిగాను, ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీలో అంతర్గత సలహాదారుగా పనిచేశారు. యాక్టింగ్ జనరల్ కౌన్సిల్‌గా ఉన్న గోపీ కృష్ణన్ రాధాక్రిష్ణన్ రాజీనామా చేయడంతో ఈ స్నాన్ని ఈమె భర్తి చేయనున్నారు. మరోవైపు రాజీనామా చేసిన మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సందీప్‌డాడ్లాని బాధ్యతలను రెండుగా విభజించారు. సీపీజీ, అండ్ లాజిస్టిక్ , రీటైల్ గ్లోబల్‌హెడ్‌గా కర్మేష్ వాస్వాని, మానుఫాక్చరింగ్ హెడ్ గా నితీష్బంగ వ్యవహరించనున్నారు. ఈ నియామాకలు జూలై15 నుంచి అమలు కానున్నాయి. దాదాపు దశాబ్దకాలంపాటు వాస్వానీ, బాంగా వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. -
కౌన్సెలింగ్ ప్రశాంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రధానోపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులు(ఎంఈఓలు)గా నియమించేందుకు ఆదివారం కడప నగరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జోన్ పరిధిలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి సీనియార్టీ ఆధారంగా అర్హులైన వారిని ఎంఈఓలుగా నియమించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఈ కౌన్సెలింగ్ జరిగింది. జిల్లా విద్యాశాఖ తరఫున సూపరింటెండెంట్ సురేష్, పార్థసారథి, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 63 మండలలకు గాను 11 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. తక్కిన 52 మండలాలకు ఇన్నిరోజులూ ఇన్‌చార్జ్‌లుగా హెచ్ఎంలు ఉన్నారు. వీరిలో 27 మందికి తిరిగి అవకాశం రాగా.. తక్కిన 25 మంది పాఠశాలలకు పరిమితం అయ్యారు. ఇదిలాఉండగా జోన్ పరిధిలో అనంతపురం జిల్లాలోనే ఎక్కువ పోటీ నెలకొంది. -
ఎయిర్ టెల్ కొత్త నియామకం
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కొత్త నియామకాన్ని చేపట్టింది. రిటైల్ విభాగం సీఈవోగా వాణి వెంకటేష్ ను నియమించినట్టు మంగళవారం ప్రకటించింది. తొమ్మిది సంవత్సరాల ఉద్యోగ నిర్వహణ తర్వాత ఇటీవల రాజీనామా చేసిన రోహిత్ మల్హోత్రా స్థానంలో ఈ కొత్త నియామకాన్ని చేపట్టినట్టు తెలిపింది. రీటైల్ టచ్ పాయింట్లలో వినియోగదారులకు వరల్డ్ క్లాస్ కస్టమర్ ఎక్సీరియన్స్, నిరంతర సేవల్ని అందించడంలో ఆమె బాధ్యత కలిగి ఉంటారని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో వివరించింది. ఆమెను తమ బోర్డులోకి తీసుకోవడం సంతోషంగా ఉదని ఎయిర్ టెల్ ఎండీ, సీఈవో (భారతదేశం మరియు దక్షిణ ఆసియా) గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. అలాగే కంపెనీకి అందించిన విలువైన సేవలకుగాను రోహిత్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగాఇండియన్ ఇన్సిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన వాణి వెంకటేష్ హిందుస్తాన్ యూనీలీవర్ ఫినాన్స్ డివిజన్ లో కరీర్ మొదలు పెట్టారు. 19 సం రాల పరిశ్రమ అనుభవం ఉన్న ఆమె మెక్ కిన్సీ అబాట్ హెల్త్ కేర్ ఇండియా లాంటి కంపెనీలకు కూడా పనిచేశారు. -
‘హంస’ గౌరవ సలహాదారునిగా అనిల్
అనంతపురం మెడికల్ : ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంస) రాష్ట్ర గౌరవ సలహాదారునిగా మన జిల్లాకు చెందిన ఎయిడ్స్ అండ్ లెప్రసీ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ అనిల్‌కుమార్ నియమితులయ్యారు. విజయవాడలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నూతన అధ్యక్షుడు యోగీశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆరవపాల్ అధ్యక్షతన నిర్వహించారు. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరవగా అనిల్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎంపికపై ‘హంస’ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. -
ఆర్టీఓగా శ్రీధర్ నియామకం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం డివిజన్ రోడ్డు రవాణా అధికారి(ఆర్టీఓ)గా శ్రీధర్ నియమితులైనట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పరిపాలన అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై అనంతపురం ఆర్టీఓగా వస్తున్నారు. రెండు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న ప్రతాప్ రిటైర్డ్ అయ్యారు. -
ఐటీసీ సీవోవో గా సంజీవ్ పూరి
ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సంజీవ్పూరిని నియమించింది. 1986లో పూరి ఐటీసీలో చేరిన పూరి ప్యాకేజింగ్, అండ్ ప్రింటింగ్ బిజినెస్ లో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవ్ పరి పూర్తి కాలపు డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమిస్తూ బోర్డ్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీఎస్ఈ కి సంస్థ నివేదించింది. జులై 22న నిర్వహించిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈయన నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది . ఈ మేరకు సమాచారాన్ని సంస్థ బీఎస్ఈకు తెలియజేసింది. 53 సంవత్సరాల పూరికి ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి అనుభవం ఉంది. ఐటీసీ సంస్థలో ఆయన చాలా వేగంగా ఎదిగారు. మరోవైపు ఇటీవల ప్రకటించిన ఫలితాలో ఐటీసీ మెరుగైన ఫలితాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
హిజ్బుల్ ముజాహిదీన్ కు కొత్త కమాండర్
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ జమ్ము కశ్మీర్ కమాండర్ గా మహ్మద్ ఘజ్వానీ అలియాస్ సబ్జార్ అహ్మద్ భట్ ను నియమిస్తున్నట్టు ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు హిజ్బుల్ ఛీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. దక్షిణ కశ్మీర్ లోని రత్ సునాకు చెందిన ఘజ్వానీ బుర్మాన్ వనీ కి అత్యంత సన్నిహితుడు. కాగా ఘజ్వానీ నియామకాన్ని భద్రతా దళాలు దృవీకరించాల్సి ఉంది. శుక్రవారం భద్రతా దళాల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ 22 ఏళ్ల బుర్మాన్ వనీ హతమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆరాష్ట్రంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మృతుల సంఖ్య 25 కు చేరింది.