అనంతపురం మెడికల్ : ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంస) రాష్ట్ర గౌరవ సలహాదారునిగా మన జిల్లాకు చెందిన ఎయిడ్స్ అండ్ లెప్రసీ అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిల్‌కుమార్ నియమితులయ్యారు. విజయవాడలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నూతన అధ్యక్షుడు యోగీశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆరవపాల్ అధ్యక్షతన నిర్వహించారు.
13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరవగా అనిల్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎంపికపై ‘హంస’ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
‘హంస’ గౌరవ సలహాదారునిగా అనిల్
Published Sun, Oct 16 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
Advertisement
Advertisement