ముంబై: భారత దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ది హంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్ఎస్‌బీసీ) తమ సంస్థకు స్వతంత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీష్ కుమార్‌ను నియమించింది. ఆయన గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చైర్మన్‌గా పనిచేశారు. కాగా, రజనీష్ 40 సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. ఆయన గతేడాది అక్టోబరులో రిటైర్ అయ్యారు.
ఆయన గ్లోబల్ బిజినెస్, బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఎస్‌బీఐలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చారు. బ్యాంకింగ్‌ను డిజిటలైజేషన్‌లో వైపు తీసుకురావడంతో తీవ్రంగా కృషిచేశారు. ఎస్‌బీఐ నుంచి రిటైర్ అవ్వకముందు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కు చైర్మన్‌గా పనిచేశారు. అదేవిధంగా, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు.
బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ ఆసియా ప్రైవేటు లిమిటెడ్ సీనియర్ సలహదారుగా, సింగపూర్ లిమిటెడ్, ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్‌కు సలహదారుగా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎస్‌బీసీతో పాటు లార్సెన్ అండ్ టూబ్రో ఇన్షోటెక్ లిమిటెడ్ స్వతంత్ర డైరెక్టర్, బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ, ఆసియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీనియర్ సలహదారుగా పని చేస్తున్నారు. సింగపూర్ లిమిటెడ్, ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ సలహాదారుగా కూడా సేవలందిస్తున్నారు.
చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
Comments
Please login to add a commentAdd a comment