ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించగలదని రియల్ ఎస్టేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జేఎల్ఎల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2023లో సిటీ రెసిడెన్షియల్ విక్రయాల విలువ రూ. 1 లక్ష కోట్లను అధిగమించింది. 2024లో ఇది రూ.1.35 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉందని చెబుతోంది.
ముంబైలో రియర్ ఎస్టేట్ రంగం గణనీయంగా ముందుకు దూసుకెళుతోంది. దీనికి కారణం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL), నవీ ముంబై సబర్బన్ రైల్, మెట్రో లైన్ల కనెక్టివిటీ పెరగటం అని తెలుస్తోంది. 2030 నాటికి మల్టీమోడల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో కొనసాగుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు కొత్త రెసిడెన్షియల్ హబ్‌లను ప్రోత్సహిస్తాయని జేఎల్ఎల్ నివేదికలో వెల్లడించింది.
2024 మొదటి అర్ధభాగంలో ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. ఈ అమ్మకాలు 2023లో నమోదైన మొత్తం సేల్స్ కంటే కూడా 57 శాతం ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే 2030 నాటికి తప్పకుండా 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించగలదని స్పష్టంగా అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment