దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తోంది. గత మూడేళ్లలో అయోధ్యలో భూముల ధరలు 15 రెట్లు పెరిగాయని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' అన్నారు.
ఒక ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభినందన్ లోధా మాట్లాడుతూ.. 2021లో అయోధ్యలో భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. అప్పట్లో ఒక ఎకరా భూమి ధర రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలు మధ్య ఉండేది. కానీ ప్రాంతాన్ని బట్టి నేడు అయోధ్యలో ఎకరం భూమి ధర రూ. 5 కోట్లు వరకు ఉందని ఆయన అన్నారు.
2021లో కొనుగోలు చేసిన భూమిని మేము ఈ ఏడాది విక్రయించడం ప్రారంభించాము. 7 నెలల్లో 1400 ప్లాట్లను విక్రయించాము. మేము ఈ సంవత్సరం చివరగా అమ్మిన భూమి చదరపు గజం విలువ రూ. 15,000. మా సంస్థ మొత్తం 1400 రైతుల దగ్గర నుంచి ఇప్పటికే 51 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని అభినందన్ లోధా పేర్కొన్నాడు.
పవిత్ర నగరమైన అయోధ్యలో భూముల విక్రయం మాత్రమే కాకుండా.. 6,000 చెట్లను నాటడం, 30కి పైగా స్థానిక జాతులను సంరక్షించడం, 1000 చెట్లను పెంచడం వంటివి కూడా చేసినట్లు లోధా చెప్పారు.
ఇదీ చదవండి: 38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?
ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అయోధ్యలో 15000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు. అయోధ్య ఇప్పుడు మతపరమైన నగరంగా మారిన తరువాత.. వారణాసి, బృందావన్‌లలో ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు లోధా ప్రకటించారు. ముంబైకి సమీపంలోని అమృత్‌సర్, బృందావన్, వారణాసి, సిమ్లా, నాగ్‌పూర్, ఖోపోలీలో 352 ఎకరాలు భూసేకరణను ఇటీవలే ముగించినట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment