JLL Report
-
2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!.. జేఎల్ఎల్ రిపోర్ట్
ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించగలదని రియల్ ఎస్టేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జేఎల్ఎల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2023లో సిటీ రెసిడెన్షియల్ విక్రయాల విలువ రూ. 1 లక్ష కోట్లను అధిగమించింది. 2024లో ఇది రూ.1.35 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉందని చెబుతోంది.ముంబైలో రియర్ ఎస్టేట్ రంగం గణనీయంగా ముందుకు దూసుకెళుతోంది. దీనికి కారణం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL), నవీ ముంబై సబర్బన్ రైల్, మెట్రో లైన్ల కనెక్టివిటీ పెరగటం అని తెలుస్తోంది. 2030 నాటికి మల్టీమోడల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో కొనసాగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు కొత్త రెసిడెన్షియల్ హబ్‌లను ప్రోత్సహిస్తాయని జేఎల్ఎల్ నివేదికలో వెల్లడించింది.2024 మొదటి అర్ధభాగంలో ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. ఈ అమ్మకాలు 2023లో నమోదైన మొత్తం సేల్స్ కంటే కూడా 57 శాతం ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే 2030 నాటికి తప్పకుండా 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించగలదని స్పష్టంగా అర్థమవుతోంది. -
ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం
ముంబై: ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ రంగంలోని కంపెనీలకు (హోటళ్లు) ఒక్కో గది వారీ ఆదాయం 4.8 శాతం మేర అధికంగా సమకూరింది. రోజువారీ సగటు రూమ్ ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు ‘జేఎల్ఎల్ హోటల్ మూమెంటమ్ ఇండియా (2024 క్యూ2)’ నివేదిక వెల్లడించింది. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు, జూన్ క్వార్టర్లో ఆక్యుపెన్సీ (గదుల భర్తీ రేటు) స్వల్పంగా తగ్గినట్టు తెలిపింది. కార్పొరేట్ ప్రయాణాలు తగ్గడాన్ని కారణంగా పేర్కొంది. హోటళ్ల రోజువారీ సగటు రేటు (ఏడీఆర్) గోవాలో స్వల్పంగా క్షీణించగా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లలో ఏడీఆర్‌లో చెప్పుకోతగ్గ వృద్ధి కనిపించినట్టు, ముఖ్యంగా హైదరాబాద్ ఈ విషయంలో ముందున్నట్టు జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ హైదరాబాద్ ఆతిథ్య పరిశ్రమలో గదుల సగటు ఆదాయం మిగిలిన నగరాలతో పోలి్చతే మెరుగ్గా నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో 11.9 శాతం మేర ఆదాయం పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 11.8 శాతం, బెంగళూరులో 10.4 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆక్యుపెన్సీ (గదుల భర్తీ) రేటు స్థిరంగా ఉంది. రోజువారీ సగటు ధరల పెరుగుదలే రూమ్ వారీ సగటు ఆదాయంలో వృద్ధికి తోడ్పడింది. ఇక కార్పొరేట్ ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడం, ఇతర కార్పొరేట్, సామాజిక సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలతో రానున్న త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్)నూ ఆతిథ్య పరిశ్రమలో మెరుగైన డిమాండ్ ఉండొచ్చని జేఎల్ఎల్ అంచనా వేసింది. -
ఏడు పట్టణాల్లో 1.61 లక్షల ఫ్లాట్స్ విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 1,61,604 ఫ్లాట్స్ అమ్ముడుపోయినట్టు జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. ఏడేళ్ల కాలంలో వార్షిక విక్రయాల రేటును ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే అధిగమించినట్టు తెలిపింది. హైదరాబాద్, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై పట్టణాల గణాంకాలు జేఎల్ఎల్ తాజా నివేదికలో ఉన్నాయి. ఇందులో కేవలం ఫ్లాట్స్ విక్రయాలనే పొందుపరిచింది. 2014లో 1,65,791, 2015లో 1,57,794, 2016లో 1,46,852, 2017లో 95,774, 2018లో 1,36,082, 2019లో 1,43,302 యూనిట్లు చొప్పున ఫ్లాట్స్ విక్రయమయ్యాయి. 2020లో కరోనా కారణంగా విక్రయాలు 74,211 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది 1,28,064 ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి. ఈ విధంగా చూసుకుంటే 2015 తర్వాత ఈ ఏడాది తొమ్మిది నెలల్లో ఎక్కువ ఫ్లాట్స్ అమ్మడైనట్టు తెలుస్తోంది. 2 లక్షలు దాటొచ్చు.. త్రైమాసికం వారీ విక్రయాలు 2021 క్యూ3 నుంచి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఇవి మరింత పెరిగాయి. ప్రతి త్రైమాసికంలోనూ 50,000 కంటే ఎక్కువ ఫ్లాట్స్ అమ్ముడయ్యాయి. ఇక పండుగుల సీజన్ కావడంతో ప్రస్తుత త్రైమాసికంలోనూ విక్రయాలు బలంగా నమోదు కావచ్చు. దీంతో వార్షిక అమ్మకాలు 2 లక్షల యూనిట్లను దాటిపోవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు బలపడడంతో వినియోగదారుల్లో విశ్వాసం మెరుగుపడింది. ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్లు చేపట్టిన ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉంది’’అని జేఎల్ఎల్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. -
ఆఫీస్ స్పేస్.. పక్కాప్లాన్
ఆఫీస్ స్పేస్‌ను క్రియేట్ చేయడంలో తెలంగాణ సర్కారు వ్యూహాత్మంగా వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి వంద మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కలిగిన నగరంగా నిలుస్తుందంటూ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం బలంగా పాతుకుపోవడంతో ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ విషయంలో గణనీయమైన వృద్ధిని హైదరాబాద్ కనబరుస్తోంది. ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ విషయంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీల తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతా, చెన్నై, పూనే వంటి నగరాలను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రేడ్ ఏ రకం ఆఫీస్ స్పేస్ 90 మిలియిన్ల చదరపు అడుగులుగా ఉంది. అయితే ఇందులో 96 శాతం ఆఫీస్ స్పేస్ గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటి వంటి నగరంలోని పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. గ్రేడ్ ఏ రకం ఆఫీస్ స్పేస్ అంతా ఒకే దిక్కున ఉండడటంతో అక్కడ ఆఫీస్ స్పేస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు భవిష్యత్తులో పశ్చిమ ప్రాంతాన్ని ట్రాఫిక్ చిక్కులు తదితర సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. దీంతో ఆఫీస్ స్పేస్‌ను వికేంద్రీకరించే విషయంగా తెలంగాణ ప్రభుత్వం గ్రోత్ ఇన్ డిస్పెర్షన్ (గ్రిడ్) పాలసీని అందుబాటులోకి తెచ్చింది. గ్రిడ్ పాలసీలో భాగంగా హైదరాబాద్ నగరంలో తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్‌లను అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్మాణ సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే నగరంలోని తూర్పు ప్రాంతమైన ఉప్పల్‌లో జెన్పాక్ట్, ఎన్ఎస్ఎల్, రాంకీ ఎస్టేట్స్ ఉన్నాయి. కాగా రాబోయే ఐదేళ్లలో ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా మూడు మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌ను వృద్ధి చేస్తామని ప్రకటించాయి. ఇక కొంపల్లి, మేడ్చల్ ఏరియాలో ఇటీవల కొత్త ఐటీ టవర్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. గ్రేడ్ వన్ ఆఫీస్ స్పేస్ విస్తరణకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే 2016 నుంచి 2021 వరకు హైదరాబాద్ నగరం 81 శాతం వృద్ధితో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇక రాబోయే ఐదేళ్లలోనూ ఇదే జోరు కొనసాగుంది. అయితే కొత్తగా వచ్చే 35 నుంచి 40 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ పశ్చిమను మినహాయించి నగరం నలుమూలలా రానున్నట్టు జేఎల్ఎల్ పేర్కొంది. గ్రిడ్ పాలసీ వల్ల ఇది సాధ్యమవుతోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు నలువైపులా సమాన స్థాయిలో అభివృద్ధి, మౌలిక వసతులు నెలకొనే అవకాశం ఉందని జేఎల్ఎల్ అభిప్రాయపడింది. చదవండి: కో–వర్కింగ్ స్పేస్.. అందరి నోటా ఇదే మాటా.. ప్రత్యేకతలు ఇవే -
ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..!
సాక్షి, హైదరాబాద్: కొత్త గృహాల ప్రారంభంలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. 2021 నాల్గో త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్)లో లాంచింగ్స్ లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని జేఎల్ఎల్ రెసిడెన్షియల్ మార్కెట్ రిపోర్ట్ వెల్లడించింది. అంతకుక్రితం త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో లాంచింగ్స్‌లో 26.1 శాతం వృద్ధి నమోదు కాగా.. పుణేలో 17.6 శాతం, బెంగళూరులో 16.4 శాతం, ముంబైలో 16.1% పెరుగుదల కనిపించిందని వివరించింది. నగరంలో గృహాల అమ్మకాలు కరోనా ముందస్తు స్థాయికి చేరుకున్నాయి. 2019లో 15,805 ఇళ్లు విక్రయం కాగా 2020లో 9,926, 2021లో 15,787 యూనిట్లు అమ్ముడుపోయాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ పెరగడం, రియల్టీ మార్కెట్ సెం టిమెంట్ బలపడటం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడు తుండటంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారం భం వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలోని ఏడు ప్రధా న నగరాలలో 2021 నాల్గో త్రైమాసికంలో 45,383 అపార్ట్మెంట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ3తో పో లిస్తే ఇది 38% ఎక్కువ. ఇందులో 19 % యూనిట్లు పుణేలో ప్రారంభం కాగా.. బెంగళూరు, హైదరాబాద్ ఒక్కోటి 17% వాటాను కలిగి ఉన్నాయి. -
రియల్టీలో హైదరాబాద్ దూకుడు
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్టీలో హైదరాబాద్ దూసుకుపోతుంది. జెఎల్ఎల్ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో గతేడాది కొత్త వెంచర్లు ప్రారంభించే విషయంలో భాగ్యనగరం దూకుడు కనబరిచింది. ఇండియాలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనే నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా జేఎల్ఎల్ ఈ నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో విల్లాలను మినహాయించారు. 2021లో న్యూ ప్రాజెక్ట్స్ లాంచింగ్‌కి సంబంధించి 26.1 శాతం వృద్ధితో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత పూనే 17.6 శాతం, బెంగళూరు 16.4 శాతం ముంబై 16.1 శాతం వృద్ధిని కనబరిచాయి. 2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు క్వార్టర్ 4ని పరిగణలోకి తీసుకుంటే ఏడు మెట్రోల్లో 45,383 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో 19 శాతం వాటాతో పూనే ప్రథమ స్థానంలో నిలిచింది. కాగా బెంగళూరు, హైదరాబాద్‌లు 17 శాతం వాటాని కలిగి ఉన్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 1.28 లక్షల కొత్త ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో 15,787 ఇళ్లు అమ్ముడయ్యాయి. కరోనా రాక ముందు అంటే 2019లో హైదరాబాద్‌లో 15,804 ఇళ్లు సేల్ అయ్యాయి. ఇళ్ల అమ్మకాల పరంగా కోవిడ్ పూర్వ స్థితికి హైదరాబాద్ చేరుకుంది. చదవండి: Realty: బ్రోకరేజీకే వేల కోట్ల రూపాయలు సమర్పయామి! -
ఈ విషయంలో మన హైదరాబాద్ తర్వాతే బెంగళూరు, ముంబై, చెన్నైలు!
Hyderabad: రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి దేశంలోని ఏ ప్రధాన నగరాల్లోనూ రానన్ని పెట్టుబడులు గతేడాది భాగ్యనగరానికి వచ్చాయి. 2021లో దేశీయ రియల్టీ రంగంలో 4.3 బిలియన్ డాలర్ల (రూ.32 వేల కోట్లు) సంస్థాగత పెట్టుబడులు రాగా.. హైదరాబాద్‌లో 687 మిలియన్ డాలర్లు (రూ.5,120 కోట్లు) వచ్చాయని జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. 2020లో నగర రియల్టీలోకి 100 మిలియన్ డాలర్లు (రూ.750 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. గతేడాది దేశీయ ఇన్స్టిట్యూçషన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో నగరం వాటా 16 శాతంగా ఉంది. ఆ తర్వాత ముంబైలో 683 మిలియన్ డాలర్లు, బెంగళూరులో 379 మిలియన్ డాలర్లు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 548 మిలియన్ డాలర్లు, చెన్నైలో 150 మిలియన్ డాలర్లు, కోల్‌కతాలో 105 మిలియన్ డాలర్లు, పుణేలో 77 మిలియన్ డాలర్ల ఇన్స్టిట్యూçషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. -
'అలా చేస్తే తక్కువ కాలంలోనే భూముల ధరలకు రెక్కలు'
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, రిటైల్ ఔట్లెట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు, వేర్‌హౌస్‌లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్హెచ్ఏఐ ప్రాపర్టీ ల కోసం జేఎల్‌ఎల్‌ను అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఎన్హెచ్ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్ మానిటైజేషన్ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్ఎల్ పని. 3 వేల హెక్టార్ల అభివృద్ధి.. జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్‌లు, వేసైడ్ అమెనిటీస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్ హైవే/ఎక్స్‌ప్రెస్‌లను నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లకి‡్ష్యంచింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 15–30 శాతం ఆదాయం.. ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్ఎల్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ అంచనా వేశారు. క్లియర్ ల్యాండ్ టైటిల్, ఉచిత ఎన్కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్ సైట్‌తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్మెంట్తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు. చదవండి: హైదరాబాద్‌పై దేశీ రియల్టర్ల ఫోకస్.. కారణాలు ఇవే -
Hotel Occupancy: హైదరాబాద్ తర్వాతే ముంబై, బెంగళూరు నగరాలు
Hotel Occupancy: కోవిడ్ సంక్షోభం తర్వాత హైదరాబాద్ నగరం వేగంగా కోలుకుంటోంది. ఇప్పటికే ఆఫీస్ స్పేస్, రియల్టీ రంగాల్లో కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటుండగా తాజాగా ఆతిధ్య రంగానికి సంబంధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. నంబర్ వన్ హైదరాబాద్ ఆతిధ్య రంగానికి సంబంధించి మూడో త్రైమాసికం (జులై, ఆగస్ట్, సెప్టెంబర్)లో యావరేజ్ అక్యుపెన్షీ రేషియో (ఏఓఆర్) విషయంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని జేఎల్ఎల్ రీసెర్చ్ తెలిపింది. దేశంలో ఉన్న ఆరు ప్రధాన నగరాల నుంచి డేటాను సేకరించి ఆ సంస్థ విశ్లేషించింది. హోటళ్లలో ఆక్యుపెన్షి లెవల్ రిజిస్ట్రరింగ్ విభాగంలో హైదరాబాద్ నగరం 33.60 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత గోవా (29.8 శాతం), ముంబై (29.4 శాతం), బెంగళూరు (26.8శాతం), ఢిల్లీ (25.5 శాతం), చెన్నై (24.1 శాతం) వృద్ధిని నమోదు చేశాయి. రెవెన్యూలో గోవా హస్పిటాలిటీ సెక్టార్‌కి సంబంధించి గతేడాదితో పోల్చితే రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్ విభాగంలో మూడో త్రైమానికంలో మరోసారి గోవా ప్రథమ స్థానంలో నిలిచింది. రెవెన్యూ గ్రోత్ విషయంలో గోవాలో 389 శాతం వృద్ధి ఉండగా బెంగళూరు 213 శాతం హైదరాబాద్ 173 శాతం వృద్ధిని కనబరిచాయి. కోలుకుంటోంది కరోనా సంక్షోభం తీవ్రంగా నెలకొన్న 2020తో పోల్చితే 2021లో ఆతిధ్య రంగం పుంజుకుంటోందని జేఎల్ఎల్ తెలిపింది. దేశవ్యాప్తంగా మూడో త్రైమాసికంలో ఆతిధ్య రంగంలో 169 శాతం వృద్ధి నమోదైందన్నారు. రెండో త్రైమాసికంలో ఈ వృద్ధి 123 శాతంగా ఉంది. క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పడానికి ఈ గణాంకాలు ఉదహరణలుగా నిలుస్తున్నాయి. చదవండి:గార్డెన్ సిటీ కిందికి నిజాం నగరం పైకి -
'అద్దె ఇంట్లో ఉండలేం.. 3 నెలల్లో సొంతిల్లే కొనుక్కుంటాం'
న్యూఢిల్లీ: అపార్ట్మెంట్ విస్తీర్ణం, నిర్మాణదారుల గత చరిత్ర (ట్రాక్ రికార్డ్), ఆరోగ్య వసతులు,పచ్చదనానికి తగినంత ఆవరణ, తక్కువ జనసాంద్రత, ప్రజా రవాణా వసతులు, స్కూళ్లు, కార్యాలయాలకు అనుసంధానత.. ఇళ్ల కొనుగోలుకు వినియోగదారులు వరుస క్రమంలో చూసే అంశాలు ఇవే. కరోనా మమహ్మారి తర్వాత కొనుగోలుదారులకు ఇవి ప్రాధాన్య అంశాలుగా మారిపోయినట్టు జేఎల్ఎల్ ఇండియా, రూఫాండ్‌ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘ఇళ్ల కొనుగోలుదారుల ప్రాధాన్యత సర్వే 2021: కరోనా ప్రభావం’ పేరుతో ఈ సంస్థలు సర్వే నిర్వహించాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆరు మెట్రో నగరాల పరిధిలోని 2,500 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నాయి. అన్నింటికంటే ముందు ఫ్లాట్ విస్తీర్ణణమే తమకు ముఖ్యమని వీరు చెప్పారు. ఆ తర్వాత డెవలపర్ల చరిత్రను చూస్తామని తెలిపారు. చదవండి: వేలంవెర్రి, చార్మినార్ ఏం ఖర్మ తాజ్‌మహల్, చైనా వాల్ కూడా మావే! ప్రాధాన్యతల్లో మార్పులు.: ఇళ్ల కొనుగోలుకు సంబంధించి చూసే అంశాల్లో పెద్దగా మార్పుల్లేవని.. వాటి ప్రాధాన్యతల్లోనే మార్పులు వచ్చినట్టు జేఎల్ఎల్ తన సర్వే నివేదికలో తెలిపింది. కరోనాకు ముందు 2020 మొదటి మూడు నెలల్లో నిర్వహించిన సర్వేలో.. కార్యాలయం, స్కూళ్లకు అనుసంధానం వినియోగదారుల మొదటి ప్రాధాన్యత అంశంగా ఉంది. ఆ తర్వాత ప్రజా రవాణా వసతులు, డెవలపర్ల చరిత్ర, అపార్ట్మెంట్ సైజ్, హెల్త్‌కేర్ వసతులు, వినోద కేంద్రాలు, పచ్చదనం, తక్కువ జనసాంద్రత అంశాలకు వరుస క్రమంలో గతంలో ప్రాముఖ్యమిచ్చారు. కొనుగోలుదారుల అవసరాలు, ప్రాధాన్యతలకు తగినట్టు డెవలపర్లు డిజైన్లలో మార్పులను అమలు చేస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. డెవలపర్‌కు మంచి చరిత్ర ఉంటే కాస్త ఎక్కువ వ్యయం చేసేందుకు వినియోగదారులు వెనుకాడడం లేదని పేర్కొంది. ఇళ్ల కొనుగోలుకు సుముఖంగా ఉన్న వారిలో 80 శాతం మంది వచ్చే మూడు నెలల్లోనే ఆ పనిచేస్తామని చెప్పగా.. 80 % మంది రూ.75 లక్షల్లోపు ఇల్లును ఎంచుకుంటామని తెలిపారు. 89% మంది అద్దెకు ఉండడానికంటే సొంత ఇంటికే వోటు వేయడం గమనార్హం. రియల్ ఎస్టేట్‌లోకి మహిళా నిపుణులు రావాలి కేంద్ర పట్టణ వ్యవహారాల కార్యదర్శి మిశ్రా దేశంలో పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. రియల్ ఎస్టేట్ రంగానికి అపార అవకాశాలున్నాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అన్నారు. కనుక ఈ రంగంలో పనిచేసేం దుకు మహిళా నిపుణులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం ‘నరెడ్కో’ మహిళా విభాగం ‘నరెడ్కోమహి’ విభాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మిశ్రా మాట్లాడారు. ‘‘రియల్ఎస్టేట్ రంగంలో రెరా చట్టం విశ్వాసాన్ని తీసుకొచ్చింది. కనుక మహిళా నిపుణులు ఈ రంగంతో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలి. మహిళలకు అన్ని రకాల సామర్థ్యాలున్నాయి. క్లిష్టమైన, సున్నితమైన నైపుణ్యాలు వారిలో ఉన్నాయి. ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్‌లోనూ వారు తమ సామర్థ్యాన్ని ఎందుకు ప్రదర్శించకూడదు’’ అని మిశ్రా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి ఈ రంగం కీలకమైనదిగా అభి వర్ణించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మం దికి ఉపాధి కల్పిస్తున్న రంగంగా పేర్కొన్నారు. చదవండి: హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు -
రియల్టీలో పెట్టుబడుల జోరు
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ2)లో 9 రెట్ల వృద్ధితో 1.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గిడ్డంగుల విభాగంలోకి నిధుల ప్రవాహమే ఈ వృద్ధికి కారణమని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తెలిపింది. అంతకుక్రితం ఏడాదిలో ఈ పెట్టుబడులు 155 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని జేఎల్ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అప్డేట్స్ క్యూ2–2021 రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది క్యూ2లో వేర్‌హౌస్ విభాగంలోకి 41 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఈ ఏడాది క్యూ2 నాటికి 743 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇతర విభాగాలలో చూస్తే.. రిటైల్ రంగం 278 మిలియన్ డాలర్లు, ఆఫీస్ స్పేస్ 231 మిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించాయి. 2020 క్యూ2లో ఆఫీస్ స్పేస్‌లోకి 66 మిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి. ఇక నివాస విభాగంలోకి గతేడాది క్యూ2లో 48 మిలియన్ డాలర్లు రాగా.. ఇప్పుడవి 106 మిలియన్ డాలర్లకు పెరిగాయి. పారదర్శకతతో వృద్ధి... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనలలో సడలింపులతో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ (రెరా), బినామీ లావాదేవీల చట్టాలతో గత దశాబ్ధ కాలంగా రియల్టీ పెట్టుబడులు, లావాదేవీలలో పారదర్శకత, వేగం పెరిగాయని జేఎల్ఎల్ కంట్రీ హెడ్ అండ్ సీఈఓ రాధా ధీర్ తెలిపారు. -
హైదరాబాద్‌లో గృహ నిర్మాణాలు ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో నివాస విభాగం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఢిల్లీ, ఎన్సీఆర్, పుణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఏడు ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఎగువ మధ్య తరగతి, ప్రీమియం విభాగాల ప్రాజెక్ట్స్‌ల్లో మాత్రమే ఈ జాప్యం ఉందని జేఎల్ఎల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ► గృహ నిర్మాణాలను ప్రారంభించిన కాలం నుంచి ఐదేళ్ల కాల పరిమితిని దాటిన ప్రాజెక్ట్‌లను నిర్మాణ గడువు ముగిసిన/ ఆగిపోయిన ప్రాజెక్ట్‌లుగా జేఎల్ఎల్ రీసెర్చ్ పరిగణించింది. ఈ లెక్కన చూస్తే దేశంలో 2014 లేదా అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తి కానివి మొత్తం 4.54 లక్షల గృహాలున్నాయి. వీటి విలువ రూ.4.62 లక్షల కోట్లు. వీటిల్లో ఢిల్లీ–ఎన్సీఆర్లో 62 శాతం, ముంబైలో 22 శాతం గృహాలున్నాయి. ఆయా నగరాల్లో ప్రతి మూడు గృహాల్లో ఒకటి నిర్మాణ గడువు ముగిసిందే ఉంది. ► నగరాల వారీగా జాప్యమైన గృహాల సంఖ్య చూస్తే.. హైదరాబాద్‌లో 2,400 గృహాలు (0.5 శాతం), బెంగళూరులో 28,400 (6.3 శాతం), చెన్నైలో 8,500 (1.9 శాతం), కోల్‌కతాలో 17,800 (3.9 శాతం), పుణేలో 16,400 గృహాలు (3.6 శాతంగా ఉన్నాయి. నగరంలో అద్దెవాసులే ఎక్కువ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 1.19 కోట్ల గృహాలు ఖాళీగా ఉన్నాయి. తక్కువ అద్దెలు, సరిగా లేని నిర్వహణ, అద్దెదారుల బాధ్యతారాహిత్యం, అద్దె గృహాల రాయితీలు లేకపోవటం వంటి రకరకాల కారణాలతో రెంట్ హౌస్‌లు వేకెంట్‌గా ఉంటున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా, కైటాన్ అండ్ కో సంయుక్త నివేదిక తెలిపింది. ► దేశ జనాభాలో 2.73 కోట్ల కుటుంబాలు అద్దె గృహాల్లో నివాసముంటున్నాయి. 79.4 శాతం అంటే 2.17 కోట్ల కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లోనే రెంట్‌కు ఉంటున్నాయి. అత్యధిక అద్దె కుటుంబాలు తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ 35,90,179 మంది అద్దె గృహాల్లో ఉంటున్నారు. రెండో స్థానంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ 3,004,702 కుటుంబాలు రెంట్ హౌస్‌లలో ఉంటున్నాయి. హైదరాబాద్ వాటా 6 శాతంగా ఉంది. ► మహారాష్ట్రలో 29,40,731, కర్నాటకలో 24,47,718, గుజరాత్లో 13,15,157, వెస్ట్ బెంగాల్లో 12,92,263, ఉత్తర ప్రదేశ్‌లో 11,14,832, ఢిల్లీలో 9,29,112 అద్దె గృహాలున్నాయి. -
హైదరాబాద్‌కు మరో ఘనత
న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరానికి మరోసారి గుర్తింపు లభించింది. స్వల్ప కాలంలో వృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, పుణె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8, చెన్నై 14, ముంబై 20వ స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ (జోన్స్ లాంగ్ లాసల్లే) తెలిపింది. భారత నగరాలు స్వల్పకాలంలో వృద్ధిని సూచించే జేఎల్ఎల్ సిటీ ‘మూమెంటమ్ ఇండెక్స్ 2018’లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఈ సూచీ పట్టణాల ఆర్థిక వృద్ధి, రియల్టీ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. చాలా వేగంగా వృద్ధి చెందుతున్న 30 పట్టణాలను ఈ సూచీలోకి చేర్చింది. మానవ వనరులు, అనుసంధానత, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్రాపర్టీ ధరలు, ఆర్థిక ఉత్పాదకత, కార్పొరేట్ కార్యకలాపాలు, నిర్మాణం, రిటైల్ విక్రయాల్లో భారత నగరాలు మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. ‘‘షార్ట్ టర్మ్ మూమెంటమ్ ర్యాంకుల్లో భారత్ తన పూర్వ వైభవాన్ని కొనసాగించింది. అంతర్జాతీయంగా జనాభా, ఆర్థిక వృద్ధి పరంగా భారత నగరాలు అధిక రేటును నమోదు చేశాయి. మౌలిక రంగంలో పెట్టుబడులు, సులభతర వ్యాపార నిర్వహణ కోసం ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఈ విషయంలో తోడ్పడ్డాయి’’ అని జేఎల్ఎల్ నివేదిక పేర్కొంది. దీర్ఘకాలం పాటు తమ వృద్ధిని కొసాగించేందుకు గాను ఈ నగరాలు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్లను తీర్చిదిద్దాలని, నివాసయోగ్యత, అందుబాటు ధరలు, నియంత్రణల్లో పారదర్శకతపై దృష్టి పెట్టాలని సూచించింది. -
ఆ జాబితాలో మన సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎదుగుతున్న ప్రపంచ నగరాల జాబితాలో భారత్ నుంచి ముంబయి, ఢిల్లీ, బెంగళూర్ నగరాలు చోటుదక్కించుకున్నాయి. అంతర్జాతీయ స్ధిరాస్థి సేవల సంస్థ జేఎల్ఎల్ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి వాణిజ్య కేంద్రాలను ఈ జాబితాలో పొందుపరిచింది. 80 అంతర్జాతీయ నగరాలను వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులు వంటి ప్రామాణికాల ఆధారంగా నాలుగు క్యాటగిరీలుగా ఈ నివేదిక విభజించింది. ఆయా నగరాల్లో పెట్టుబడి అవకాశాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ బలాబలాలను విశ్లేషించింది. ఎదుగుతున్న ప్రపంచ నగరాల జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబయి డీమ్డ్ మెగా హబ్స్‌గా పేరొందగా, బెంగుళూర్ హై ఎంటర్ర్పైజర్స్ సిటీగా వినుతికెక్కింది. ఎదుగుతున్న ప్రపంచ నగరాల్లో మన సిటీలు సత్తా చాటినా టాప్ 7 సిటీలతో పోలిస్తే భారతీయ నగరాలు మెరుగైన సామర్థ్యం కనబరచాలని జేఎల్ఎల్ ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్ రమేష్ నాయర్ పేర్కొన్నారు. టాప్ సెవెన్ సిటీస్‌లో లండన్, న్యూయార్క్, పారిస్, సింగపూర్, టోక్యో, హాంకాంగ్, సియోల్‌లు నిలిచాయి. -
రియల్టీలో64/100 మార్కులు
రెండున్నర ఏళ్ల పాలనపై జేఎల్ఎల్ రిపోర్ట్ సాక్షి, హైదరాబాద్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి 64/100 మార్కులొచ్చాయి. ప్రభుత్వ రెండున్నర ఏళ్ల పాలనలో దేశీయ స్థిరాస్తి రంగం పనితీరును విశ్లేషిస్తూ జోన్స్ లాంగ్ లాసెల్లె (జేఎల్ఎల్) ప్రోగ్రెస్ కార్డును విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను ఆధారంగా చేసుకొని ఈ రిపోర్ట్ కార్డును రూపొందించారు. స్మార్ట్‌సిటీ, మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకం/ఆతిథ్యం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), మేకిన్ ఇండియా, నిబంధనలు, పారదర్శకత వీటిల్లో మాత్రం మోదీ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని.. అందుబాటు గృహాలు (అఫడబుల్ హౌసింగ్), భూసేకరణ, పునరావాస మరియు పునరుద్ధరణ బిల్లు అమలులో మాత్రం ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చలేదని పేర్కొంది. మొత్తం మీద మోదీ ప్రభుత్వం దేశీయ రియల్టీ రంగంలో మోస్తరుగా విజయవంతమైందని రిపోర్ట్ సారాంశం. స్థిరాస్తి రంగం పనితీరు ఎలా ఉందంటే.. ⇔ గతంతో పోల్చుకుంటే మోదీ రెండున్నర ఏళ్ల పాలనలో దేశంలోని కార్యాలయ, రిటైల్, ఆతిథ్య విభాగాలు మాత్రం రికవరీ అయ్యాయి. ⇔నివాస సముదాయ విభాగం మాత్రం నేటికీ నత్తనడకన సాగుతోంది. ⇔ దేశంలో నికరంగా గ్రహించిన ఆఫీస్ మార్కెట్: 28 శాతం ⇔ బీపీఎస్ 270 పాయింట్లు తగ్గింది. ⇔ గతంలో ఆతిథ్య రంగం 58.4 శాతం గది ఆక్యుపెన్సీ ఉండగా.. ప్రస్తుతమిది 63.4 శాతానికి పెరిగింది. ⇔ రిటైల్ మార్కెట్ 250 పాయింట్లకు బీపీఎస్ వేకెన్సీకి పడిపోయింది. ⇔ దేశంలో నేటికీ అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు 40 శాతానికి పెరిగాయి. ⇔ 24 శాతం అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ విపణిలో పాక్షిక వృద్ధి కనిపించినా.. ⇔ వేతనాల వృద్ధి మాత్రం మందగించింది. మెరుగైన పనితీరు ధరల స్థిరీకరణ, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యవస్థాగత, విధాన ప్రకటనలు, మెరుగైన కమ్యూనికేషన్. మోస్తరు పనితీరు అవినీతి, నల్లధనం, న్యాయ వాదనలు, ఈ–గవర్నెన్స్, డిజిటల్ ఇండియా పేలవమైన పనితీరు మెరుగైన జీవన శైలి, పేదరిక నిర్మూలన -
2.2% తగ్గిన ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో పరిస్థితిపై జేఎల్ఎల్ నివేదిక న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం మేర తగ్గినట్టు ప్రాపర్టీ సలహా సేవల సంస్థ అయిన జేఎల్ఎల్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. అమ్మకాలు, ధరలు పడిపోవడంతో 2015-16లో రియల్ ఎస్టేట్ రంగం దారుణమైన పరిస్థితులను చవిచూసిందని తెలిపింది. గత మూడు నాలుగేళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గుముఖం పట్టిందని, దాంతో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యానికి దారితీసిందని... ఫలితంగా కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయని వివరించింది. అయితే, వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... 2015-16లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, పుణె నగరాల్లో గృహాల అమ్మకాలు 2.2 శాతం తగ్గాయి. మొత్తం 1,58,211 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అమ్ముడుపోయిన ఇళ్ల అమ్మకాల సంఖ్య 1,61,875తో పోలిస్తే ఇది 2.2 శాతం తక్కువ. కానీ, 2016 సంవత్సరంలోని మొదటి మూడు నెలల కాలంలో గృహాల అమ్మకాల్లో పెరుగుదల చోటు చేసుకోవడం భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేసింది. 2015 సంవత్సరం చివరి త్రైమాసికం లో 39,001 ఇళ్లు అమ్ముడవగా... 2016 జనవరి - మార్చి త్రైమాసికంలో 42,521 ఇళ్లు అమ్ముడుపోయాయి. దీని ప్రకారం చూస్తే ఒక్క త్రైమాసికంలోనే అమ్మకాలు 9 శాతం వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. -
యమ గిరాకీ ఉంది.. కానీ
భాగ్యనగరానిది వందల ఏళ్ల చరిత్ర. అయితే 400 ఏళ్ల క్రితం దీన్ని నిర్మించినపుడు 5 లక్షల జనాభాను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. వారికి కావాల్సిన అవసరాలనే కల్పించారు. కానీ ఇపుడది 17 రెట్లు పెరిగింది. జనాభా పరంగా మాత్రమే కాదు. విస్తీర్ణం పరంగానూ ఇలానే పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంటే.. ఇరుకు రోడ్లు, మురికివాడలు, చుక్కలు చూపించే ట్రాఫిక్, అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు... ఇదే చెబుతాం. అలాంటిది మరో ఏడేళ్ల తరవాత 2022లో భాగ్యనగరం ఎలా ఉంటుందో తలచుకుంటేనే భయమేస్తుంది!! దీనికి ప్రధాన కారణం యూరోపియన్ నగరాల మాదిరి ఇక్కడ పట్టణీకరణ ఒక క్రమపద్ధతిలో జరగక పోవటమేననేది నిపుణుల మాట. అందుకే 2022 నాటికి హైదరాబాద్ జనాభా, అప్పటి గృహ అవసరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు వంటి అన్ని మౌలిక అవసరాలపై అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్ఎల్) ఎండీ సందీప్ పట్నాయక్ సమగ్రంగా నివేదించారు. జనమే... జనం హైదరాబాద్ జనాభా 2014వ సంవత్సరం: 86 లక్షలు; 2022వ సంవత్సరం: 1.05 కోట్లు జేఎల్ఎల్, యునెటైడ్ నేషన్స్ వరల్డ్ అర్బనైజేషన్-2014 లెక్కల ప్రకారం.. 1990లో 42 లక్షలుగా ఉన్న హైదరాబాద్ జనాభా 2014 నాటికి 86 లక్షలకు చేరింది. 2022 నాటికి 1.05 కోట్లకు, 2030 నాటికి 1.28 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే అప్పటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులు, గృహ అవసరాలు మాత్రం వృద్ధి చెందట్లేదు. జీహెచ్ఎంసీ అధికారికంగా నగరంలో 1,474 మురికివాడలను గుర్తించింది. వీటిల్లో సుమారు 25 లక్షల జనాభా నివసిస్తున్నారు. నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వలస వస్తున్నారు. దీంతో దశాబ్ధ కాలంగా నగరంలో జనసాంద్రత గణనీయంగా పెరుగుతోంది. 2001లో చదరపు కిలోమీటరుకు 17,649గా ఉన్న హైదరాబాద్ జనసాంద్రత.. 2011 నాటికి 18,480కి చేరింది. రంగారెడ్డి జిల్లాలో చూస్తే 2001లో 477గా ఉండి 2011 నాటికి 707కు చేరిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. నీడ కూడా కరువే... హైదరాబాద్‌లో ఇళ్ల కొరత 2014వ సంవత్సరం: 19 లక్షలు; 2022వ సంవత్సరం: 23 లక్షలు హైదరాబాద్‌లో ఇళ్ల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం జనాభాలో ఉద్యోగస్తులు 45.5 శాతం కాగా వీరిలో సొంతిల్లున్న వారు 19 లక్షలే. మరోవైపు నగరంలో దాదాపు 1,474 మురికి వాడల్లో 25 లక్షల వరకూ జనాభా ఉన్నారు. వీరికి సొంతిల్లు సంగతి దేవుడెరుగు.. డ్రైనేజీ, తాగునీరు, మెరుగైన రవాణా వంటి కనీస వసతులూ కరువే. అగ్గిపెట్టెల్లాంటి అద్దె ఇళ్లే వారి ఆవాసాలు. సరైన పట్టణ ప్రణాళిక లేకపోవడమే వీటన్నిటికీ కారణమని జేఎల్ఎల్ నివేదిక తెలియజేసింది. మాల్... కమాల్ షాపింగ్ మాళ్లు (విస్తీర్ణంలలో) 2014వ సంవత్సరం: 20 లక్షల చదరపుటడుగులు 2022వ సంవత్సరం: 80 లక్షల నుంచి కోటి చ.అ. సిటీ జనానికి షాపింగ్ అంటే తగని వ్యామోహం. అందుకే ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా ఇంకా కొత్తగా నిర్మించే మాల్స్ వైపు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్, సిటీ సెంటర్, ఇన్నార్బిట్ మాల్, జీవీకే వన్, అశోకా మెట్రో పాలిటన్, బిగ్ బజార్, బాబూఖాన్ మాల్, షాపర్స్ స్టాప్, లైఫ్ స్టైల్, ఎంపీఎం మాల్, రిలయన్స్ మార్ట్, అమృతామాల్, ఫోరమ్ మాల్... ఇలా సుమారు వందకు పైగా పెద్ద మాల్స్ 20 లక్షల చ.అ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయని జేఎల్ఎల్ నివేదిక చెబుతోంది. 2022 నాటికి 80 లక్షల నుంచి కోటి చ.అ. విస్తీర్ణంలో షాపింగ్ మాల్ స్పేస్ అవసరం ఉంటుందని అంచనా వే సింది. ఇప్పటికే 50 లక్షల చ.అ. విస్తీర్ణంలో వివిధ కంపెనీల షాపింగ్ మాళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో కొన్నిటిని చూస్తే... విజ్ఞాన జ్యోతి విద్యా సంస్థలు, స్కిల్ ప్రమోటర్స్ సంయుక్తంగా కొండాపూర్‌లో శరత్స్ సిటీ క్యాపిటల్ పేరుతో మెగా షాపింగ్ మాల్‌ను నిర్మిస్తున్నాయి. ఇది 19 లక్షల చ.అ.ల్లో విస్తరించి ఉంటుంది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ నగరంలో 6 షాపింగ్ మాళ్లను నిర్మిస్తోంది. ప్యాట్నీ సర్కిల్లో 6.5 లక్షల చ.అ.ల్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో 4.5 లక్షల చ.అ.ల్లో, ఇదే ప్రాంతంలో 3 లక్షల చ.అ.ల్లో జూబ్లిహిల్స్ రోడ్ నెంబరు 36లో లక్ష చ.అ.ల్లో, బేగంపేట రోడ్లో 60 వేల చ.అ.ల్లో, గచ్చిబౌలి చౌరస్తాలో ఈ మాళ్లు రానున్నాయి. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ మియాపూర్ మెయిన్రోడ్లో లక్షన్నర చ.అ.ల్లో షాపింగ్ విత్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తోంది. కార్యాలయాలకూ గిరాకీ... హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ (విస్తీర్ణంలలో) 2014లో: 3.2 కోట్ల చ.అ. 2022 నాటికి: 6.3-6.5 కోట్ల చ.అ. నగరంలో కార్యాలయ స్థలాలకు గిరాకీ క్రమంగా పెరుగుతోంది. స్థానిక రాజకీయాంశం, అంతర్జాతీయ ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నాళ్లు తీవ్ర ఒడిదుడుకుల్లో పడినా... ఆరేడు నెలలుగా పరిస్థితి సానుకూలంగా మారిందనేది నిపుణుల మాట. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండుచోట్లా స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 3.2 కోట్ల చ.అ.ల్లో ఆఫీస్ స్పేస్ విస్తరించి ఉంది. 2022 నాటికి 6.3 నుంచి 6.5 కోట్ల చ.అ. మేర అవసరం ఉంటుందని జేఎల్ఎల్ నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కార్యాలయాల స్థలం ఏటా 5 శాతం వృద్ధి రేటును కనబరుస్తోందని పేర్కొంది. ఈ మధ్య కాలంలో ఐటీ సంస్థలే కాకుండా, ఐటీయేతర సంస్థలూ భాగ్యనగరాన్ని తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంపిక చేసుకోవడానికి ముందుకొస్తున్నాయి. తక్కువగా ఉన్న అద్దెలు, ఇతర నగరాల కన్నా కాస్త మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ పెరుగుతోంది. ఓఆర్ఆర్, రేడియల్ రోడ్లు, మెట్రో రైల్ వల్ల పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుందని జేఎల్ఎల్ అభిప్రాయపడింది. హెల్త్‌కేర్, ఫార్మా, బయోటెక్ రంగాలకు చెందిన సంస్థలు నగరంలో స్థలాన్ని లీజుకు తీసుకున్న వాటిలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారు 23 శాతం స్థలాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. నోవార్టిస్, సీలన్ ల్యాబ్స్, ఓసిమమ్ బయోటెక్, న్యూలాండ్ లాబ్స్ వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. టోకున కావాలి... చిల్లర వ్యాపారాలకు 2022 నాటికి హైదరాబాద్‌లో 80 లక్షల చదరపుటడుగుల రిటైల్ స్పేస్ కావాలి. రాజకీయాంశంతో సంబంధం లేకుండా ప్రజల అవసరాల్ని తీరుస్తాయి కాబట్టే వీటికి గిరాకీ అధికమన్నది నిపుణుల మాట. డిమాండ్ ప్రభావంతో సిటీలోని ప్రధాన ప్రాంతాల్లోని పెద్ద వీధుల్లో దుకాణాల అద్దెలూ స్వల్పంగా పెరిగే అవకాశముంది. పలు దేశ, విదేశీ దుస్తులు, ఆహార పానీయాల సంస్థలు హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నాయి. టీఎంసీ, వుడ్‌ల్యాండ్స్, డామినోస్, బేకర్స్ ఇన్, సబ్వే వంటివి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇవి బంజారా హిల్స్, జూబ్లిహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో షోరూంలను ఏర్పాటు చేస్తున్నాయి. అద్దెలు అందుబాటులో ఉండటం, గిరాకీకి డోకా లేని ప్రాంతాలు కావడం, సరళీకృతమైన అద్దె నిబంధనల కారణంగా హబ్సిగూడ, చందానగర్ నుంచి మదీనాగూడ, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో రిటైల్ స్పేస్ విశేషంగా అభివృద్ధి చెందుతోంది. ఎల్బీ నగర్లో 5.5 లక్షల చ.అ.ల్లో ప్రజయ్ ఇంజనీర్స్ ప్రజయ్ ప్రిస్టన్ పేరతో భారీ షాపింగ్ మాల్, హోటల్‌ను నిర్మించింది. ఇందులో రిటైల్ కోసమే 1.30 లక్షల చ.అ. స్థలాన్ని కేటాయించింది. పచ్చదనంతోనే రక్ష 2022 నాటికి హైదరాబాద్ పరిధిలో 12,600 హెక్టార్లలో పార్కులు అవసరం. అభివృద్ధితో పాటు ఆర్యోగం కూడా నగరవాసులకు అవసరమే. ఇందుకోసం పచ్చని ప్రకృతిలో జీవించడమే మార్గం. కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో ప్రస్తుతం అది అసాధ్యంగా మారింది. పర్యావరణ సమతూకం ఉండాలంటే 33 శాతం విస్తీర్ణంలో అడవులు అవసరం. మన రాష్ట్రంలో అది 21 శాతం ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దీని సగటు 9.5 శాతమే. అదీ రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతలను కలుపుకుంటేనే. దాన్ని మినహాయిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 2-3 శాతం మించదు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీ. ఒకవైపు అపార్ట్మెంట్లు ఆకాశాన్ని తాకుతుంటే మరోవైపు మరుగుజ్జు మొక్కలే దిక్కవుతున్నాయి. సుందరీకరణ కోసం నాటే మొక్కలు తప్ప పక్షులకు ఆవాసంగా మారే భారీ వృక్షాలు లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 142 హెక్టార్లలో, రంగారెడ్డిలో 70,295.87 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. 2022 నాటికి పెరిగే నగర జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మరో 12,600 హెక్టార్లలో పార్కులు అవసరమని జేఎల్ఎల్ రిపోర్ట్ పేర్కొంది. నిజానికిపుడు నగరంలో విస్తరించి ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలే పర్యావరణానికి అడ్రస్‌గా మారాయి. నగరంలో ఎన్జీఆర్ఐ, సీసీఎంబీ, ఇక్రిశాట్, ఎన్ఐఎన్, డీఆర్డీఏ, నైపర్ వంటి సుమారు 30 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. వీటిలో చాలావరకు చెట్లు ఉండటం గమనార్హం. స్కూళ్లు,ఆసుపత్రులు కూడా.. 2022 నాటికి నగర జనాభా అవసరాల దృష్ట్యా ఇప్పుడున్న వాటి కంటే రెండింతల సంఖ్యలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఆడిటోరియంలు అవసరముంటాయని జేఎల్ఎల్ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆసుపత్రుల సంఖ్య 200 పైనే ఉండగా.. 2022 నాటికి సుమారు 1.09 కోట్ల చ.అ. బిల్టప్ ఏరియాలో మరో 9,100 ఆసుపత్రి పడకలు అవసరముంటాయని పేర్కొంది. అలాగే 5. కోట్ల చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో మరో 3,838 పాఠశాలలు, 2.7 కోట్ల చ.అ. బిల్టప్ ఏరియాలో మరో 6 ఆడిటోరియంలు అవసరముంటాయని వివరించింది. -
భవిష్యత్తు భాగ్యనగరం!
2022 నాటికి హైదరాబాద్ రియల్ అవసరాలపై జేఎల్ఎల్ నివేదిక 1.05 కోట్లకు చేరే నగర జనాభా.. 23 లక్షల ఇళ్ల కొరత 10 మిలియన్ చ.అ. షాపింగ్ మాల్ స్పేస్.. 65 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ అవసరం 3,838 పాఠశాలలు.. 9,100 ఆసుపత్రి పడకలూ అవసరమే 12,600 హెక్టార్లలో పార్కులు, మరో 6 ఆడిటోరియంలు కూడా.. 400 ఏళ్ల క్రితం భాగ్యనగరాన్ని కేవలం 5 లక్షల జనాభాను దృష్టిలో పెట్టుకొనే నిర్మించారు. కానీ, ఇప్పుడది దాదాపు 20 రెట్లు పెరిగింది. అది జనాభా పరంగానైనా.. విస్తీర్ణం పరంగానైనా..! ప్రస్తుతం హైదరాబాద్ అంటే.. ఇరుకు రోడ్లు, మురికివాడలు, అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, చుక్కలు చూపించే ట్రాఫిక్! అలాంటిది 2022 నాటికి భాగ్యనగరాన్ని తలచుకోవాలంటేనే భయమేస్తుంది కదూ!! ఐరోపా మాదిరిగా ఒక క్రమపద్ధతిలో పట్టణీకరణ జరగకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే 2022 నాటికి హైదరాబాద్ జనాభా, అప్పటి గృహ అవసరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు వంటి మౌలిక అవసరాలపై అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ అయిన జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్ఎల్) ఓ నివేది కను రూపొందించింది. నివేదికలోని పలు అంశాలపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది. - సాక్షి, హైదరాబాద్ జనమే జనం... 2014వ సంవత్సరం నాటికి: 86 లక్షలు 2022వ సంవత్సరం నాటికి: 1.05 కోట్లు 1990వ సంవత్సరంలో 42 లక్షలుగా ఉన్న హైదరాబాద్ జనాభా 2014 నాటికి 86 లక్షలకు చేరింది. 2022 సంవత్సరానికి 1.05 కోట్లకు, 2030 నాటికి 1.28 కోట్లుకు చేరుకుంటుందని అంచనా. అయితే జనాభా మాదిరిగా మౌలిక వసతులు, గృహ అవసరాలు మాత్రం వృద్ధి చెందట్లేదు. నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వలస వస్తున్నారు. ఇళ్ల కొరత.. 2014వ సంవత్సరం : 19 లక్షలు 2022వ సంవత్సరం : 23 లక్షలు హైదరాబాద్‌లోని మొత్తం జనాభాలో ఉద్యోగస్తుల జనాభా 45.5 శాతం. వీరిలో సొంతిల్లు ఉన్న వాళ్లు కేవలం 19 లక్షలే. మరోవైపు నగరంలో దాదాపు 1,474 మురికివాడల్లో 25 లక్షల వరకూ జనాభా ఉంది. వీళ్లకు సొంతిల్లు సంగతి దేవుడెరుగు.. కనీసం తాగునీరు, డ్రైనేజీ, మెరుగైన రవాణా వంటి కనీస వసతులే కరువు. అద్దె ఇళ్లు అగ్గిపెట్టెలను తలపిస్తుంటాయి. చక్కటి పట్టణ ప్రణాళిక లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2011 సంవత్సరంలో నగరంలో 16 లక్షలుగా ఉన్న ఇళ్ల కొరత.. 2014 నాటికి 19 లక్షలకు చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని సమగ్ర గృహ నిర్మాణాన్ని చేపట్టకపోతే 2022 నాటికి 23 లక్షలకు పైగానే చేరుకుంటుందని అంచనా. షాపింగ్ అంటే మోజు.. 2014వ సంవత్సరం: 2 మిలియన్ చ.అ. 2022వ సంవత్సరం: 8-10 మిలియన్ చ.అ. షాపింగ్ అంటే నగరవాసులకు ఎక్కడలేని వ్యామోహం. అందుకే ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా ఇంకా కొత్తగా నిర్మించే మాల్స్ వైపు ఆశగా ఎదురుచూసే వారికిక్కడ కొదవలేదు. ఇప్పటికే నగరంలో హైదరాబాద్ సెంట్రల్, ఇన్నార్బిట్ మాల్, జీవీకే వన్, సిటీ సెంటర్.. ఇలా సుమారు వందకు పైగా పెద్ద మాల్స్ 2 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. 2022 నాటికి 8 నుంచి 10 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో షాపింగ్ మాల్ స్పేస్ అవసరం ఉంటుందని అంచనా. ఇప్పటికే 5 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో వివిధ కంపెనీల షాపింగ్ మాళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి కూడా. ఆఫీస్ స్పేస్‌కూ గిరాకే.. 2014వ సంవత్సరం: 32 మిలియన్ చ.అ. 2022వ సంవత్సరం: 63-65 మిలియన్ చ.అ. స్థానిక రాజకీయాంశం కారణంగా నగరంలో ఆఫీసు స్పేస్ మార్కెట్ కొంతకాలం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నా.. ఆరేడు నెలలుగా పరిస్థితి సానుకూలంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండిట్లోనూ స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడటమే ఇందుకు కారణం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 32 మిలియన్ చ.అ.ల్లో ఆఫీస్ స్పేస్ విస్తరించి ఉంది. 2022 నాటికి ఇది 63 నుంచి 65 మిలియన్ చ.అ.ల్లో ఆఫీస్ స్పేస్ అవసరం ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కార్యాలయాల స్థలం ఏటా 5 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. రాజకీయాంశంతో సంబంధం లేకుండా ప్రజల అవసరాల్ని తీరుస్తాయి కాబట్టే చిల్లర వర్తక సముదాయాలకూ (రిటైల్ స్పేస్) డిమాండ్ పెరుగుతోంది. 2022 నాటికి నగరంలో 8 మిలియన్ చ.అ.ల్లో రిటైల్ స్పేస్ అవసరముంటుంది. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గల అతిపెద్ద వీధుల్లో దుకాణాల అద్దెలూ స్వల్పంగా పెరగడానికి ఆస్కారం ఉంది. పార్కులూ అవసరమే.. 2022 నాటికి 12,600 హెక్టార్లలో పార్కులు అవసరం.నగరవాసులకు అభివృద్ధితో పాటు ఆర్యోగం కూడా అవసరమే. పర్యావరణ సమతూకం ఉండాలంటే 33 శాతం విస్తీర్ణంలో అడవులు అవసరం. మన రాష్ట్రంలో అది 21 శాతం ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సగటు 9.5 శాతమే. అదీ రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతా లను కలుపుకుంటేనే. దాన్ని మినహాయిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 2-3 శాతం మించదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 142 హెక్టార్లలో, రంగారెడ్డిలో 70,295.87 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. 2022 నాటికి పెరిగే నగర జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మరో 12,600 హెక్టార్లలో పార్కులు అవసరం ఉంటుంది. స్కూళ్లు, ఆసుపత్రులు కూడా.. 2022 నాటికి నగర జనాభా అవసరాల దృష్ట్యా ఇప్పుడున్న వాటి కంటే రెండింతల సంఖ్యలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఆడిటోరియంలు అవసరముంటాయి. 2022 నాటికి సుమారు 10.92 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 9,100 ఆసుపత్రి పడకలు అవసరముంటాయి. అలాగే 54 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 3,838 పాఠశాలలు, 27 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 6 ఆడిటోరియంలు అవసరముంటాయని జేఎల్ఎల్ నివేదిక చెబుతోంది. ఫ్లాట్లు, ప్లాట్లు, లోన్లు, నిర్మాణాలు,న్యాయకోణాలు, పన్నులు, వాస్తు ఇలా స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com