![JLL Report Says Hyderabad Attracts More Institutional Investments than other Metro Cities in The Country - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/22/66.jpg.webp?itok=m81pnNyi)
Hyderabad: రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి దేశంలోని ఏ ప్రధాన నగరాల్లోనూ రానన్ని పెట్టుబడులు గతేడాది భాగ్యనగరానికి వచ్చాయి. 2021లో దేశీయ రియల్టీ రంగంలో 4.3 బిలియన్ డాలర్ల (రూ.32 వేల కోట్లు) సంస్థాగత పెట్టుబడులు రాగా.. హైదరాబాద్‌లో 687 మిలియన్ డాలర్లు (రూ.5,120 కోట్లు) వచ్చాయని జేఎల్‌ఎల్ నివేదిక వెల్లడించింది.
2020లో నగర రియల్టీలోకి 100 మిలియన్ డాలర్లు (రూ.750 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. గతేడాది దేశీయ ఇన్‌స్టిట్యూçషన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో నగరం వాటా 16 శాతంగా ఉంది. ఆ తర్వాత ముంబైలో 683 మిలియన్ డాలర్లు, బెంగళూరులో 379 మిలియన్ డాలర్లు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 548 మిలియన్ డాలర్లు, చెన్నైలో 150 మిలియన్ డాలర్లు, కోల్‌కతాలో 105 మిలియన్ డాలర్లు, పుణేలో 77 మిలియన్ డాలర్ల ఇన్‌స్టిట్యూçషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment