దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్టీలో హైదరాబాద్ దూసుకుపోతుంది. జెఎల్‌ఎల్ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో గతేడాది కొత్త వెంచర్లు ప్రారంభించే విషయంలో భాగ్యనగరం దూకుడు కనబరిచింది.
ఇండియాలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనే నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా జేఎల్‌ఎల్ ఈ నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో విల్లాలను మినహాయించారు. 2021లో న్యూ ప్రాజెక్ట్స్ లాంచింగ్‌కి సంబంధించి 26.1 శాతం వృద్ధితో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత పూనే 17.6 శాతం, బెంగళూరు 16.4 శాతం ముంబై 16.1 శాతం వృద్ధిని కనబరిచాయి.
2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు క్వార్టర్ 4ని పరిగణలోకి తీసుకుంటే ఏడు మెట్రోల్లో 45,383 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో 19 శాతం వాటాతో పూనే ప్రథమ స్థానంలో నిలిచింది. కాగా బెంగళూరు, హైదరాబాద్‌లు 17 శాతం వాటాని కలిగి ఉన్నాయి.
గత ఏడాది దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 1.28 లక్షల కొత్త ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో 15,787 ఇళ్లు అమ్ముడయ్యాయి. కరోనా రాక ముందు అంటే 2019లో హైదరాబాద్లో 15,804 ఇళ్లు సేల్ అయ్యాయి. ఇళ్ల అమ్మకాల పరంగా కోవిడ్ పూర్వ స్థితికి హైదరాబాద్ చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment