న్యూఢిల్లీ: అపార్ట్‌మెంట్ విస్తీర్ణం, నిర్మాణదారుల గత చరిత్ర (ట్రాక్ రికార్డ్), ఆరోగ్య వసతులు,పచ్చదనానికి తగినంత ఆవరణ, తక్కువ జనసాంద్రత, ప్రజా రవాణా వసతులు, స్కూళ్లు, కార్యాలయాలకు అనుసంధానత.. ఇళ్ల కొనుగోలుకు వినియోగదారులు వరుస క్రమంలో చూసే అంశాలు ఇవే. కరోనా మమహ్మారి తర్వాత కొనుగోలుదారులకు ఇవి ప్రాధాన్య అంశాలుగా మారిపోయినట్టు జేఎల్‌ఎల్ ఇండియా, రూఫాండ్‌ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
‘ఇళ్ల కొనుగోలుదారుల ప్రాధాన్యత సర్వే 2021: కరోనా ప్రభావం’ పేరుతో ఈ సంస్థలు సర్వే నిర్వహించాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆరు మెట్రో నగరాల పరిధిలోని 2,500 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నాయి. అన్నింటికంటే ముందు ఫ్లాట్ విస్తీర్ణణమే తమకు ముఖ్యమని వీరు చెప్పారు. ఆ తర్వాత డెవలపర్ల చరిత్రను చూస్తామని తెలిపారు.
చదవండి: వేలంవెర్రి, చార్మినార్ ఏం ఖర్మ తాజ్‌మహల్, చైనా వాల్ కూడా మావే!
ప్రాధాన్యతల్లో మార్పులు.: ఇళ్ల కొనుగోలుకు సంబంధించి చూసే అంశాల్లో పెద్దగా మార్పుల్లేవని.. వాటి ప్రాధాన్యతల్లోనే మార్పులు వచ్చినట్టు జేఎల్‌ఎల్ తన సర్వే నివేదికలో తెలిపింది. కరోనాకు ముందు 2020 మొదటి మూడు నెలల్లో నిర్వహించిన సర్వేలో.. కార్యాలయం, స్కూళ్లకు అనుసంధానం వినియోగదారుల మొదటి ప్రాధాన్యత అంశంగా ఉంది. ఆ తర్వాత ప్రజా రవాణా వసతులు, డెవలపర్ల చరిత్ర, అపార్ట్‌మెంట్ సైజ్, హెల్త్‌కేర్ వసతులు, వినోద కేంద్రాలు, పచ్చదనం, తక్కువ జనసాంద్రత అంశాలకు వరుస క్రమంలో గతంలో ప్రాముఖ్యమిచ్చారు.
కొనుగోలుదారుల అవసరాలు, ప్రాధాన్యతలకు తగినట్టు డెవలపర్లు డిజైన్లలో మార్పులను అమలు చేస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. డెవలపర్‌కు మంచి చరిత్ర ఉంటే కాస్త ఎక్కువ వ్యయం చేసేందుకు వినియోగదారులు వెనుకాడడం లేదని పేర్కొంది. ఇళ్ల కొనుగోలుకు సుముఖంగా ఉన్న వారిలో 80 శాతం మంది వచ్చే మూడు నెలల్లోనే ఆ పనిచేస్తామని చెప్పగా.. 80 % మంది రూ.75 లక్షల్లోపు ఇల్లును ఎంచుకుంటామని తెలిపారు. 89% మంది అద్దెకు ఉండడానికంటే సొంత ఇంటికే వోటు వేయడం గమనార్హం.
రియల్ ఎస్టేట్‌లోకి మహిళా నిపుణులు రావాలి
కేంద్ర పట్టణ వ్యవహారాల కార్యదర్శి మిశ్రా దేశంలో పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. రియల్ ఎస్టేట్ రంగానికి అపార అవకాశాలున్నాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అన్నారు. కనుక ఈ రంగంలో పనిచేసేం దుకు మహిళా నిపుణులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
శుక్రవారం రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం ‘నరెడ్కో’ మహిళా విభాగం ‘నరెడ్కోమహి’ విభాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మిశ్రా మాట్లాడారు. ‘‘రియల్‌ఎస్టేట్ రంగంలో రెరా చట్టం విశ్వాసాన్ని తీసుకొచ్చింది. కనుక మహిళా నిపుణులు ఈ రంగంతో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలి. మహిళలకు అన్ని రకాల సామర్థ్యాలున్నాయి. క్లిష్టమైన, సున్నితమైన నైపుణ్యాలు వారిలో ఉన్నాయి.
ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్‌లోనూ వారు తమ సామర్థ్యాన్ని ఎందుకు ప్రదర్శించకూడదు’’ అని మిశ్రా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి ఈ రంగం కీలకమైనదిగా అభి వర్ణించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మం దికి ఉపాధి కల్పిస్తున్న రంగంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment