సాక్షి, న్యూఢిల్లీ : ఎదుగుతున్న ప్రపంచ నగరాల జాబితాలో భారత్ నుంచి ముంబయి, ఢిల్లీ, బెంగళూర్ నగరాలు చోటుదక్కించుకున్నాయి. అంతర్జాతీయ స్ధిరాస్థి సేవల సంస్థ జేఎల్‌ఎల్ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి వాణిజ్య కేంద్రాలను ఈ జాబితాలో పొందుపరిచింది. 80 అంతర్జాతీయ నగరాలను వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులు వంటి ప్రామాణికాల ఆధారంగా నాలుగు క్యాటగిరీలుగా ఈ నివేదిక విభజించింది. ఆయా నగరాల్లో పెట్టుబడి అవకాశాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ బలాబలాలను విశ్లేషించింది. ఎదుగుతున్న ప్రపంచ నగరాల జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయని జేఎల్‌ఎల్ ఇండియా పేర్కొంది.
ఈ జాబితాలో ఢిల్లీ, ముంబయి డీమ్డ్ మెగా హబ్స్‌గా పేరొందగా, బెంగుళూర్ హై ఎంటర్ర్‌పైజర్స్ సిటీగా వినుతికెక్కింది. ఎదుగుతున్న ప్రపంచ నగరాల్లో మన సిటీలు సత్తా చాటినా టాప్ 7 సిటీలతో పోలిస్తే భారతీయ నగరాలు మెరుగైన సామర్థ్యం కనబరచాలని జేఎల్‌ఎల్ ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్ రమేష్ నాయర్ పేర్కొన్నారు. టాప్ సెవెన్ సిటీస్‌లో లండన్, న్యూయార్క్, పారిస్, సింగపూర్, టోక్యో, హాంకాంగ్, సియోల్‌లు నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment