indian cities
-
రియల్టీ హాట్‌స్పాట్స్.. తిరుపతి, విశాఖ
న్యూఢిల్లీ: రానున్న సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ త్వరితగతిన వృద్ధి చెందేందుకు దక్షిణాదిన విశాఖపట్నం, తిరుపతి పట్టణాలకు మెరుగైన అవకాశాలున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. ఆధ్యాతి్మక పర్యాటకం నేపథ్యంలో వృద్ధి అవకాశాల పరంగా తిరుపతి, వారణాసి, షిర్డీ, పూరి, అయోధ్య, అమృత్సర్, ద్వారక పట్టణాలు తప్పనిసరిగా దృష్టి సారించాల్సినవిగా పేర్కొంది. 100కు పైగా పట్టణాల్లో.. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రియల్ ఎసేŠట్ట్ వృద్ధి పరంగా మెరుగైన అవకాశాలున్న 30 పట్టణాలను కొలియర్స్ ఇండియా గుర్తించింది. ఇందులోనూ 17 పట్టణాల్లో వేగవంతమైన వృద్ధి అవకాశాలున్నట్టు వెల్లడించింది. దక్షిణాదిన విశాఖపట్నం, తిరుపతి, కోచి, కోయంబత్తూర్.. ఉత్తరాదిన అమృత్సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి.. తూర్పున పాట్నా, పూరి.. పశ్చిమాన ద్వారక, నాగ్‌పూర్, షిర్డీ, సూరత్.. మధ్య భారత్‌లో ఇండోర్ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్‌లో అధిక ప్రభావం చూపించే ప్రముఖ రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా అవతరించనున్నట్టు అంచనా వేసింది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతుకుతోడు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధ్యాతి్మక పర్యాటకం ఈ పట్టణాల్లో వృద్ధికి కీలక చోదకంగా పేర్కొంది. రహదారులు, రైళ్లు, విమానాశ్రయాల అనుసంధానత నేపథ్యంలో దీర్ఘకాలంలో సంఘటిత రియల్ ఎస్టేట్ సంస్థలను సైతం ఆధ్యాతి్మక పట్టణాలు ఆకర్షిస్తాయని తెలిపింది. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్లు మౌలిక సదుపాయాలు మెరుగుదల, అందుబాటు ధరల్లో రియల్ ఎస్టేట్, నైపుణ్య మానవవనరులు, ప్రభుత్వాల కృషితో చిన్న పట్టణాలు సైతం దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజి్ఞక్ తెలిపారు. 2030 నాటికి భారత్ జీడీపీలో రియల్ ఎసేŠట్ట్ రంగం వాటా లక్ష కోట్ల డాలర్లకు, 2050 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు.ఖరీదైన ఇళ్లకు డిమాండ్ ఖరీదైన ఇళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో మొత్తం 1,20,640 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు కాగా, అందులో 37 శాతం రూ.కోటిపైన ధర విభాగంలోనివే (ప్రీమియం హౌసింగ్) ఉన్నట్టు హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్ టైగర్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనాకు ముందు 2019 ఇదే త్రైమాసికంలో ప్రీమియం ఇళ్ల వాటా మొత్తం అమ్మకాల్లో 16 శాతంగానే ఉంది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణె పట్టణాల్లో విక్రయాల వివరాలను ఇందులో విశ్లేషించింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్లో మార్చి త్రైమాసికంలో 10,060 ఇళ్ల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, అందులో 59 శాతం ప్రీమియం విభాగంలోనే ఉన్నాయి. ప్రీమియం ఇళ్ల అమ్మకాలు పెరుగుతుండడం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలమైన పనితీరుకు నిదర్శమని ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. ‘‘ఒకప్పుడు రూ.కోటికిపైన వాటిని విలాసవంత ఇళ్లుగా పరిగణించేవారు. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇప్పుడు రూ.కోటి బడ్జెట్ అన్నది సాధారణంగా మారింది. ఆకాంక్షలు పెరుగుతున్నాయి. విశాలమైన, ఆధునిక సౌకర్యాలున్న ఇళ్లకు కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని వాధ్వాన్ వివరించారు. -
కాలుష్య కోరల్లోకి మరో రెండు నగరాలు.. టాప్-10లోకి చేరిన ఇండియన్ సిటీలు ఇవే..
ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలోకి ఢిల్లీతో పాటు మరో రెండు భారతీయ నగరాలు చేరాయి. దేశమంతా ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ మొత్తంలో బాణాసంచా కాల్చడంతో ఆ విషపూరిత పొగ గాలిని కమ్మేసింది. ఫలితంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎప్పటిలాగే దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా అగ్ర స్థానంలో నిలించింది. ప్రస్తుతం అక్కడ గాలి నాణ్యత సూచీ 420 ఉండటంతో దీన్ని 'ప్రమాదకర' కేటగిరీలో చేర్చింది. టాప్-10 లో మరో రెండు నగరాలు అత్యంత కాలుష్యపూరిత నగరాల టాప్ 10 జాబితాలోకి భారత్ చెందిన మరో రెండు నగరాలు చేరాయి. 196 ఏక్యూఐతో కోల్‌కతా నాల్గవ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై 163 ఏక్యూఐతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఏక్యూఐ స్థాయి 400-500 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. ఇక 150-200 స్థాయి ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఏక్యూఐ స్థాయి 0-50 ఉంటే అది మంచిదిగా పరిగణిస్తారు. -
ఆఫీస్ లీజింగ్‌లో స్తబ్ధత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఆఫీసు లీజ్ మార్కెట్ జూన్ త్రైమాసికంలో బలహీన పనితీరు చూపించింది. మొత్తం ఆఫీసు లీజు విస్తీర్ణం 6 శాతం క్షీణించి 13.9 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఏడు ప్రముఖ పట్టణాల్లో స్థూల ఆఫీస్ లీజు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 14.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సంయక్తంగా 8.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజును నమోదు చేశాయి. ఈ మూడు మార్కెట్లు సంయుక్తంగా 59 శాతం వాటాను ఆక్రమించాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయంగా పెద్ద సంస్థలు, ఎంఎన్‌సీలు నిర్ణయాలు తీసుకోవడంలో నెలకొన్న జాప్యమే ఈ పరిస్థితికి కారణమని వెస్టియన్ నివేదిక పేర్కొంది. కాకపోతే మార్చి త్రైమాసికంలో పోలిస్తే, జూన్ క్వార్టర్లో ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ 17 శాతం పెరిగినట్టు వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ వినియోగం, కొత్త వసతుల పూర్తి పెరిగినట్టు వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ఆఫీస్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ రంగం ముందు ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం ముందున్నట్టు వెస్టియన్ తెలిపింది. ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ రంగం నుంచి డిమాండ్ ఉందని.. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లోనూ కదలిక వచ్చినట్టు వివరించింది. సెపె్టంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ఉద్దేశ్యాలు మెరుగుపడినట్టు, దేశ వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ పరిస్థితికి ఇది నిదర్శనమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరపడితే ద్వితీయ ఆరు నెలల కాలంలో భారత్‌లో రియల్ ఎసేŠట్ట్ కార్యకలాపాల్లో చురుకుదనం కనిపించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. ► విడిగా చూస్తే హైదరాబాద్ ఆఫీస్ లీజు మార్కెట్లో 4 శాతం క్షీణత కనిపించింది. 2.3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 2.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో 83 శాతం వృద్ధితో 1.2 నుంచి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ► బెంగళూరులో 12 శాతం క్షీణించి 3.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ► ముంబై మార్కెట్లో 25 శాతం క్షీణించి 1.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► పుణెలో 6 శాతం పెరిగి 1.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 5శాతం తక్కువగా 2 మిలియన్ చదరపు అడుగులకు ఆఫీస్ లీజు పరిమితమైంది. ► కోల్‌కతాలో ఏకంగా 88 శాతం క్షీణించి 0.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► జూన్ త్రైమాసికంలో ఆఫీస్ లీజులో టెక్నాలజీ రంగం 26% వాటా ఆక్రమించింది. ఇంజనీరింగ్, తయారీ రంగం వాటా 19%గా ఉంటే, ఫ్లెక్సి బుల్ ఆఫీస్ స్పేస్ వాటా 18%గా నమోదైంది. ► ఈ ఏడాది జనవరి–జూన్ వరకు దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాల వాటాయే 14.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
భవిష్యత్తు భారతీయ నగరాలదే
భారతదేశ నగరాలు పరుగెడుతున్నాయి. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటి 10 భారతదేశ నగరాలేనని తాజా నివేదిక చెబుతోంది. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా 2019–2035 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా అభివృద్ధి చెందే నగరాల జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి 10 భారతీయ నగరాలే. నివేదిక ప్రకారం వజ్రాల వ్యాపారానికి పేరుగాంచిన సూరత్ (గుజరాత్) 9.17% వార్షిక వృద్ధితో మొదటి స్థానంలో, 8.47% వృద్ధితో హైదరాబాద్ 4వ స్థానంలో, 8.16 % వృద్ధితో విజయవాడ పదో స్థానంలో నిలవనున్నాయి. మొదటి పది నగరాల్లో తమిళనాడుకు చెందిన మూడు నగరాలు మూడవ స్థానం సంపాదించుకోనున్నాయి. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, భవిష్యత్తులో చైనాను మించిపోతుందని వస్తున్న అంచనాలకు ఈ నివేదిక బలాన్నిస్తోంది. చిన్నవే అయినా.. ఘనంగా! ప్రపంచంలోని అతిపెద్ద నగరాలతో పోలిస్తే భారతీయ నగరాలు ఆర్థికపరంగా చాలా చిన్నవే అయినా 2027 నాటికి ఆసియా దేశాల్లోని అన్ని నగరాల సగటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఉత్తర అమెరికా, ఐరోపాల్లోని అన్ని నగరాల జీడీపీని మించిపోతుందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అధిపతి రిచర్డ్ హాల్ట్ స్పష్టం చేశారు. ప్రపంచ మహానగరాల జాబితాలో ఇప్పటికీ, 2035 నాటికి తొలి స్థానాల్లో పెద్దగా మార్పులు ఉండవని అంచనా వేశారు. ప్రస్తుతం జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న న్యూయార్క్, టొక్యో, లాస్ ఏంజెలిస్, లండన్లు తమ స్థానాలను పదిలపరుచుకుంటాయని, పారిస్ స్థానంలో షాంఘై, చికాగో స్థానంలో బీజింగ్ వస్తాయన్నారు. -
చెట్లు కూలుతున్న దృశ్యం
వాయు కాలుష్య భూతం జనం ఊపిరి తీస్తున్నదని మొన్నీమధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక వెల్లడించిన సంగతి విస్మరించి దేశ రాజధాని నగరంలో మహా వృక్షాలను నేల కూల్చడానికి బయల్దేరిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా అడ్డుకోవటం పర్యావరణవాదులకు సంతృప్తినిస్తుంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో భారత్‌కు చెందిన 14 నగరాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది. అడవుల విధ్వంసం కారణంగా పరిశ్రమలు, వాహనాలు విడిచిపెట్టే కాలుష్యం అడ్డూ ఆపూ లేకుండా పీల్చే గాలిలోనూ, తాగే నీటిలోనూ కలుస్తున్నదని... అది ఏటా లక్షలమంది చావుకు కారణమవుతున్నదని వివరిం చింది. ఇటీవలికాలంలో ఢిల్లీ నగరంపై అరడజనుసార్లు ధూళి తుపాను విరుచుకుపడింది. విస్తారంగా చెట్లుంటే ఇలాంటి విపత్తుల బెడద ఉండదని పర్యావరణవేత్తలు చెప్పారు. అయినా మన పాలకులకు నదురూ బెదురూ లేదు. వన విధ్వంసంతో తప్ప అభివృద్ధి అసాధ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తామే నేరుగా రంగంలోకి దిగితే తప్ప వ్యవహారం చక్కబడదని గుర్తించిన హరిత కార్యకర్తలు, పౌర బృందాలు, కాలనీ వాసుల సంక్షేమ సంఘాలు ఉమ్మడిగా నిరసనకు దిగిన తీరు దేశ ప్రజలందరికీ ఆదర్శనీయం. ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్‌ల వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పంచుకుని వందలాదిమంది ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. 70వ దశకంలో హిమాలయ పర్వత సానువుల్లో అడవుల నరికివేతను నిరసిస్తూ సాగిన చిప్కో ఉద్యమాన్ని గుర్తుకు తెస్తూ ఢిల్లీ వాసులు వృక్షాలను హత్తుకుని వాటి ఉసురు తీయనివ్వబోమని ప్రకటించారు. నిజానికి ఢిల్లీలో వృక్షాల కూల్చివేత పర్యవసానంగా పర్యావరణం దెబ్బతింటుందని, దీన్ని వెనువెంటనే నిలుపుదల చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై వచ్చే నెల 2న విచారణ జరగబోతోంది. అయినా అధికార యంత్రాంగం తన దోవన తాను వన విధ్వంసాన్ని కొనసాగించింది. కనుకనే ఉద్యమకారులు ఆందోళనకు దిగడంతోపాటు హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. దక్షిణ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏడు నివాస సముదాయాలను నవీకరించేందుకు రూ. 33,000 కోట్ల వ్యయంతో చేపట్టబోయే నిర్మాణాల కోసం ఈ ధ్వంసరచనకు అంకురార్పణ చేశారు. కూల్చబోయే వృక్షాలు 14,000కు మించవని అధికారులు చెబుతున్న లెక్కల్ని పర్యావరణ ఉద్యమకారులు అంగీకరించడం లేదు. ఆ ప్రాంతంలోని 16,500 వృక్షాలు కనుమరుగవుతాయని వివరిస్తున్నారు. ఇందులో ఇప్పటికే నౌరోజీనగర్లోని 3,780 చెట్లను కూల్చడానికి అనుమతులు మంజూరయ్యాయి. అక్కడ 1,500 చెట్లు రెక్కలు తెగిన పక్షుల్లా నేలరాలాయి. మిగిలిన ప్రాంతాల వృక్షాలకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. కూల్చిన ప్రతి చెట్టుకూ బదులు 10 మొక్కలు నాటాలని రెండేళ్లక్రితం అమల్లోకొచ్చిన అటవీకరణ పరిహార నిధి చట్టం నిర్దేశిస్తోంది. ఆ ప్రకారమే మొక్కల కోసం అటవీ శాఖకు రూ. 23 కోట్లు అందజేశామని జాతీయ భవన నిర్మాణ సంస్థ (ఎన్బీసీసీసీ) ఇస్తున్న సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచదు. మహా వృక్షాలను పెకిలించినప్పుడు అందుకు పాపపరిహారార్థం మొక్కలు పెంచితే సరిపోతుందని ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ అనుకోలేరు. పైగా మన ప్రభుత్వాలు మొక్కల పెంపకం నిర్వాకం ఎలా ఉందో గణాంకాలే చెబుతున్నాయి. 2014–17 మధ్య 36,57,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా 28,12,000 మాత్రమే నాటారని ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. పైగా అటవీకరణకు సంబంధించినంతవరకూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ బాగా వెనకబడి ఉంది. నిరుడు విడుదలైన అటవీ స్థితిగతుల నివేదిక–2017 ప్రకారం 2015–17 మధ్య దేశంలో కొత్తగా 0.21 శాతం ప్రాంతంలో అడవి విస్తరించింది. కానీ వేరే దేశాల ప్రగతితో పోలిస్తే ఇది అతి స్వల్పం. మన దేశంలోని మొత్తం భౌగోళిక ప్రాంతంలో 25 శాతంకన్నా తక్కువ భాగంలో మాత్రమే అడవులున్నాయి. దీన్ని కనీసం 33 శాతానికి పెంచుతామని 1988 మొదలుకొని కేంద్రంలో అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలన్నీ చెబుతూనే ఉన్నాయి. ఇందుకు భిన్నంగా 1990లో 28 శాతం అటవీ ప్రాంతమున్న స్పెయిన్ ప్రస్తుతం దాన్ని 37 శాతానికి పెంచుకుంది. మనం ఇలా 0.21 శాతం చొప్పున అడవుల్ని విస్తరించుకుంటే ఎన్ని దశాబ్దాలకు లక్ష్యం చేరుకుంటామో ఊహిం చుకోవచ్చు. పైగా మన నివేదిక చెప్పే అడవుల్లో నేలకూల్చిన చెట్లకు బదులుగా నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. కనుక నివేదిక చెబుతున్న 0.21 అటవీ విస్తరణ కూడా లొసుగుల మయమే. ఇదిగాక ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రాజెక్టుల పేరు చెప్పి అడవుల నరికివేత యధేచ్ఛగా సాగుతోంది. మన దేశంలో ఆనకట్టలు కావొచ్చు... రహదారుల విస్తరణ కావొచ్చు... నగరాల నిర్మాణం కావొచ్చు.... ఏ ప్రాజెక్టు అమల్లోకి వచ్చినా ముందుగా తెల్లారేది నిరుపేద జనం బతుకులు. ఆ తర్వాత వంతు వృక్షాలది. ఇరవైయ్యేళ్లక్రితం ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్న జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం నగరాలు, పట్టణాలు, గ్రామాల మధ్య అనుసంధానాన్ని ఎన్నో రెట్లు విస్తృతపరిచింది. మారుమూల ప్రాంతాలకు కూడా వాహనాలు వెళ్లగలుగుతున్నాయి. సంపద ఎన్నో రెట్లు పెరిగింది. కానీ ఆ అభివృద్ధి క్రతువుకు ప్రజానీకం చెల్లిస్తున్న మూల్యం తక్కువేమీ కాదు. మహా వృక్షాలు నేలకూలాయి. ఎన్నో విలువైన చెట్లు, మొక్కలు కనుమరుగ య్యాయి. గ్రామాలకు కోతుల బెడద పెరిగింది. అభివృద్ధి ప్రాజెక్టుల పర్యవసానాలెలా ఉంటాయో ఇప్పుడెవరూ చెప్పనవసరం లేకుండానే ప్రజలకు అర్థమవుతోంది. దేశ ప్రగతికి అభివృద్ధి ప్రాజె క్టులు అవసరమే. కానీ వాటికీ, పర్యావరణానికీ... వాటికీ, ప్రజల జీవనానికీ మధ్య సమతుల్యత సాధించగలిగితేనే ఆ అభివృద్ధికి అర్ధం ఉంటుంది. లేనప్పుడు అవి ప్రజానీకానికి పీడగా పరిణ మిస్తాయి. ప్రభుత్వాలు ఈ సంగతి గుర్తించాలి. -
డేంజర్ జోన్లో మన నగరాలు
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్యభరిత నగరాల్లో భారత్ అగ్రభాగాన నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం జెనీవాలో విడుదల చేసిన ప్రపంచ కాలుష్య డేటాబేస్ నివేదికలో టాప్ 15 నగరాల్లో 14 నగరాలు భారత్‌కు చెందినవే కావడం గమనార్హం. ఈ జాబితాలో కాన్పూర్ అత్యంత కాలుష్యభరిత నగరంగా ముందువరుసలో నిలిచింది. ఇక్కడ ప్రమాదకారక పీఎం 2.5 స్థాయి 173 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇక ప్రపంచంలో అత్యంత కాలుష్యనగరాల్లో వరుసగా ఫరీదాబాద్, వారణాసి, గయ, పట్నా, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, ముజఫర్‌పూర్, శ్రీనగర్, గుర్గావ్, జైపూర్, పటియాలా, జోథ్‌పూర్‌లు నిలిచాయి. ఈ జాబితాలో 15వ స్ధానంలో కువైట్‌కు చెందిన అలి సుబా అల్సలేం నిలిచింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై ఇటీవల నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ 6వ స్థానంలో ఉంది. 2010, 2014 మధ్య ఢిల్లీలో కాలుష్య స్థాయి కొంత మెరుగైనా 2015లో మళ్లీ పరిస్థితి విషమించింది. వాయు కాలుష్యం కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. కాలుష్య సంబంధ గుండె జబ్బులతో 34 శాతం మంది మరణిస్తుంటే 21 శాతం మంది న్యుమోనియా, 20 శాతం మంది స్ర్టోక్ కారణంగా మరణిస్తున్నారు. వాయు కాలుష్యంతో వాటిల్లుతున్న మరణాల్లో 19 శాతం శ్వాససంబధిత సీఓపీడీ వ్యాధి కారణంగా, ఏడు శాతం మంది లంగ్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. -
ఆ జాబితాలో మన సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎదుగుతున్న ప్రపంచ నగరాల జాబితాలో భారత్ నుంచి ముంబయి, ఢిల్లీ, బెంగళూర్ నగరాలు చోటుదక్కించుకున్నాయి. అంతర్జాతీయ స్ధిరాస్థి సేవల సంస్థ జేఎల్ఎల్ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి వాణిజ్య కేంద్రాలను ఈ జాబితాలో పొందుపరిచింది. 80 అంతర్జాతీయ నగరాలను వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులు వంటి ప్రామాణికాల ఆధారంగా నాలుగు క్యాటగిరీలుగా ఈ నివేదిక విభజించింది. ఆయా నగరాల్లో పెట్టుబడి అవకాశాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ బలాబలాలను విశ్లేషించింది. ఎదుగుతున్న ప్రపంచ నగరాల జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబయి డీమ్డ్ మెగా హబ్స్‌గా పేరొందగా, బెంగుళూర్ హై ఎంటర్ర్పైజర్స్ సిటీగా వినుతికెక్కింది. ఎదుగుతున్న ప్రపంచ నగరాల్లో మన సిటీలు సత్తా చాటినా టాప్ 7 సిటీలతో పోలిస్తే భారతీయ నగరాలు మెరుగైన సామర్థ్యం కనబరచాలని జేఎల్ఎల్ ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్ రమేష్ నాయర్ పేర్కొన్నారు. టాప్ సెవెన్ సిటీస్‌లో లండన్, న్యూయార్క్, పారిస్, సింగపూర్, టోక్యో, హాంకాంగ్, సియోల్‌లు నిలిచాయి. -
కనీవినీ ఎరుగని బంపర్ వసూళ్లు
హైదరాబాద్: సాధారణంగా పన్నలు కట్టడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ, పెద్దనోట్ల రద్దు చేయడం, ఆ తర్వాత రద్దైన పాతనోట్లతోనే పన్నులు చెల్లించడానికి అవకాశం ఇవ్వడంతో ఈ ఆఫర్‌ను దేశవ్యాప్తంగా ప్రజలు వినియోగించుకున్నారు. దీంతో దేశంలోని నగరాలన్నింటిలోనూ కనీవినీ ఎరుగనిరీతిలో పన్నులు వసూలు అయ్యాయి. రద్దైన రూ. 500, వెయ్యినోట్లతో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ పన్నులు, కరెంటు, నీటి బిల్లులు కట్టడానికి అనుమతి ఇవ్వడంతో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు పోటెత్తారు. దీంతో ప్రస్తుత గడిచిపోతున్న నవంబర్ నెలలో దేశంలోని నగరాల్లో ఏకంగా 252శాతం పన్ను వసూళ్లు పెరిగాయి. గత ఏడాది నవంబర్‌లో రూ. 498 కోట్ల పన్నులు మాత్రమే నగరాల్లో వసూలు కాగా.. ఈ ఏడాది ఏకంగా 1722 కోట్ల పన్నులు వసూలు అయ్యాయి. ఇక హైదరాబాద్ నగరం పన్ను వసూళ్ల విషయంలో రికార్డు సృష్టించింది. నగరంలో భారీగా 2500శాతం పన్ను వసూళ్లు పెరిగాయి. పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీ భారీగా లాభపడిన సంగతి తెలిసిందే. పన్నుల బకాయిలు, సాధారణ బిల్లులను పాత నోట్లతో చెల్లించొచ్చని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించేందుకు నగర వాసులు క్యూ కట్టారు. దీంతో జీహెచ్ఎంసీకి దాదాపు రూ.246.14 కోట్ల ఆదాయం రాగా, జలమండలికి రూ.100కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. -
పఠాన్ కోట్‌ను మరిపించేలా మరో దాడి!
చండీగఢ్: భారత వైమానిక దళ స్థావరం పఠాన్‌కోట్‌పై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆ దాడిని మరిపించేలా మరో దాడిని చేసేందుకు కుట్రలు పన్నింది. ఈసారి దాడిని భారీ స్థాయిలో చేయాలని, దానికి పఠాన్ కోట్-2 అని పేరును కూడా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ లో ఉన్న స్లీపర్ సెల్స్‌తో అన్ని ముఖ్యనగరాల్లో రెక్కీ నిర్వహిస్తోందని తెలిసింది. ఈ దాడిలో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతోపాటు ఇండియన్ ముజాహిదీన్ సంస్థ సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన కమాండర్ అవాయిస్ మహ్మద్ త్వరలోనే మలేషియాకు పంపిస్తున్నారట. అక్కడే అతడికి మలేషియా నుంచి భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ఫేక్ పాస్ పోర్టులు ఇస్తారని తెలిసింది. ఇతడు పాకిస్థాన్‌కు చెందిన ఓకారా ప్రాంతవాసి అని తెలిపింది. ఇతడే ఇండియాలో రెండోసారి జరపబోయే దాడులకు నేతృత్వం వహిస్తాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థ హెచ్చరించింది. -
దేశంలో పలు నగరాలకు 'ఐఎస్' ముప్పు
-
హైదరాబాద్ తోపాటు పలు నగరాలకు 'ఐఎస్' ముప్పు
హైదరాబాద్: దేశంలో వివిధ నగరాలకు ఐఎస్ఐఎస్ ముప్పు పొంచి ఉందా అంటే ఉందనే అంటున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐబీ) వర్గాలు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐబీ దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ సహా ముంబై, కోల్కత్తా, బెంగళూరు, చెన్నై నగరాలపై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వ్యూహా రచన చేస్తున్నారని హెచ్చరించింది. రాష్ట్రాల్లో దాడులకు ఇప్పటికే 35 మంది ఉగ్రవాదులు రంగంలోకి దిగి సన్నాహాలు చేస్తున్నారని హెచ్చరించింది. దీంతో దేశంలోని విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లుతోపాటు నగరాల్లోని ప్రధాన కూడళ్లలో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టదిట్టం చేసింది.