వేగవంతమైన వృద్ధికి పుష్కల అవకాశాలు
అయోధ్య, షిర్డీ, తిరుపతికి ఆధ్యాతి్మక పర్యాటకం ఊతం
కొలియర్స్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: రానున్న సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ త్వరితగతిన వృద్ధి చెందేందుకు దక్షిణాదిన విశాఖపట్నం, తిరుపతి పట్టణాలకు మెరుగైన అవకాశాలున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. ఆధ్యాతి్మక పర్యాటకం నేపథ్యంలో వృద్ధి అవకాశాల పరంగా తిరుపతి, వారణాసి, షిర్డీ, పూరి, అయోధ్య, అమృత్‌సర్, ద్వారక పట్టణాలు తప్పనిసరిగా దృష్టి సారించాల్సినవిగా పేర్కొంది. 100కు పైగా పట్టణాల్లో.. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రియల్ ఎసేŠట్‌ట్ వృద్ధి పరంగా మెరుగైన అవకాశాలున్న 30 పట్టణాలను కొలియర్స్ ఇండియా గుర్తించింది.
ఇందులోనూ 17 పట్టణాల్లో వేగవంతమైన వృద్ధి అవకాశాలున్నట్టు వెల్లడించింది. దక్షిణాదిన విశాఖపట్నం, తిరుపతి, కోచి, కోయంబత్తూర్.. ఉత్తరాదిన అమృత్‌సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి.. తూర్పున పాట్నా, పూరి.. పశ్చిమాన ద్వారక, నాగ్‌పూర్, షిర్డీ, సూరత్.. మధ్య భారత్‌లో ఇండోర్ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్‌లో అధిక ప్రభావం చూపించే ప్రముఖ రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా అవతరించనున్నట్టు అంచనా వేసింది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతుకుతోడు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధ్యాతి్మక పర్యాటకం ఈ పట్టణాల్లో వృద్ధికి కీలక చోదకంగా పేర్కొంది. రహదారులు, రైళ్లు, విమానాశ్రయాల అనుసంధానత నేపథ్యంలో దీర్ఘకాలంలో సంఘటిత రియల్ ఎస్టేట్ సంస్థలను సైతం ఆధ్యాతి్మక పట్టణాలు ఆకర్షిస్తాయని తెలిపింది.
2030 నాటికి లక్ష కోట్ల డాలర్లు
మౌలిక సదుపాయాలు మెరుగుదల, అందుబాటు ధరల్లో రియల్ ఎస్టేట్, నైపుణ్య మానవవనరులు, ప్రభుత్వాల కృషితో చిన్న పట్టణాలు సైతం దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజి్ఞక్ తెలిపారు. 2030 నాటికి భారత్ జీడీపీలో రియల్ ఎసేŠట్ట్ రంగం వాటా లక్ష కోట్ల డాలర్లకు, 2050 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు.
ఖరీదైన ఇళ్లకు డిమాండ్
ఖరీదైన ఇళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో మొత్తం 1,20,640 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు కాగా, అందులో 37 శాతం రూ.కోటిపైన ధర విభాగంలోనివే (ప్రీమియం హౌసింగ్) ఉన్నట్టు హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్ టైగర్’ తన తాజా నివేదికలో వెల్లడించింది.
కరోనాకు ముందు 2019 ఇదే త్రైమాసికంలో ప్రీమియం ఇళ్ల వాటా మొత్తం అమ్మకాల్లో 16 శాతంగానే ఉంది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణె పట్టణాల్లో విక్రయాల వివరాలను ఇందులో విశ్లేషించింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మార్చి త్రైమాసికంలో 10,060 ఇళ్ల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, అందులో 59 శాతం ప్రీమియం విభాగంలోనే ఉన్నాయి.
ప్రీమియం ఇళ్ల అమ్మకాలు పెరుగుతుండడం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలమైన పనితీరుకు నిదర్శమని ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. ‘‘ఒకప్పుడు రూ.కోటికిపైన వాటిని విలాసవంత ఇళ్లుగా పరిగణించేవారు. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇప్పుడు రూ.కోటి బడ్జెట్ అన్నది సాధారణంగా మారింది. ఆకాంక్షలు పెరుగుతున్నాయి. విశాలమైన, ఆధునిక సౌకర్యాలున్న ఇళ్లకు కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని వాధ్వాన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment