బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన బోర్డులోకి మరో ఎగ్జిక్యూటివ్‌ను తీసుకుంది. డి. సుందరంను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించింది. జూలై 14నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఇన్ఫీ ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ నామినేషన్ అండ్ రెమినరేషన్ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నియమకాన్ని చేపట్టింది. ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ రంగంలో విస్తృతమైన అనుభవం ఉన్న సుందరాన్ని తమ బోర్డులోకకి తీసుకోవడం సంతోషంగా ఉందని ఇన్ఫోసిస్ బోర్డ్ ఛైర్మన్ శేష శాయి తెలిపారు.
1975 లో యునిలివర్ గ్రూప్‌లో చేరిన సుందరం వివిధ నాయకత్వ స్థానాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు. 34 సం.రాల కెరీర్లో హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ ఐటి డైరెక్టర్ వైస్ చైర్మన్ పదవులను ఆయన చేపట్టారు. కాగా ప్రస్తుతం సుందరం టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సుందరం
Published Sat, Jul 1 2017 4:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM
Advertisement
Advertisement