సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ ఇండిపెండెంట్ డైరెక‍్టర్ పదవికి రవి వెంకటేశన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వెంకటేశన్ మరో నూతన అవకాశాన్ని దక్కించుకునే ప్రణాళికలో ఉన్నారని దేశీయ అతిపెద్ద ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ వెల్లడించింది. మరోవైపు దీనిపై వెంకటేశన్ మాట్లాడుతూ ఇన్ఫోసిస్ సంక్లిష్ట ప్రయాణం ప్రారంభ సమయంలో తాను ఇన్ఫోసిస్ బోర్డులో చేరానంటూ గుర్తు చేసుకున్నారు. అది టెక్టోనిక్ పరిశ్రమ మార్పుల సమయం. ఈ మిషన్ సాధించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని వెంకటేశన్ ప్రకటించారు. ప్రస్తుతం సమర్ధులైన వారి చేతుల్లో ఇన్ఫోసిస్ బలంగా ఉంది. పురోగతిని సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు.
కాగా 2011నుంచి ఇన్ఫీబోర్డు స్వత్రంత్ర డైరెక్టర్‌గా ఉన్న వెంకటేశన్ ఇన్ఫోసిస్ కో-ఛైర‍్మన్‌గా కూడా వ్యవహరించారు. కార్పొరేట్ పాలన వివాదం, ఇన్ఫోసిస్ సంక్షోభం నేపథ్యంలో అప్పటి సీఈవో విశాల్ సిక్కా రాజీనామా అనంతరం నందన్ నీలేకని మరోసారి ఇన్ఫీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కో చైర్మన్ పదవినుంచి రవి వెంకటేశన్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment