ఇన్ఫోసిస్‌లో కీలకమార్పులు | infosys appoints Inderpreet Sawhney from Wipro as group general counsel | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌లో కీలకమార్పులు

Published Fri, Jun 16 2017 12:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

ఇన్ఫోసిస్‌లో కీలకమార్పులు

ఇన్ఫోసిస్‌లో కీలకమార్పులు

బెంగళూరు: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్  శుక్రవారం కీలక నియామకాలను  చేపట్టింది.  మరో  ఐటీ దిగ్గజం విప్రో   మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రప్రీత్ సావ్నీని  జనరల్ కౌన్సిల్‌ కు ఎంపిక చేసింది.  ఈ నియామకం జూలై 3, 2017 నుండి అమల్లోకి వస్తుందనీ ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే  రీటైల్‌ గ్లోబల్‌ హెడ్‌కు పదవికి రాజీనామా చేసిన సందీప్‌డాడ్లాని   స్థానాన్ని కూడా భర్తీ చేసింది.

ఈ నియామకాలపై  ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా మాట్లాడుతూ, 24 ఏళ్లలో  కరీర్‌లో ఇంద్ర ప్రీత్‌కు  విభిన్నమైన ప్రపంచ అనుభవం ఉందని, తన నైపుణ్యం ఇన్ఫోసిస్‌ ప్రారంభించిన "ట్రాన్స్ఫర్మేషన్ జర్నీకి" బాగా ఉపయోగపడనుందని చెప్పారు.  అలాగే గత మూడు సంవత్సరాలుగా వాస్వానీ ,  బాంగాతో తాను కలిసి పనిచేశాననీ, వారిపై తమకు అపారమైన విశ్వాసముందన్నారు.  ఖాతాదారుల  డిజిటల్ ఆకాంక్షలను సాధించడంలో   వీరిరువురికి  గొప్ప సామర్థ్యం ఉందన్నారు.

 విప్రోకు ముందు  ఇంద్ర ప్రీత్‌ సిలికాన్ వ్యాలీలో మిడ్-సైజ్డ్  న్యాయ సంస్థకు మేనేజింగ్ భాగస్వామిగాను,  ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీలో  అంతర్గత సలహాదారుగా పనిచేశారు. యాక్టింగ్‌ జనరల్‌ కౌన్సిల్‌గా ఉన్న  గోపీ కృష్ణన్‌ రాధాక్రిష్ణన్‌ రాజీనామా చేయడంతో ఈ స్నాన్ని ఈమె భర్తి చేయనున్నారు. 

మరోవైపు  రాజీనామా చేసిన మరో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ సందీప్‌డాడ్లాని  బాధ్యతలను రెండుగా విభజించారు. సీపీజీ, అండ్‌ లాజిస్టిక్‌ , రీటైల్‌ గ్లోబల్‌హెడ్‌గా కర్మేష్‌ వాస్వాని,  మానుఫాక్చరింగ్‌ హెడ్‌ గా నితీష్‌బంగ వ్యవహరించనున్నారు. ఈ నియామాకలు  జూలై15 నుంచి  అమలు కానున్నాయి. దాదాపు దశాబ్దకాలంపాటు వాస్వానీ, బాంగా  వ్యూహాత్మక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement