అనుభవం నేర్పిన పాఠాలు అద్భుత విజయాలను సొంతం చేస్తాయి. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలలో పని చేసిన ఇప్సితా దాస్‌గుప్తా ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకుంది.
అమెరికాలో యాపిల్ సర్వీసెస్‌లో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్‌గా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా... అమెరికన్ మల్టీ నేషనల్ ఐటీ కార్పోరేషన్ ‘హెచ్‌పీ ఇండియా’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్‌వీపీ), మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం అయింది...
పనిలోని కష్టమే ఇష్టమైతే అంతకంటే సుఖం ఏమున్నది?
కొలంబియా యూనివర్శిటీలో మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేసిన ఈప్సితా ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేసింది. ముంబై రోడ్లపై ఉరుకులు, పరుగులు, పని భారంతో నిద్రలేని రాత్రులు ఆమెకు కొత్తేమీ కాదు.
కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోడంలో సమస్యలు తలెత్తాయి. ‘నాకు కష్టంగా ఉంది’ అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎన్నో కంపెనీలలో మార్కెటింగ్, స్ట్రాటజీ విభాగాలకు నేతృత్వం వహించి మన దేశంతో సహా బంగ్లాదేశ్, శ్రీలంకలలో పనిచేసింది ఈప్సితా. ఆఫీస్ గదికే పరిమితం కాకుండా జనాల్లోకి వెళ్లి క్లయింట్స్ అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేది. వాటికి అనుగుణంగా వ్యూహాలను రూ΄÷ందించుకునేది.
యాపిల్‌కు ముందు స్టార్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రాటజీ, జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ దక్షిణ ఆసియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పని చేసిన ఈప్సితా వృత్తికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరితో చర్చిస్తుంది.
‘తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవచ్చునేమోగానీ, ఆ నిర్ణయం ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను వెనక్కి తీసుకోలేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు వంద కోణాల్లో ఆలోచిస్తాను’ అంటుంది ఈప్సితా. ఉద్యోగంలోకి అప్పుడే వచ్చిన రోజుల్లో ఈప్సితాలాంటి కొత్త ఉద్యోగులకు సీనియర్‌ల నుంచి వినిపించిన మాట ‘ఇలా ఎవరైనా ఆలోచిస్తారా?’
అందరిలాగే ఈప్సితా ఆలోచించినట్లయితే ఆమెకు ఇంత పేరు వచ్చేది కాదేమో.
‘ఇలా కూడా చేయవచ్చు... అంటూ సంప్రదాయ విధానాలకు భిన్నంగా ఆలోచించేదాన్ని. ఇది సీనియర్‌లకు రుచించేది కాదు. అయితే నా ఆలోచనల్లో సత్తా ఉందని ఆ తరువాత నిరూపణ అయింది’ అంటుంది ఈప్సితా.
వృత్తిరీత్యా ఈప్సితా దాస్‌గు΄్తా ఒక సమస్యకు పరిష్కారం వెదకగానే పని అక్కడితో ఆగి΄ోదు. ‘మేమున్నాం’ అంటూ కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి. గత సమస్యలతో వీటికి ΄ోలిక ఉండక΄ోవచ్చు. కొన్నిసార్లు పరిష్కారం దుర్భేద్యంగా అనిపించవచ్చు. ఇలాంటి సమయంలోనే వ్యూహకర్తలు చురుగ్గా ఆలోచించాలి. వ్యూహకర్తగా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన ఈప్సితా దాస్‌గుప్తాఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచింది.
‘మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు ఈప్సితా చెప్పే జవాబు... ‘వీరు వారు అని కాదు. నేను మాట్లాడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత ఇన్‌స్పైర్ అవుతుంటాను. సా«ధారణ ప్రజల నుంచి ఇన్వెస్టర్‌లు, లీడర్‌లు, ఆర్టిస్టుల వరకు నాకు ఎంతోమంది రోల్ మోడల్స్ కనిపిస్తారు’
Comments
Please login to add a commentAdd a comment