హీరో పగ్గాలుమళ్లీ పవన్ ముంజాల్కే
న్యూఢిల్లీ: దేశీ టూవీలర్ దిగ్గజ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ), సీఈవోగా మళ్లీ పవన్ ముంజాల్ నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. మామూలుగా పవన్ ముంజాల్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కంపెనీ ఈయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది. అలాగే విక్రమ్ కాస్బెకర్‌కు డెరైక్టర్ల బోర్డులో చోటు కల్పించింది.