హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్‌ | Delhi Police File FIR Hero MotoCorp Chairman Pawan Munjal Share Price Down - Sakshi
Sakshi News home page

హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్‌

Published Mon, Oct 9 2023 1:59 PM | Last Updated on Mon, Oct 9 2023 2:41 PM

Delhi Police file FIR Hero MotoCorp chairman Pawan Munjal share price down - Sakshi

Delhi Police file FIR against Hero MotoCorp chairman Pawan Munjal ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌కు మరోసారి భారీ షాక్‌ గిలింది.  మోసం, ఫోర్జరీ , నేరపూరిత కుట్ర  ఆరోపణలతో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై హీరో మోటో ఎండీ, సహా పలువురి సీనియర్ అధికారులపై కేసు నమోదైంది. నకిలీ బిల్లులు తయారు చేసి, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేసి, సేవా పన్నులో లబ్ధి పొందారని పోలీసులు ఆరోపించారు. దీంతో స్టాక్‌   3 శాతం భారీ పతనాన్ని నమోదు చేసింది.  ఈ కేసు ఎఫ్‌ఐఆర్ 2010కి ముందు నాటి పాత విషయానికి సంబంధించినదని, ఇతర దర్యాప్తులు , పన్ను విచారణలకు ఎలాంటి సంబంధం లేదని  కంపెనీ తెలిపింది. 

బిలియనీర్ , కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజాల్‌, సీఈవో పవన్‌  కాంత్‌, ముగ్గురిపై  ఫోర్టరీ అరోపణలపై కేసు నమోదైంది. కాగా పవన్‌ ముంజాల్‌సహా మరికొందరికీలక  అధికారులపై మనీలాండరింగ్‌ ఆరోపణలు దాఖలైనాయి. ఇందులో   భాగంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 2023 ఆగస్టు లో ముంజాల్,  ఇతరులపై సోదాలు నిర్వహించింది. ప్రకటించని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఫిర్యాదు చేసింది. దీంతో ముంజాల్‌ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.  వ్యక్తిగత అవసరాల కోసం  కోసం రూ.40 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ (నిషేధిత వస్తువు)ని అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఈడీ ఆరోపించింది.  దీనికి సంబంధించిన  తనిఖీల్లో సెర్చ్ 25 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ, నగదు, బంగారం ,వజ్రాభరణాలు (విదేశీ కరెన్సీ, బంగారంతో సహా) స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. (ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్‌’ కోసం సెంట్రల్‌ బ్యాంకు కీలక నిర్ణయం)

ఆగస్ట్ 20, 2018న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంజాల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ లండన్‌కు బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో భద్రతా తనిఖీల సమయంలో అతని హ్యాండ్ బ్యాగేజీలో రూ.81 లక్షల కంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్  స్వాధీనం చేసుకుంది. 800 కోట్లకు పైగా అక్రమ వ్యాపార వ్యయాలు, భూమి కొనుగోలుకు ఉపయోగించిన రూ. 60 కోట్ల విలువైన "ఖాతాలో చూపని"  అక్రమ ఆస్తులను  సోదాల్లో కనుగొన్నట్లు ఐటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గత ఏడాది మార్చిలో  ప్రకటించిన సంగతి తెలిసిందే. (స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో మెరిసిన రణబీర్‌, అలియా...మరో విశేషమేమంటే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement