Pawan Munjal
-
హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్
Delhi Police file FIR against Hero MotoCorp chairman Pawan Munjal ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌కు మరోసారి భారీ షాక్ గిలింది. మోసం, ఫోర్జరీ , నేరపూరిత కుట్ర ఆరోపణలతో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై హీరో మోటో ఎండీ, సహా పలువురి సీనియర్ అధికారులపై కేసు నమోదైంది. నకిలీ బిల్లులు తయారు చేసి, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేసి, సేవా పన్నులో లబ్ధి పొందారని పోలీసులు ఆరోపించారు. దీంతో స్టాక్ 3 శాతం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ 2010కి ముందు నాటి పాత విషయానికి సంబంధించినదని, ఇతర దర్యాప్తులు , పన్ను విచారణలకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ తెలిపింది. బిలియనీర్ , కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్, సీఈవో పవన్ కాంత్, ముగ్గురిపై ఫోర్టరీ అరోపణలపై కేసు నమోదైంది. కాగా పవన్ ముంజాల్సహా మరికొందరికీలక అధికారులపై మనీలాండరింగ్ ఆరోపణలు దాఖలైనాయి. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 2023 ఆగస్టు లో ముంజాల్, ఇతరులపై సోదాలు నిర్వహించింది. ప్రకటించని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఫిర్యాదు చేసింది. దీంతో ముంజాల్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వ్యక్తిగత అవసరాల కోసం కోసం రూ.40 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ (నిషేధిత వస్తువు)ని అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించిన తనిఖీల్లో సెర్చ్ 25 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ, నగదు, బంగారం ,వజ్రాభరణాలు (విదేశీ కరెన్సీ, బంగారంతో సహా) స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. (ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం) ఆగస్ట్ 20, 2018న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంజాల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ లండన్‌కు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో భద్రతా తనిఖీల సమయంలో అతని హ్యాండ్ బ్యాగేజీలో రూ.81 లక్షల కంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. 800 కోట్లకు పైగా అక్రమ వ్యాపార వ్యయాలు, భూమి కొనుగోలుకు ఉపయోగించిన రూ. 60 కోట్ల విలువైన "ఖాతాలో చూపని" అక్రమ ఆస్తులను సోదాల్లో కనుగొన్నట్లు ఐటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గత ఏడాది మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
పవన్ ముంజాల్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ ముంజాల్‌తోపాటు ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. పవన్ ముంజాల్‌తోపాటు ఇతర నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్(సీబీఐసీ) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని హీరో మోటో కార్ప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్లో పవన్ ముంజాల్ నివాసం, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిగాయని తెలియజేసింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. -
హీరో మోటోకార్ప్ డిజిటల్ రైడ్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ 2030 నాటికి డిజిటల్ వేదిక ద్వారా 30 శాతం అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా చేసుకుంది. అలాగే మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి చేర్చాలని నిర్ణయించామని హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు. 2022–23 కంపెనీ వార్షిక నివేదికలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘డిజిటల్ వేదికలను పెంపొందించాం. కొనుగోళ్లకు ముందు, తర్వాతి అవసరాలకు ప్రధాన గమ్యస్థానంగా ఈ వేదిక నిలిచింది. సమాచార సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించాం. ఆధునిక అనలిటిక్స్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగిస్తున్నాం. ఆటోమేషన్ సాంకేతికలను అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ఉన్న తయారీ కేంద్రంలో స్థాపించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డిజిటల్ ఫ్యాక్టరీ లైట్‌హౌస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్పాదకతను 20 శాతం పెంచాలని లక్ష్యంగా చేసుకుంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకర వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. భారత్‌తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 2023–24లో 65 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2022–23లో కంపెనీ 53 లక్షల యూనిట్లను తయారు చేసింది. 54 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది దారి చూపుతాం.. భారత్‌లో మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల డిమాండ్‌లో గ్రామీణ, ఉప నగర మార్కెట్లు సవాళ్లను ఎదుర్కొన్నాయని ముంజాల్ పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాణాత్మక వృద్ధి అంశాలు చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. ‘దేశంలోని యువ నైపుణ్యం కలిగిన జనాభా, గ్రామీణ, ఉప నగర ప్రాంతాల బలమైన ఆర్థిక వృద్ధి సామర్థ్యం, వినియోగదారులకు రుణాలు సులభంగా అందుబాటులో ఉండడం, లాస్ట్ మైల్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా విజయవంతమైన 2023–24 సంవత్సరానికి హీరో మోటోకార్ప్ దారి చూపుతుందని విశ్వసిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సవాల్ విసురుతున్నప్పటికీ బ్రాండ్ నిర్మాణం, కొత్త ఉత్పత్తుల విడుదల, నెట్వర్క్ పరిధిని విస్తరించడంలో పెట్టుబడులను కొనసాగించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా కొత్త మార్కెట్లలో మా ఉనికిని నెలకొల్పడానికి, ఇప్పటికే ఉన్న వాటిలో వాటాను పెంచుకోవడానికి, మార్కెట్ అభివృద్ధి ప్రయత్నాలకు కట్టుబడి ఉండటానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రచించాం. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోడళ్లకు మరింత విలువ కేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’ అని ముంజాల్ పేర్కొన్నారు. -
Pawan Munjal: తిరుగులేని సీఈఓ, 40కి పైగా దేశాల్లో
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం దాని వెనుకుండి నడిపిస్తున్న ఎందరో కార్మికులు. ప్రపంచంలో అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థగా కీర్తి గడించిన హీరో మోటోకార్ప్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'పవన్ ముంజాల్' నేతృత్వంలో ఇప్పుడు ముందుకు సాగుతోంది. బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. 2022 డిసెంబర్ 10 నాటికి పవన్ ముంజాల్, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 3.55 బిలియన్ డాలర్లు. 2011లో హీరో కంపెనీ హోండా నుంచి విడిపోయిన తరువాత పవన్ ముంజాల్ ముందుండి నడిపించి ప్రపంచ దేశాలకు విస్తరించడంతో గొప్ప కృషి చేశారు. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా వంటి 40కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది. (ఇదీ చదవండి: SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!) ఇప్పటికి పవన్ ముంజాల్ నేతృత్వంలో భారతదేశంలో ఆరు సహా ఎనిమిది తయారీ కేంద్రాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన హీరో ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ లిమిటెడ్, బహదూర్ చంద్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో కూడా ఒకరుగా ఉన్నారు. హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో నిలదొక్కుకోవడానికి, 2022 అక్టోబర్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'విడా' విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. -
ప్రతి ఒక్కరికీ అందుబాటులో.. సమగ్ర ఆరోగ్యవ్యవస్థ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కోవిడ్ లాంటి విపత్తులు మరోసారి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా బలమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఇప్పుడున్న 11 కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో వైద్య ఆరోగ్య రంగంపై రూ.16,000 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండో రోజు సమావేశాల సందర్భంగా సోమవారం ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్‌పై సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. సీఎం జగన్‌తో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తదితరులు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్.. కోవిడ్ లాంటి విపత్తును ఎవరూ ఊహించలేదు. మన తరం మునుపెన్నడూ చూడని విపత్తు ఇది. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ లాంటి విపత్తు మరోసారి తలెత్తితే సమర్థంగా నివారించేందుకు బలీయమైన వ్యవస్థ కావాలి. కోవిడ్ విపత్తు నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నివారణ, నియంత్రణ చికిత్స విధానాల ప్రాముఖ్యత తెలుసుకోవాలి. సమగ్ర ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. కోవిడ్, తదనంతర పరిణామాలన్నీ మనకు కనువిప్పు లాంటివి. ఒక దేశం, ఒక రాష్ట్రం పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతా చేశాం. కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ అత్యాధునిక ఆస్పత్రులు లేకున్నా.. అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల విషయంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడమే దీనికి ప్రధాన కారణం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి టైర్–1 నగరాలు ఏపీలో లేనందున ప్రైవేట్ రంగంలో అత్యాధునిక వైద్య సేవల లభ్యత తక్కువగా ఉంది. కోవిడ్ సమయంలో ప్రధానమైన ఈ లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమయ్యాం. కోవిడ్ నియంత్రణలో భాగంగా 44 దఫాలు ఇంటింటి సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో ఇందుకోసం బలమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు వైద్య, ఆరోగ్య రంగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వీరందరూ సమష్టిగా ఇంటింటి సర్వే చేపట్టడంతో తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ను సమర్ధంగా ఎదుర్కోగలిగాం. ఫలితంగా మరణాల రేటును తగ్గించగలిగాం. భారత్‌లో నమోదైన సగటు మరణాల శాతం 1.21 కాగా ఏపీలో దేశంలోనే అత్యల్పంగా 0.63% నమోదైంది. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఇక నియంత్రణ చర్యల విషయానికొస్తే జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నాం. అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలను సమానంగా అందించాలన్నదే లక్ష్యం. మెడికల్ కాలేజీలు ఏర్పాటైనప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు. అప్పుడే ఆ మెడికల్ కాలేజీలను అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది. అప్పుడే మేం ఎదురుచూస్తున్న అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది. దీనికి మూడేళ్ల కాలపరిమితి విధించుకున్నాం. మొత్తం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మూడేళ్లలో రూ.16 వేల కోట్లు సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నాం. 25 లక్షల మందికి ఉచిత వైద్యం హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి వస్తే ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టారు. దాదాపు వెయ్యి చికిత్సా విధానాలు ఇందులో కవర్ అవుతున్నాయి. ఏపీలో ప్రత్యేకంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి 2,446 చికిత్స విధానాలకు వర్తింప చేస్తున్నాం. 1.44 కోట్ల ఇళ్లకి ఆరోగ్యశ్రీ కార్డులు అందచేసి లబ్ధిదారుల ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో దాదాపు 1.53 కోట్ల కుటుంబాలు ఉండగా 1.44 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. గత మూడేళ్లుగా 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందచేశాం. స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ కోవిడ్ లాంటి మహమ్మారులు చెలరేగినప్పుడు ప్రధానంగా నివారణ, నియంత్రణ, చికిత్సపై దృష్టి పెట్టాలి. వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలంటే అవైలబులిటీ, యాక్సెస్‌బులిటీ, ఎఫర్ట్‌బులిటీ.. ఈ మూడూ సమాంతరంగా అందుబాటులోకి రావాలి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు నెలకొల్పుతున్నాం. తద్వారా ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తారు. వారు రోజు విడిచి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్లుగా గ్రామాల్లో ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ సేవలు అందించడంతో పాటు విలేజ్ క్లినిక్‌ను మెడికల్ హబ్‌గా వినియోగించుకుంటారు. ఇందులో ఏఎన్‌యమ్, నర్సింగ్ గ్రాడ్యుయేట్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీస్నర్, ఆశా వర్కర్లు ఉంటారు. దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి -
హీరో మోటోకార్ప్‌పై ఐటీ దాడులు..కీలక విషయాలు వెల్లడి..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్‌పై ఐటీ శాఖ దాడులను జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలు డాక్యుమెంట్లను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. హీరో మోటోకార్ప్, కంపెనీ ఎండీ పవన్ ముంజల్ పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. బోగస్ ఖర్చులు.. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని పలు ప్రదేశాలలో మార్చి 23 నుంచి మార్చి 26 వరకు హీరో మోటోకార్ప్, సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్‌పై ఆదాయపు శాఖ సోదాలను నిర్వహించింది. 40 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. సోదాల్లో భాగంగా సంస్థ కార్యకలాపాలకు సంబంధించి హార్డ్ కాపీ డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా రూపంలో పెద్ద సంఖ్యలో నేరారోపణలకు సాక్షాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో హీరో మోటోకార్ప్ సంస్థ సుమారు రూ. 1000 కోట్లకు పైగా బోగస్ ఖర్చులను చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. చట్టం ఉల్లంఘన..! ఐటీ చట్టంలోని సెక్షన్ 269 ఎస్ఎస్ను పవన్ ముంజల్ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గతంలో ముంజల్ ఛత్తర్‌పూర్‌లో ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశాడు. పన్ను ఆదా కోసం ఫామ్‌హౌస్ కొనుగోలుపై మార్కెట్ ధరను తారుమారు చేసి, సుమారు రూ. 100 కోట్ల కంటే ఎక్కువ నగదు చెల్లించడానికి నల్లధనాన్ని ఉపయోగించాడని సమాచారం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం స్థిరాస్థి లావాదేవీల్లో రూ.20వేలు అంతకంటే ఎక్కువ నగదు రూపంలో స్వీకరిస్తే శిక్షను విధిస్తారు. ఐటీ శాఖ పలు కీలక విషయాలను బహిర్గతం చేయడంతో హీరో మోటోకార్ప్ షేర్లు సుమారు 8 శాతం మేర తగ్గాయి. చదవండి: టాక్స్ పేయర్లకు అలర్ట్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..! -
హీరో మోటోకార్ప్‌పై ఐటీ శాఖ దాడులు..! కంపెనీ ఛైర్మన్ ఇంట్లో సోదాలు
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని హీరో మోటోకార్ప్ కార్యాలయంతో పాటు సంస్థ సీఈవో పవన్ ముంజల్ నివాసంలో ప్రస్తుతం సోదాలు జరుపుతోంది. హీరో మోటోకార్ప్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 25 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కంపెనీ, కంపెనీ ప్రమోటర్లకు చెందిన ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పత్రాలను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆదాయ పన్ను శాఖ సోదాలపై ఇప్పటికైతే ఆ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐటీ దాడుల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ స్టాక్స్ 1.5 శాతం మేర పడిపోయాయి. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ దాదాపు 40 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో యూనిట్ వాల్యూమ్ విక్రయాల పరంగా 2001లో హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మాన్యుఫాక్చరర్‌గా నిలిచింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 100 మిలియన్ యూనిట్స్ విక్రయాలు చేపట్టింది. దేశీయ ద్విచక్ర వాహన తయారీ రంగంలో హీరో మోటోకార్ప్‌కి 50 శాతానికి పైగా షేర్ ఉంది. చదవండి: టీసీఎస్ సంచలనం..5జీ..6జీ!! -
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫస్ట్ లుక్ !
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో జోరు తగ్గడం లేదు. వరుసగా ఒక్కొ కంపెనీ తమ మోడళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైతం తన ఈవీ మోడల్‌కి సంబంధించిన వివరాలను చూచాయగా వెల్లడించింది. హోరీ మోటార్ కార్పో పదో వార్షికోత్సం సందర్భంగా ఆ సంస్థ అధినేత పవన్ ముంజాల్ హీరో అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు తమ సంస్థ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ని అభిమానులకు చూపించారు. పదో వార్షికోత్సం సందర్భంగా ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్‌లో సప్రైజింగ్ ఎలిమెంట్‌గా ఈవీ స్కూటర్ని పరిచయం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పవన్ ముంజాల్. స్థబ్ధుగా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఓలా రాకతో అలజడి మొదలైంది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించి రికార్డు సృష్టించింది. పైగా ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్ ఓలా స్కూటర్‌కి సంబంధించి ఒక్కో ఫీచర్‌ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ మార్కెట్లో ఆసక్తి పెంచారు. దీంతో మిగిలిన కంపెనీలపైనా ఒత్తిడి పెరిగింది. తమ సంస్థ నుంచి రాబోతున్న వాహనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించక తప్పని పరిస్థితి ఎదురైంది. దీంతో భవీష్ మార్కెటింగ్ టెక్నిక్‌నే ఫాలో అయారు. పవన్ ముంజాల్. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించకుండా కేవలం స్కూటర్ కనిపించేలా వీడియోను బయటకు వదిలారు. హీరో పదో వార్షికోత్సం ఈవెంట్లో లభించిన ఫోటో వివరాల ప్రకారం హీరో స్కూటర్లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనో సస్పెన్షన్లు ఉపయోగించారు. ఫ్రంట్‌వీల్ డయా 12 ఇంచులు ఉండగా రియర్ వీల్ డయా 10 ఇంచులుగా ఉంది. మిగిలిన ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ సైజ్‌లో పెద్దదిగా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్, బ్యాకప్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఈ రెండు సమస్యలపై ఫోకస్ చేస్తూ.. తమ స్కూటర్‌ను మార్కెట్లోకి తెస్తామంటూ హీరో గతంలో ప్రకటించింది. ఈ మేరకు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీకి సంబంధించి తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీతో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
హీరో మోటో భారీ విస్తరణ ప్రణాళికలు
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్.. భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ఇందు కోసం వచ్చే 5–7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ ప్రకటించారు. ఈ ఏడాదిలో 10 కోట్ల వాహన విక్రయాల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని వెల్లడించారు. బీఎస్–6 గ్లామర్ విడుదల: భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్ఘార నిబంధనలకు అనుగుణంగా ఉన్న హీరో గ్లామర్ బైక్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధరల శ్రేణి రూ. 68,900– 72,000 కాగా, ప్యాషన్ ప్రో ధరల శ్రేణి రూ. 64,990– 67,190గా నిర్ణయించింది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. -
అటూఇటుగా బైక్‌ల విక్రయాలు..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో మిశ్రమంగా నిలిచాయి. పలు సంస్థల అమ్మకాలు 30 శాతానికి మించి వృద్ధిరేటు నమోదు చేయగా.. మరికొన్ని కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అత్యధిక వాల్యూమ్స్‌ను నమోదు చేస్తున్న హీరో మోటోకార్ప్ దేశీ అమ్మకాలు 4 శాతం తగ్గాయి. ఈ అంశంపై స్పందించిన సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్.. ‘లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత, పెరిగిన ద్విచక్ర బీమా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.’ అని వ్యాఖ్యానించారు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ దేశీ అమ్మకాలు 13 శాతం తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అమ్మకాలు 41 శాతం వృద్ధి చెందాయి. ఇదే సమయంలో సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 33.82 శాతం, ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 30 శాతం పెరిగాయి. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరగాలనేది సంస్థ లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 5,45,683 యూనిట్లను విక్రయించాం.’ అని ఎస్ఎంఐపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా అన్నారు. మరోవైపు బజాజ్ ఆటో గతనెల మొత్తం విక్రయాలు 18 శాతం, దేశీ అమ్మకాలు 31 శాతం, ఎగుమతులు 16 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాల్లో 6 శాతం, దేశీ అమ్మకాల్లో ఒక శాతం, ఎగుమతుల్లో 22 శాతం పెరిగాయి. ఈ సంస్థ స్కూటర్ విక్రయాలు 9 శాతం పెరిగి 91,480 యూనిట్లుగా నిలిచాయి. ఫోర్డ్ అమ్మకాలు 14.8% అప్ 2018 డిసెంబర్ దేశీ అమ్మకాలు 5,840 యూనిట్లుగా ఉన్నట్లు ఫోర్డ్ ఇండియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 5,087 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఏడాది ప్రాతిపదికన 14.8% వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. అయితే, ఎగుమతులు 24.8 శాతం తగ్గిన కారణంగా.. గతనెల మొత్తం అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదైనట్లు వివరించింది. సోనాలికా ట్రాక్టర్ విక్రయాలు 12% పెరిగాయి గతనెల్లో ట్రాక్టర్ల అమ్మకాలు 5,052 యూనిట్లుగా సంస్థ ప్రకటించింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోల్చితే 11.9% పెరిగాయి. ఎగుమతులు 26 శాతం, మొత్తం అమ్మకాలు 14% వృద్ధి చెందాయి. జీఎస్టీని తగ్గించాలి.. ప్రస్తుతం కేవలం కొన్ని వస్తు, సేవలపై మాత్రమే 28% జీఎస్టీ రేటు అమల్లో ఉండగా.. ఈ క్యాటగిరీలో ద్విచక్ర వాహనాలూ ఉన్నాయని పవన్ ముంజాల్ వ్యాఖ్యానించారు. విలాస వస్తువులపై ఉండే ఈరేటును సామాన్యులు వినియోగించే బైక్‌లపై విధించడం సరికాదన్నారు. త్వరలోనే బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలు అమలుకానుండగా.. ఈ నిర్ణయం తరువాత బైక్‌ల ధరలు మరింత పెరగనున్నట్లు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని ద్విచక్రవాహనాలపై జీఎస్టీ రేటును 18%కి తగ్గించాలని కోరారు. -
హీరో పగ్గాలుమళ్లీ పవన్ ముంజాల్కే
న్యూఢిల్లీ: దేశీ టూవీలర్ దిగ్గజ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ), సీఈవోగా మళ్లీ పవన్ ముంజాల్ నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. మామూలుగా పవన్ ముంజాల్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కంపెనీ ఈయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది. అలాగే విక్రమ్ కాస్బెకర్కు డెరైక్టర్ల బోర్డులో చోటు కల్పించింది. -
స్ప్లెండర్ కొత్త బైక్ ఐస్మార్ట్ 110
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారి హీరో మోటార్ కార్పొరేషన్, తన మొదటి ఇన్-హోస్ మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 పేరుతో రూ.53,300లకు(ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఈ బైక్ ను అందుబాటులోకి తెచ్చింది. హీరో నుంచి వచ్చిన ఈ కొత్త బైక్ ను, జైపూర్ లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ)లో అభివృద్ధి చేశారు. అంతర్గతంగా అభివృద్ధి చేసిన హీరో బైక్ లో ఇదే మొదటిది. సీఐటీ నుంచి రాబోతున్న కొత్త ప్రొడక్ట్ లో కూడా ఇదే మొదటిదని హీరో మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ తెలిపారు. పవర్ అవుట్ పుట్ ను పెంచడానికి పెద్ద 110సీసీ ఇంజిన్ ను ఈ బైక్ కు పొందుపరిచారు. హీరోస్ ఐ3ఎస్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. డిజైన్ లో ప్రస్తుత తర స్ప్లెండర్ బైక్ లతో పెద్దగా తేడా లేనప్పటికీ, స్టయిల్ లో మాత్రం ఆకర్షణీయంగా ఉందని కంపెనీ చెబుతోంది. 4స్పీడ్ గేర్ బాక్స్, 68కి.మీ/లీటర్ మైలేజ్, 8.9బీహెచ్ పీ, 9ఎన్ఎమ్ పీక్ టార్క్, కొత్త అలాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు ఈ బైక్ ప్రత్యేకతలు. ఈ బైక్ కున్న హెడ్ ల్యాంప్ యూనిట్ కూడా కొత్తదే. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్(ఏహెచ్ఓ) తో పాటు, కొత్త టైల్ ల్యాంప్ ను ఈ ల్యాంప్ యూనిట్ కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న మోటార్ సైకిల్ బ్రాండ్లలో స్ప్లెండర్ ఒకటిగా ఉంది. భారత్ లో, విదేశాల్లో మొత్తం 280లక్షలకు పైగా వినియోగదారులను స్ప్లెండర్ మోడల్ సొంతంచేసుకుంది. -
హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్లు
న్యూఢిల్లీ : హీరో మోటొకార్ప్ కంపెనీ స్కూటర్ల సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లను మంగళవారం ఆవిష్కరించింది. 110 సీసీ కేటగిరిలో మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యూయట్ పేర్లతో ఈ రెండు కొత్త మోడళ్లను అందిస్తోంది. మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ ధరలు రూ.49,500 నుంచి రూ.50,700 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయని హీరో మోటొకార్ప్ చైర్మన్ ఎండీ, సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. వచ్చే నెల 13 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత డ్యుయట్ మోడల్ అమ్మకాలు ఉంటాయని వివరించారు. డ్యుయట్ మోడల్ ధరల వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇప్పటికే మ్యాస్ట్రో, ప్లెజర్ స్కూటర్లను విక్రయిస్తున్నామని, తాజాగా అందుబాటులోకి తెచ్చిన రెండు కొత్త మోడళ్లతో కలుపుకొని తమ మొత్తం స్కూటర్ల సంఖ్య నాలుగుకు పెరిగిందని ముంజాల్ పేర్కొన్నారు. -
హీరో మోటో రూ.5,000 కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కొత్త ప్లాంట్లు... ఒక్కో ప్లాంట్‌పై 1,600 కోట్ల వ్యయం కొలంబియా, బంగ్లాదేశ్‌లలోనూ ప్లాంట్ల ఏర్పాటు... కంపెనీ ఎండీ పవన్ ముంజాల్ వెల్లడి నీమ్రానా(రాజస్థాన్): దేశీ ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ రూ.5,000 కోట్ల భారీ పెట్టుబడులను వెచ్చించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్య విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని... కొలంబియా, బంగ్లాదేశ్‌లలోనూ తయారీ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. రాజస్థాన్‌లోని కుకాస్‌లో గ్లోబల్ పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్అండ్డీ) కూడా నెలకొల్పనున్నట్లు తెలిపారు. కొలంబియా ప్లాంట్‌లో పనులు ఇప్పటికే మొదలయ్యాయని.. బంగ్లాదేశ్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు ముంజాల్ వివరించారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2020కల్లా హీరో మోటో మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 12 మిలియన్ యూనిట్లకు చేర్చాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడి ప్రణాళికలను అమలుచేస్తున్నట్లు ముంజాల్ తెలిపారు. కంపెనీ నాలుగవ ప్లాంట్‌ను మంగళవారం ఇక్కడ లాంఛనంగా ప్రారంభించనుంది. దీని వార్షిక సామర్థ్యం 7,50,000 యూనిట్లు. దీంతో కంపెనీ మొత్తం సామర్థ్యం ఏటా 7.65 మిలియన్ యూనిట్లను అందుకోనుంది. ఇక్కడ హీరో మోటో రూ.1,000 కోట్ల పెట్టుబడిపెట్టింది. గుజరాత్ ప్లాంట్ పనులు వచ్చే నెలలో... గుజరాత్‌లోని హాలోల్‌లో నిర్మించతలపెట్టిన అయిదో ప్లాంట్ పనులు వచ్చే నెలలో మొదలవుతాయని.. ఆ వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ ప్లాంట్(ఆరవది) నిర్మాణంపై దృష్టిపెట్టనున్నట్లు ముంజాల్ చెప్పారు. ఈ 2 కొత్త ప్లాంట్లపై చెరో రూ.1,600 కోట్ల చొప్పున వెచ్చించనున్నట్లు తెలిపారు. కాగా, గుజరాత్ ప్లాంట్ వార్షిక తయారీ సామర్థ్యం 1.8 మిలియన్ యూనిట్లు.. ఏపీ ప్లాంట్ సామర్థ్యం 1.8-2 మిలియన్ యూనిట్లు ఉంటుందన్నారు. కొలంబియా ప్లాంట్‌లో రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. ఇక్కడ కంపెనీ చెరో 1.5 మిలియన్ వార్షిక సామర్థ్యంగల ప్లాంట్లను నెలకొల్పుతోంది. ఇక కుకాస్‌లో ఏర్పాటుచేసే ఆర్అండ్డీ కేంద్రానికి రూ.653 కోట్ల మొత్తాన్ని వెచ్చించాలని భావిస్తున్నట్లు ముంజాల్ పేర్కొన్నారు. -
హీరోమోటో కార్ప్ లాభం 563 కోట్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 563 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 549 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 3% వృద్ధి. ఈ కాలంలో నికర అమ్మకాలు 14%పైగా పెరిగి రూ. 6,999 కోట్లను అధిగమించాయి. గతంలో రూ. 6,127 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుత ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ ఇకపై వైస్‌చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ 10% అధికంగా 17,15,254 వాహనాలను విక్రయించింది. గతంలో 15,59,282 వాహనాలు అమ్ముడయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 30 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. వృద్ధిని కొనసాగిస్తాం ఆటో పరిశ్రమ మందగించినప్పటికీ అమ్మకాల్లో వృద్ధిని కొనసాగించగలిగినట్లు ముంజాల్ పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదైన ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇకపై రెండంకెల వృద్ధిని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. మంగళవారం మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% నష్టంతో రూ. 2,854 వద్ద ముగిసింది. -
హీరో ఆరో ప్లాంట్.. దక్షిణాదిన
స్థలం కోసం అన్వేషణ కంపెనీ సీఈవో పవన్ ముంజాల్ సావో పాలో: హీరో మోటోకార్ప్ ఆరో ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దక్షిణ భారతదేశ మార్కెట్ అవసరాలను తీర్చడం లక్ష్యంగా అక్కడ ఆరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. స్థలం కోసం అన్వేషిస్తున్నామని చెప్పిన ఆయన ఎప్పటికల్లా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కంపెనీ మూడు ప్లాంట్లు-ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, హర్యానాలోని గుర్గావ్, దారుహెరల్లో టూవీలర్లను ఉత్పత్తి చేస్తోంది. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 69 లక్షలు. నాలుగో ప్లాంట్‌ను రూ.400 కోట్ల పెట్టుబడులతో రాజస్థాన్‌లోని నీమ్రాణాలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌తో కలుపుకుంటే కంపెనీ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 76.5 లక్షలు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నడుస్తోందని, త్వరలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ముంజాల్ పేర్కొన్నారు. ఇక గుజరాత్‌లోని హలోల్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడులతో ఐదో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 18 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. దక్షిణ భారతంలో ఏర్పాటు చేయనున్న ఆరో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్లకు పెరుగుతుంది. కాగా దేశీయంగా తమ వాహనాలు మంచి అమ్మకాలు సాధించగలవన్న ధీమాను పవన్ ముంజాల్ వ్యక్తం చేశారు. మరోవైపు తాము క్రీడలకు సంబంధించి టీమ్‌ను కొనుగోలు చేసే యోచనేదీ ప్రస్తుతానికి లేదని, కేవలం స్పాన్సరర్లుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఫుట్‌బాల్ క్రీడ అంటే ఇష్టమని వివరించారు. -
హీరో డీజిల్ బైక్!
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కంపెనీ త్వరలో డీజిల్ బైక్‌ను మార్కెట్లోకి తెస్తోంది. ఆర్ఎన్టీ 150 సీసీ పేరుతో కాన్సెప్ట్ డీజిల్ బైక్ కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. దీంతో పాటు హైబ్రిడ్ స్కూటర్, మరో మూడు మోడళ్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. డీజిల్ బైక్ మినహా ఇతర మోడళ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తెస్తామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. ఈ కొత్త మోడళ్లలో మూడు మోడళ్లు -ఆర్ఎన్టీ డీజిల్ బైక్, హైబ్రిడ్ స్కూటర్ లీప్, 250 సీసీ స్పోర్ట్స్ బైక్ హెచ్‌ఎక్స్‌ఆర్250ఆర్లు పూర్తిగా కొత్తవని వివరించారు. వీటితో పాటు 110 సీసీ స్కూటర్ డాష్, 150 సీసీ బైక్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్-ఇవి రెండూ ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లపైనే తయారు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 150 సీసీ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బైక్‌ను, రెండో క్వార్టర్లో డాష్ స్కూటర్‌ను అందిస్తామని వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో హైబ్రిడ్ స్కూటర్‌ను, 250 సీసీ స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. డీజిల్ బైక్‌పై మరింత కసరత్తు డీజిల్ ఇంజిన్ బైక్‌పై మరింత రీసెర్చ్ చేయాల్సి ఉందని పవన్ ముంజాల్ వివరించారు. ఈ డీజిల్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు మరింత సమయం పడుతుందని వివరించారు. రానున్న కాలంలో ఈ బైక్‌కు యాక్సెసరీలు అందిస్తామని, మరిన్ని వేరియంట్లను తెస్తామని, భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ బైక్‌ను విక్రయిస్తామని పేర్కొన్నారు. మంచి మైలేజీ ఇచ్చేలా, టూ-వీల్ డ్రైవ్ తదితర ఫీచర్లతో ఈ బైక్‌ను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. పెట్రోల్‌తోనూ, కరెంట్తోనూ నడిచే హైబ్రిడ్ స్కూటర్ లీప్‌ను మొదటగా పాశ్చాత్య దేశాల్లో మార్కెట్ చేస్తామని, ఆ తర్వాత భారత్‌లోకి తెస్తామని వివరించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే లేదా ట్యాంక్ ఫుల్ చేస్తే 340 కి.మీ. దూరాన్ని ఈ స్కూటర్ ప్రయాణిస్తుందని వివరించారు. -
‘హీరో’ లాభం 9% వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో రూ.481 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.441 కోట్ల లాభంతో పోలిస్తే 9.26 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.5,151 కోట్ల నుంచి రూ.5,696 కోట్లకు ఎగబాకింది. 10.58 శాతం పెరుగుదల నమోదైంది. వాహన అమ్మకాల్లో స్థిరమైన వృద్ధే మెరుగైన ఫలితాలకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. 6 శాతం పెరిగిన విక్రయాలు... జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ 14,16,276 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 13,32,805 టూవీలర్లతో పోలిస్తే 6.26% వృద్ధి నమోదైంది. ‘ప్రస్తుతం పండుగ సీజన్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. సెంటిమెంట్ మెరుగ్గానే ఉంది. మార్కెట్లో కొనుగోళ్లు సానుకూలంగానే ఉన్నా యి. క్యూ2లో పనితీరును పరిశీలిస్తే... తాము పటిష్టమైన మార్జిన్లను సాధించగలమనే విషయాన్ని చాటిచెప్పాం’ అని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ పేర్కొన్నారు. అయితే, వాహన పరిశ్రమకు సవాళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత ప్రభావంతో వాహన రంగంతోపాటు పలు రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన వివరించారు. ఉక్కు, నికెల్, కాపర్, రబ్బర్ వంటి కమోడిటీల ధరలకు రెక్కలొస్తున్నాయని, ఉత్పాదక వ్యయం తడిసిమోపెడవుతోందని చెప్పారు. కాగా, బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 0.86 శాతం పెరిగి రూ.2,088 వద్ద స్థిరపడింది.