తాన్లా సొల్యూషన్స్ లాభం రూ. 10 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాన్లా సొల్యూషన్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 9.7 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 4.06 కోట్లు. తాజా క్యూ2లో ఆదాయం రూ. 106 కోట్ల నుంచి రూ. 135 కోట్లకు పెరిగింది.
అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో సేవలందించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని సంస్థ సీఎండీ ఉదయ్ రెడ్డి తెలిపారు. మూడో త్రైమాసికంలో ఆదాయం రూ.144 కోట్ల నుంచి రూ.148 కోట్ల దాకా, లాభం రూ. 9.3 కోట్ల నుంచి రూ. 9.9 కోట్ల దాకా ఉండొచ్చని సంస్థ గెడైన్స్ ఇచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సర కాలానికి మొత్తం ఆదాయాలు రూ.509.7 కోట్ల నుంచి రూ. 532.8 కోట్ల దాకా, లాభం రూ. 32.6 కోట్ల నుంచి రూ. 35.1 కోట్ల దాకా ఉండగలవని కంపెనీ అంచనా.