
దేశంలో పేరెన్నికగల బజాజ్ గ్రూపు ఫ్యామిలీ మెంబర్స్ ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్లను గత నెలలో కొనుగోలు చేశారు. బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ కుటుంబ సభ్యుల పేరిట ఈ అపార్ట్‌మెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ముంబైలో పోష్ ఏరియాలో ఉన్న కార్మికైల్ రెసిడెన్సీలోని ఈ ఆపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
శేఖర్ బజాబ్ సతీమణి కిరణ్ బజాజ్ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ 8వ అంతస్థులో 3,183 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్ కోసం రూ. 47 కోట్లు వెచ్చించారు. రూ.2.82 కోట్ల స్టాంప్ డ్యూటీ కట్టారు. శేఖర్ బజాజ్ కోడలు పూజా బజాజ్ ఇదే అంతస్థులో మరో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా దాని ఖరీదు రూ.47 కోట్లుగా ఉంది. స్టాంప్ డ్యూటీ రూ.2.82 కోట్లు చెల్లించారు.
మొత్తంగా బజాజ్ కుటుంబ సభ్యులు మొత్తంగా రూ. 97 కోట్ల రూపాయలు వెచ్చించి రెండు అపార్ట్‌మెంట్లను సొంతం చేసుకున్నారు. ఈ డీల్ 2022 ఏప్రిల్ 28న జరిగింది. ప్రతీ అపార్ట్‌మెంట్‌కి నాలుగు కార్ పార్కింగ్ స్లాట్స్ లభించాయి.
చదవండి: విలాస ఇళ్లకు భారీ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment