Bajaj electronics
-
హైదరాబాద్: నెక్సస్ మాల్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ గ్రాండ్ ఫినాలే బంపర్ డ్రా (ఫోటోలు)
-
కూకట్పల్లి షాపింగ్‌మాల్‌లో డింపుల్ హయాతి సందడి (ఫొటోలు)
-
బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో అదిరింది
న్యూఢిల్లీ: కన్జూమర్ వస్తు రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్ సాధించింది. ఇష్యూ చివరి రోజు శుక్రవారానికల్లా 72 రెట్లు అధికంగా స్పందన లభించింది. షేరుకి రూ. 56–59 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 6.25 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి ఉంచింది. అయితే ఏకంగా 449.53 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండుతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 169.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 63.59 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 19.7 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. -
బజాజ్ ఎలక్ట్రానిక్స్@రూ. 56–59
న్యూఢిల్లీ: రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. అక్టోబర్ 4న ప్రారంభమయ్యే ఇష్యూకి రూ. 56–59 ధరల శ్రేణిని ప్రకటించింది. 7న ముగియనున్న ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండుతో కంపెనీ వినియోగ వస్తువుల విక్రయ స్టోర్లను నిర్వహిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 254 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పవన్ కుమార్ బజాజ్, కరణ్ బజాజ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంపెనీకి 36 పట్టణాలలో 112 మల్టీబ్రాండ్ ఔట్లెట్స్ ఉన్నాయి. చదవండి: మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు! -
కుషాయిగూడ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీ
-
రూ. 97 కోట్లు పెట్టి ఖరీదైన అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసిన బజాజ్ ఫ్యామిలీ
దేశంలో పేరెన్నికగల బజాజ్ గ్రూపు ఫ్యామిలీ మెంబర్స్ ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్లను గత నెలలో కొనుగోలు చేశారు. బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ కుటుంబ సభ్యుల పేరిట ఈ అపార్ట్మెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ముంబైలో పోష్ ఏరియాలో ఉన్న కార్మికైల్ రెసిడెన్సీలోని ఈ ఆపార్ట్మెంట్లు ఉన్నాయి. శేఖర్ బజాబ్ సతీమణి కిరణ్ బజాజ్ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ 8వ అంతస్థులో 3,183 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్మెంట్ కోసం రూ. 47 కోట్లు వెచ్చించారు. రూ.2.82 కోట్ల స్టాంప్ డ్యూటీ కట్టారు. శేఖర్ బజాజ్ కోడలు పూజా బజాజ్ ఇదే అంతస్థులో మరో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా దాని ఖరీదు రూ.47 కోట్లుగా ఉంది. స్టాంప్ డ్యూటీ రూ.2.82 కోట్లు చెల్లించారు. మొత్తంగా బజాజ్ కుటుంబ సభ్యులు మొత్తంగా రూ. 97 కోట్ల రూపాయలు వెచ్చించి రెండు అపార్ట్మెంట్లను సొంతం చేసుకున్నారు. ఈ డీల్ 2022 ఏప్రిల్ 28న జరిగింది. ప్రతీ అపార్ట్మెంట్కి నాలుగు కార్ పార్కింగ్ స్లాట్స్ లభించాయి. చదవండి: విలాస ఇళ్లకు భారీ డిమాండ్ -
ఐపీవోకు బజాజ్ ఎలక్ట్రానిక్స్
న్యూఢిల్లీ: కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ మరో రెండు ఇష్యూలతో సందడి చేయనుంది. తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా మన్నికైన వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ విక్రయించే ‘బజాజ్ ఎల్రక్టానిక్స్’తోపాటు.. రక్షణ రంగ పీఎస్‌యూలకు ఎల్రక్టానిక్స్ పరికరాలు సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్ చేరింది. వివరాలు చూద్దాం.. ఎల్రక్టానిక్స్ మార్ట్ ఇండియా కన్జూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్.. ఎల్రక్టానిక్స్ మార్ట్ ఇండియా(ఈఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్, కిచెన్ స్టోర్లను నిర్వహించే ఈ కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 134 కోట్లు విస్తరణ వ్యయాలకు, రూ. 200 కోట్లు పెట్టుబడి అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. మరో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులుకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. పవన్ కుమార్ బజాజ్, కరణ్ బజాజ్ ఏర్పాటు చేసిన ఈఎంఐఎల్ తెలుగు రాష్ట్రాలలో వేగంగా వృద్ధి చెందుతోంది. కోటి కస్టమర్లతోపాటు.. 7.5 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్పేస్‌ను కలిగి ఉంది. 2,600 మంది నిపుణులతో 90 స్టోర్లను నిర్వహిస్తోంది. కంపెనీ ఆడియో అండ్ బియాండ్ పేరుతో మరో ప్రత్యేకత కలిగిన స్టోర్ల ఏర్పాటు సన్నాహాల్లో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈఎంఐఎల్ తెలియజేసింది. అంతేకాకుండా ఢిల్లీలోనూ ప్రవేశించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. డేటా ప్యాటర్న్స్.. రక్షణ, వైమానిక రంగాలలో వినియోగించే ఎల్రక్టానిక్ వ్యవస్థలను సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 600–700 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, వాటాదారులు మరో 60,70,675 షేర్లను సైతం విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలు, విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. చెన్నై కంపెనీ డేటా ప్యాటర్న్స్ ప్రధానంగా రాడార్లు, నీటిఅడుగున పనిచేసే కమ్యూనికేషన్, ఏవియానిక్స్ తదితర పలు పరికరాలను రూపొందిస్తోంది. తొలి నానో శాటిలైల్ నియుశాట్ను అభివృద్ధి చేసింది. హరిఓం పైప్ ఇండస్ట్రీస్ స్టీల్ ఉత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ హరిఓం పైప్ ఇండస్ట్రీస్ ఐపీవోకు రానుంది. సెబీ వద్ద ఈ మేరకు పత్రాలను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ.100–120 కోట్లను సమీకరిస్తారు. 85 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. ప్రారంభ వాటా అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని మూలధన అవసరాలు, విస్తరణకు ఖర్చు చేస్తారు. గృహ, మౌలిక, వ్యవసాయం, వాహన, సౌర, ఫ్యాబ్రికేషన్, ఇంజనీరింగ్ రంగాలకు అవసరమైన స్టీల్ ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి వద్ద నూతన ప్లాంటును కంపెనీ స్థాపించనుంది. 2020–21లో రూ.255 కోట్ల టర్నోవర్‌పై రూ.15 కోట్ల నికరలాభం ఆర్జించింది. -
మాళవిక.. తళుకులు..
-
బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఈషా రెబ్బ సందడి
-
రిలయన్స్ చేతికి బజాజ్ ఎలక్ట్రానిక్స్
సాక్షి,ముంబై: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకపక్క భారీ పెట్టుబడులు, మరోపక్క భారీ విస్తరణ వ్యూహాలతో దూసుకుపోతోంది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ప్రత్యర్థులకు ధీటుగా అవతరించింది. ఇప్పుడిక రీటైల్ విభాగంలో భారీ పెట్టుబడులతో రిటైల్ రంగంలో గుత్తాధిపత్యం దిశగా అడుగులు వేస్తున్న రిలయన్స్ తాజాగా మరో కంపెనీని చేజిక్కించు కునేందుకు చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా సౌతిండియాలో పాగా వేసేందుకు బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పంద విలువ రూ.3 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రిలయన్స్ డిజిటల్ పేరుతో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దక్షణాది రాష్ట్రాల్లో హోం అప్లయన్సస్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వాటా మెరుగ్గా ఉంది. కస్టమర్లు భారీగా ఉన్నాయి. బ్రాండ్ వాల్యూ కూడా ఉంది. ఇప్పటికే బిగ్ బజార్ సహా అనేక రిటైల్ బ్రాండ్లతో వ్యాపారం చేస్తున్న ఫ్యూచర్ గ్రూపును సొంతం చేసుకుంది. కాగా 1980లో పవన్ కుమార్ బజాజ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో షోరూంలను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థకు దక్షిణాది రాష్ట్రాల్లో 60 స్టోర్లలో 1,200 మంది సిబ్బంది పని చేస్తున్నారు. -
భాను శ్రీ చేతుల మీదుగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ లక్కీ డ్రా
-
బజాజ్‌తో వన్ ప్లస్ ఇండియా ఒప్పందం
కేపీహెచ్‌బీకాలనీ: ప్రముఖ మొబైల్ ఫోన్ ఉత్పత్తి సంస్థ వన్ ప్లస్ మొదటిసారిగా ఆఫ్‌లైన్ విక్రయాలలో బజాజ్ ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం కూకట్పల్లి సుజనా ఫోరమ్ మాల్లో గల బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో జరిగిన కార్యక్రమంలో వన్ ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇవో కరన్ బజాజ్‌లు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వికాస్ అగర్వాల్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల ఆన్ లైన్ విక్రయాల్లో వన్ ప్లస్ ఇండియా 50శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుందన్నారు. ఆఫ్‌లైన్ విక్రయాల్లో 35 శాతం కలిగి ఉన్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లు బ్రాండ్లు, ధరలు రెండు కూడా ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఒకే విధంగా ఉంటాయని పేర్కొన్నారు. వన్ ప్లస్ స్థాపించిన ఐదేళ్ళలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం ఫోన్ల విక్రయాల్లో 4వ అతి పెద్ద బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. కరణ్బజాజ్ మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో 54 స్టోర్లలోవన్ప్లస్ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
మాల్లో మజా..