న్యూఢిల్లీ: కన్జూమర్ వస్తు రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్ సాధించింది. ఇష్యూ చివరి రోజు శుక్రవారానికల్లా 72 రెట్లు అధికంగా స్పందన లభించింది. షేరుకి రూ. 56–59 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 6.25 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి ఉంచింది.
అయితే ఏకంగా 449.53 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండుతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 169.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 63.59 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 19.7 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment